»   » శరణం గచ్ఛామి నిలుపుదలకు కారణాలివేనా?.. కులాల కంపు, అగ్రవర్ణాలపై ఎక్కుపెట్టిన అస్త్రమా?

శరణం గచ్ఛామి నిలుపుదలకు కారణాలివేనా?.. కులాల కంపు, అగ్రవర్ణాలపై ఎక్కుపెట్టిన అస్త్రమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడంతో శరణం గచ్ఛామి చిత్రం తాజాగా వార్తల్లోకెక్కింది. ఈ చిత్రం విడుదలైతే సమాజంలో శాంతి, భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే కారణంతో సర్టిఫికెట్ నిరాకరించింది. పలు సన్నివేశాలను తొలగించాలని సీబీఎఫ్‌సీ సూచించగా, అందుకు చిత్ర నిర్మాత మురళి బొమ్మకు, దర్శకుడు ప్రేమ్ రాజ్ నిరాకరించారు. దీంతో ఈ చిత్ర విడుదలపై వివాదం నెలకొన్నది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో పలువురు సామాజిక కార్యకర్తులు, ప్రజా ప్రతినిధులు, సినీ విమర్శకులకు ఈ చిత్ర ప్రదర్శనను ఏర్పాటుచేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభున్నతి కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్ల అంశం శరంణం గచ్ఛామి కథా నేపథ్యం.

ప్రస్తుతం రిజర్వేషన్ల అమలును రద్దు చేయాలని అగ్రవర్ణాలు చేస్తున్నాయి. అగ్రవర్ణాల్లోనూ పేదల ఉన్నారని, వారికి అన్యాయం జరుగుతున్నదని ఓ వాదన. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు, ఇవ్వాలని, విద్యాసంస్థల్లో సీట్లు కేటాయించాలనే వాదనను కొన్ని కులాలు వినిపిస్తున్నాయి.

సమాజంలో అలాంటి వాదనలను వ్యతిరేకిస్తూ 4 వేల ఏండ్లుగా ఆధిపత్యం చెలాయిస్తూ అణగారిన వర్గాలు, కులాల అణిచివేతకు గురిచేస్తున్న అగ్రవర్ణాలపై సంధించిన అస్త్రం శరణం గచ్ఛామి. 60 ఏండ్లుగా రిజర్వేషన్లను పొందడం తప్పు కాదని వాదించింది. సమాజంలో అసమానతలు తొలగాలంటే రిజర్వేషన్ల అమలే సమంజసం అని చాటిచెప్పింది.

దేశ జనాభాలో అతితక్కువ శాతం ఉన్న అగ్రకులాలు రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ రిజర్వేషన్లను సరిగా అమలు చేయడం లేదనే పాయింట్ ను దర్శక, నిర్మాతలు ఈ చిత్రంలో లేవనెత్తారు. పదేండ్లపాటు అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లను అమలు చేస్తే సమాజంలో ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలను తొలగించవచ్చనే వాదనను వినిపించారు.

బ్రాహ్మణత్వం హైజాక్ అంటూ...

బ్రాహ్మణత్వం హైజాక్ అంటూ...

దేశ గమనాన్ని శాసించే రాజకీయాల్లో అగ్రవర్ణాలు అధిపత్యం చెలాయించడం అప్రకటిత రిజర్వేషన్లనే అంశాన్ని ఈ సినిమా ద్వారా సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు దేశంలోని పలు ప్రముఖ ఆలయాల్లో ఒక వర్గమే తిష్టవేయడం రిజర్వేషన్ల కిందికి వస్తుందనే విషయాన్ని ఈ చిత్రంలో లేవనెత్తారు. బ్రహ్మణత్వాన్ని ఓ వర్గం హైజాక్ చేసిందని, కేవలం తమ వర్గం చేసే పనిగా ముద్ర వేసుకున్నదనే వాదనను వినిపించారు. అలాంటి వృత్తిలోకి సాధారణ వర్గాలను ఎందుకు అనుమతించరని, ఇంకా ఆలయాల్లోకి తక్కువ కులాల వారిని అనుమతించడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రతిభ అనే వాదనపై ఇలా.

ప్రతిభ అనే వాదనపై ఇలా.

