twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చతికిలపడిన 'చక్రం'

    By Staff
    |

    Chakram
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: చక్రం
    విడుదల తేదీ: 25-3-2005
    నటీనటులు: ప్రభాస్‌, ఆసిన్‌, చార్మి, ప్రకాష్‌రాజ్‌, పద్మనాభం,
    తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, నారాయణరావు, ఎవిఎస్‌, ఎమ్మెస్‌ నారాయణ,
    గౌతంరాజు, మల్లిఖార్జునరావు, వేణుమాధవ్‌, జీవా, ఊర్వసి,
    రాధాకుమారి, ఢిల్లీ రాజేశ్వరి, భువనేశ్వరి తదితరులు.
    ఛాయాగ్రహణం: రామ్‌ ప్రసాద్‌, అరవింద్‌కృష్ణ , ఓం ప్రకాష్‌
    సంగీతం: చక్రి
    పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్‌, కందికొండ
    కూర్పు: కృష్ణారెడ్డి
    ఫైట్స్‌: స్టన్‌ శివ
    స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, కృష్ణవంశీ
    సమర్పణ: సి. రోమెష్‌బాబు
    నిర్మాతలు: సి.వెంకట్రాజు, జి.శివరాజు
    కథ, దర్శకత్వం: కృష్ణవంశీ

    క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ, హీరో ప్రభాస్‌ల కాంబినేషన్‌ అయితే మంచి క్రేజ్‌ ఏర్పడడం సహజమే. వారి అంచనాలను తలకిందులు చేస్తూ పాతహిట్‌ 'ప్రేమాభిషేకం' సినిమాను 'చక్రం' పేరుతో ఫ్రీమేక్‌ చేసి థియేటర్లలో దించారు. సినిమాకు ప్రాణమైన కథ ఇటువంటి సినిమాల్లో ప్రేక్షకుల ఊహకు అందుతూ టెంపో లేకుండా చేస్తుంది. అంతే కాక ప్రేక్షకులు ఒరిజినల్‌తో పోల్చి చూసుకుని పొరపాట్లు వెదుకుతూ ఉంటారు.

    అదే కథను మళ్ళీ చెప్పుకుంటే చక్రం(ప్రభాస్‌) రెండొందల కోట్ల ఆస్ధిగల పెద్దారెడ్డి (ప్రకాష్‌రాజ్‌) ముద్దుల కొడుకు. మేనమామ (తనికెళ్ళ) కూతురు లక్ష్మి (ఆసిన్‌)తో పెళ్ళి చేసుకుంటూ సడన్‌గా పెళ్ళి పీటల మీద నుంచి పారిపోతాడు. ఎందుకో ఎవరికీ తెలియదు. యమా సస్పెన్స్‌ అన్నమాట! అందరూ తలో దిక్కూ వెదుకుతుంటారు. చక్రం హైదరాబాద్‌ సహారా కాలనీలో తేలుతాడు. ఆ కాలనీలో ఉంటున్న వారందరికీ తలో సమస్యా ఉంటుంది. వారి సమస్యలను హీరో 'వీజీ'గా పరిష్కరించేస్తూ అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. పనిలో పనిగా చార్మి కుటుంబ సమస్య కూడా తీర్చేసి, ఆమెలో హుషారు నింపి ప్రేమలో పడేస్తాడు. వీరిద్దరి మధ్య ప్రేమ పెరుగుతుండగా ఆసిన్‌ మళ్ళీ ప్రత్యక్షం. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌.

    చక్రం ఇంటికి వెళ్ళి మళ్లీ సహారా కాలనీలో ప్రత్యక్షమవుతాడు. ఇంతకీ అతను ఆసిన్‌ నుంచి ఎందుకు తప్పించుకుంటున్నట్టు? ఎందుకేమిటీ, ప్రేమాభిషేకం చూడలేదా? హీరో గారికి క్యాన్సర్‌. బతికుతాడన్న ఆశ ఉండదు. గతం గుర్తు చేసుకుంటాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో చక్రం ఫారిన్‌లో ఆశిన్‌తో కలిసి మెడిసిన్‌ చదువుకుని అక్కడే ప్రాక్టీసు చేస్తుంటాడు. త్వరలో ఇండియా వెళ్ళి అక్కడ పెద్ద ఆస్పత్రి కట్టి పేదలకు వైద్యసేవ చేయాలనుకుంటాడు. ఈలోగా అతనికి క్యాన్సర్‌ ఉన్నట్టు బయటపడుతుంది. అప్పుడేం చేస్తాడు? అంతకు ముందే క్యాన్సర్‌ సినిమాలు చూసి ఉంటాడు కాబట్టి ఆ క్లెయిమాక్స్‌ని ఫాలో అయిపోతాడు. ఇదండీ కథ.

    సినిమా ప్రారంభంలో 'హుక్‌' చేసే సీన్‌ చాలా బాగా వచ్చి, ప్రేక్షకులు లీనమయ్యేలా చేసింది. ఫ్లాష్‌బ్యాక్‌ను గుర్తుచేసుకునే సీన్లో కన్నీళ్ళు వెనక్కి వెళ్ళడం విజువల్‌గా బాగా వచ్చింది. పాత్రలను పరిచయం చేసిన విధానం బాగుంది. 'జగమంత కుటుంబం' అనే సిరివెన్నెల పాట సంగీత సాహిత్యాల పరంగా బాగుంది.

    సినిమా ఇంటర్వెల్‌ వరకు వెళ్ళినా ఏం జరుగుతున్నదో ప్రేక్షకుడికి అర్ధం కాదు. మొదటి మలుపు సరైన సమయంలో రాక స్క్రీన్‌టైంను వృధా చేయడంతో వచ్చిన ఇబ్బంది ఇది. ఇది ఖచ్చితంగా స్క్రీన్‌ప్లే లోపమే. ప్రేమాభిషేకంలో అక్కినేని, శ్రీదేవి మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా పండాయి. ఇక్కడ అవి ఎండాయి. ఆసిన్‌, ప్రభాస్‌ల లవ్‌ కెమ్రిస్టీ ప్రేక్షకులకు అర్ధం కాదు. సీన్లు సరిగా తీయకపోవడమే దీనికి కారణం. క్లెయిమాక్స్‌కు ముందు హీరో లక్ష్యం (ఆస్పత్రి క ట్టడం) లేటుగా తెలియడంతో ఆసక్తి పోతుంది. అయితే హీరో ఆ లక్ష్యం కోసం కృషి చేయకుండా, తనవాళ్ళ నుంచి తప్పించుకుని తిరుగుతుంటాడు. దీనితో అతని క్యారెక్టర్‌ ఎస్టాబ్లిష్‌ కాదు. అంత పెద్ద డాక్టరు కోర్సు చేసిన ఆసిన్‌ ప్రభాస్‌ సడన్‌గా వేరే అమ్మాయిలతో ఎందుకు తిరిగుతున్నాడో అర క్షణం కూడా ఆలోచించకపోవడం వింతగా ఉంటుంది. చచ్చిపోతానని తెలిసిన హీరో ఆసిన్‌ను తప్పించుకుని తిరుగుతూ చార్మి ప్రేమలో పడడం మరో విడ్డూరం. ఇది ప్రేక్షకులను తక్కువగా అంచనా వేయడమే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X