Chaari 111 Review వెన్నెల కిషోర్ సీక్రెట్ ఏజెంట్‌గా మెప్పించాడా? చారీ 111 సినిమా సమీక్ష
Rating: 2.75/5
నటీనటులు: వెన్నెల కిషోర్, సంయుక్త మీనన్, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, శుభలేఖ సుధాకర్, సత్య, బ్రహ్మజీ, పావనిరెడ్డి, తాగుబోతు రమేష్ తదితరులు
దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్
నిర్మాత: అదితి సోని
మ్యూజిక్: సైమన్ కే కింగ్
సినిమాటోగ్రఫి: గ్రోవర్ కశిష్
ఎడిటింగ్: రిచర్డ్ కెవిన్
రిలీజ్ డేట్: 2024-03-01
దేశ సమగ్రత, ఐక్యతను దెబ్బ తీసే సంఘ విద్రోహ శక్తులు, అసాంఘీక కార్యకలాపాలు కొనసాగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపడానికి మాజీ సైనికాధికారి ప్రసాద్ రావు అలియాస్ రావు (మురళీ శర్మ) రుద్రనేత్ర అనే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తాడు. ఆ ఏజెన్సీకి ముఖ్యమంత్రి (శుభలేఖ సుధాకర్) సపోర్ట్‌గా ఉంటాడు. ఇలాంటి క్రమంలో హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో మానవ బాంబు పేలడంతో భారీగా విధ్వంసం జరుగుతుంది. ఆ విధ్వంసం వెనుక ఉన్న శక్తులెవరు? అనే దర్యాప్తు అంశాన్ని ఏజెంట్ 111 చారి అలియాస్ బ్రహ్మచారి (వెన్నెల కిషోర్)కి అప్పగిస్తారు.
హైదరాబాద్‌లోని మాల్‌లో పేలిన బాంబు మానవబాంబేనా? ఆ కేసు ఇన్వెస్టిగేషన్‌ను చారి 111 కి అప్పగించడానికి రావు ఎందుకు నిరాకరించాడు? చారి 111 కి ఉన్న లోపాలు ఏమిటి? మానవ బాంబు కేసును చారి ఎలా దర్యాప్తు చేశాడు? చారికి ఏజెంట్ ఇషా (సంయుక్త విశ్వనాథన్) ఎలా సపోర్టుగా నిలిచింది? రుద్రనేత్ర లక్ష్యం నెరవేరిందా? సీఎం మరణాంతరం, ముఖ్యమంత్రి అయిన ఆయన కుమారుడు రుద్రనేత్రకు ఎలాంటి సహకారం అందించారు. ఈ కేసులో చివరకు చారి 111 ఎలాంటి ఫలితాన్ని సాధించాడు అనే ప్రశ్నలకు సమాధానమే చారి 111 సినిమా కథ.

మానవ బాంబు విధ్వంసం తర్వాత దేశభక్తి, దేశ భద్రత గురించి సీఎం (శుభలేఖ సుధాకర్) రావు (మురళీశర్మ) మధ్య జరిగే మధ్య జరిగే ఒక ఎమోషనల్ సీన్‌తో చారీ 111 కథ మొదలవుతుంది. అయితే దర్శకుడు టీజీ కీర్తి కుమార్ ఏదో కొత్త విషయాన్ని ప్రస్తావిస్తున్నారనే విషయం సినిమాపై ఆసక్తిని కలిగించేలా.. కథకు కనెక్ట్ అయ్యేలా చేసింది. కానీ బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్, కాన్సెప్ట్ లేకపోవడంతో మూవీ రెగ్యులర్, రొటీన్ ఫార్మాట్‌లో సాగిందనిపిస్తుంది. కానీ కొన్ని సీన్లలో వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ నవ్వులు పూయించడంతో మూవీ ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. వెన్నెల కిషోర్‌లో ఉండే స్ట్రెంగ్త్‌ను టార్గెట్ చేస్తూ ఫోకస్ పెట్టిన దర్శకుడు కథ, కథనాలపై పెద్దగా ఫోకస్ చేయలేదనిపిస్తుంది. కామెడీతోపాటు ఒక సీరియస్ పాయింట్‌ను డిబేట్ చేసే.. ఎలివేట్ చేసే చాన్స్‌ను దర్శకుడు మిస్ అయ్యారనిపిస్తుంది. ఓవరాల్‌గా దేశభక్తి పాయింట్‌తో సరదాగా వెన్నెల కిషోర్ మార్కు సినిమాను చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.


సాంకేతిక అంశాల గురించిన విషయాలకు వస్తే..మ్యూజిక్, సినిమాటోగ్రఫి అంశాలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయని చెప్పవచ్చు. సైమన్ కే కింగ్ అందించిన మ్యూజిక్ బాగుంది. గ్రోవర్ కాశిష్ అందించిన సినిమాటోగ్రఫి సినిమాను రిచ్‌గా ప్రజెంట్ చేసింది. అదితి సోని అనుసరించిన నిర్మాణ విలువలు ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. దేశభక్తి, కామెడీ ప్రధానంగా సాగే సినిమాలను ఇష్టపడే వారికి చారి 111 నచ్చడానికి అవకాశం ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా.. ఫన్, ఫీల్ గుడ్ అంశాలను థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేద్దామని అనుకొనే వాళ్లు ఈ సినిమాను చూడొచ్చు.


Click it and Unblock the Notifications