ప్రతిభ ఉన్న పట్టం కట్టాలనే వాదనను సమర్థిస్తూ రాజకీయ నేతలు, పారిశ్రామిక వర్గాలు చేతిలో ఉన్న సంపదను పంపిణీ చేయాలని ఈ చిత్రం ద్వారా చెప్పారు. వ్యవసాయం చేసే ప్రతిభ రైతుకు ఉన్నప్పుడు భూస్వాముల చేతుల్లో వేల ఎకరాలు ఎందుకని, ఉత్పత్తి చేసే సత్తా ఉన్న కార్మికుడికి ఉన్నప్పుడు పారిశ్రామిక వర్గాల చేతుల్లో పరిశ్రమలు ఎందుకనే ప్రశ్నను లేవనెత్తారు. విద్యారంగం, ఉద్యోగరంగంలో మార్కుల కొలమానంగా ప్రతిభను నిర్ణయిస్తూ రిజర్వేషన్ల వ్యతిరేకిస్తున్నప్పుడు ఇతర రంగాల్లో అక్రమ రిజర్వేషన్ల మాటేంటనే ప్రశ్నను దర్శకులు ఈ చిత్రం ద్వారా తమ గళాన్ని వినిపించారు.

అగ్రవర్ణాలపై సినీ అస్త్రం..

అగ్రవర్ణాలపై సినీ అస్త్రం..

ఓ కులం మరో రూపంగా ముద్రవేసుకొని బీసీలుగా చెలామణి అవుతూ విద్యా, రాజకీయ రంగాల్లో లబ్ది పొందుతున్నారనే విమర్శనాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల అధిపత్యాన్ని ప్రశ్నించింది. ముస్లింలను సంపన్నవర్గాల క్యాటగిరీలో పెట్డడం ద్వారా ఆ వర్గం అన్యాయానికి గురి అవుతున్నదని, ఈ కమ్యూనిటీకి చెందిన చాలా మంది సైకిల్ షాపుల్లో పంక్చర్లు చేసుకొనే వారిగా, మెకానిక్ లుగా మారాల్సి వస్తుందనే ఆవేదనను వినిపించారు. ముస్లిం వర్గాలను తీవ్రవాదులుగా గుర్తించే కుట్రను తప్పుపట్టింది.

అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు...

అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు...

కుల రహిత సమాజాన్ని నిర్మించాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అగ్రవర్ణాలు తూట్లు పొడుసున్నాయనే విషయాన్ని ఈ చిత్రంలో తెరకెక్కించారు. అంబేద్కర్ కేవలం దళిత, అణగారిన వర్గాలకు మాత్రమే సానుకూలమని సమాజంలో నెలకొన్న అపోహను తుడిచివేసే ప్రయత్నాన్ని ఈ చిత్రం చేసింది. సమ సమాజ స్థాపన కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయనే ఈ చిత్రంలో వాదన వ్యక్తమైంది. అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అనే పాయింట్ ప్రభావవంతంగా చెప్పారు.

మీడియాకూ ఓ సూచన

మీడియాకూ ఓ సూచన

రాశిఫలాలు, సమాజంపై చెడు ప్రభావం చూపే అంశాలను ప్రసారం చేసే మీడియా సంస్థలు.. సమాజానికి ఉపయోగపడే రాజ్యాంగంలోని విషయాలను ఓ అరగంటపాటు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని ఈ చిత్రం సూచించింది.

కులాల కుంపట్లపై సినీ అస్త్రం

కులాల కుంపట్లపై సినీ అస్త్రం

అగ్రవర్ణాల ధోరణి, ప్రవర్తన, కులాల పేరుతో సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్న రాజకీయ నేతల ప్రవర్తనపై దర్శకుడు సంధించిన బ్రహ్మస్తమే శరణం గచ్ఛామి. కొన్ని కులాలు మాత్రమే అనుభవిస్తున్న ఫలాలను అందరికి పంచడానికి దళిత, గిరిజన, వెనుకబడిన, అణగారిన వర్గాలకు రాజ్యాధికారమే అందించడమే పరిష్కారమని అంతిమమని సమాజానికి చెప్పే ప్రయత్నం ఈ చిత్రం చేసింది.

సినిమాలో ఇదీ సందేశం

సినిమాలో ఇదీ సందేశం

కథ గమనం లో తమ కు ఉద్యాగాలు రాక పోవడానికి రిజర్వేషన్స్ కాదు, తమ తాత ముత్తతలు పెంచి పోషించిన చాతుర్వర్ణ కుల వ్యవస్థే కారణం అని, వారి వర్ణ ధర్మమే తమకు శాపం గా మరించని అగ్రకుల యువకులు తెలుసుకోవడం ఒక మేలు కొలుపు. కులాల కంపును ఎండగట్టిన ఈ చిత్రం విడుదలయితే నిరసనలు, ఆందోళనలు తలెత్తే ప్రమాదం ఉంటుందన్న వాదనతో శరణం గచ్ఛామికి సీబీఎఫ్‌సీ సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించింది.

English summary
Telugu movie based on caste-based reservations Sharanam Gachchami refused censor certificate The Central Board of Film Certification. It said that likely to affect public order and disrupt peace.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu