Chakravyuham: The Trap Review.. ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ.. చక్రవ్యూహంలో ఇరుక్కొన్నది ఎవరంటే?

Rating: 2.5/5

నటీనటులు: వివేక్ త్రివేది, సుదేశ్, ఊర్వశి పరదేశి, ప్రగ్యా నయన్, అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజీవ్ కనకాల, కిరిటీ, శుభలేఖ సుధాకర్, సురేష్, ఊర్వశి పరదేశి, రాజ్ తిరందాసు తదితరులు
దర్శకత్వం: చెట్కూరి మధుసూదన్
నిర్మాత: శ్రీమతి సావిత్రి
సహ నిర్మాత: అజయ్ జాస్తి, చిలుక మహేష్
సమర్పణ: బేబీ అన్
బ్యానర్: సహస్ర క్రియేషన్
మ్యూజిక్: భరత్ మాచిరాజు
సినిమాటోగ్రఫి: అజయ్ జీవీ కుమార్
ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
రిలీజ్ డేట్: 2023-06-02

అనాథ అయిన సంజయ్ (విక్రమ్ త్రివేది)కి ప్రాణ మిత్రుడు శరత్ (సుదేష్). సుదేష్ క్లోజ్ ఫ్రెండ్ సిరి (ఊర్వశి పరదేశి)తో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది. శరత్‌తో కన్ స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ హ్యాపీగా జీవితం సాగుతున్న నేపథ్యంలో సిరి దారుణ హత్యకు గురి అవుతుంది. సిరి మర్డర్‌తో షాక్‌లో ఉన్న సమయంలోనే శరత్ హత్యకు గురవుతాడు. ఈ రెండు మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు సీఐ అజయ్ (అజయ్) రంగంలోకి దిగుతాడు.

Chakravyuham: The Trap Review and Rating: murder Mystery with Interesting twists

సంజయ్‌తో పెళ్లి తర్వాత సిరి ఎలా హత్యకు గురైంది? సిరి హత్య వెనుక అసలు కారణం ఏమిటి? సిరి మరణం తర్వాత సంజయ్ పరిస్థితి ఎలా మారింది? బిజినెస్ పార్ట్‌నర్ శరత్ హత్య తర్వాత సంజయ్ మెంటల్ కండీషన్ ఎలా మారింది. ఈ రెండు హత్యల ప్రభావం సంజయ్‌పై ఎలా చూపింది. సంజయ్ మేనేజర్ ప్రగ్యా నయన్ పాత్ర ఏమిటి? సీఐ అజయ్ కేసును ఎలా పరిష్కరించాడు? ఈ రెండు హత్యల వెనుక అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే చక్రవ్యూహం మూవీ కథ.

మంచి ఎమోషనల్ కంటెంట్‌తో చక్రవ్యూహం ఆసక్తికరంగా మొదలవుతుంది. ఏదో కొత్తదనంతో కూడిన మూవీని చూస్తున్నామని ఫీల్ అవుతున్న నేపథ్యంలో కథ, కథనాలు రొటీన్‌గా మారుతాయి. కథ డిమాండ్ చేయడంతో కొన్ని సన్నివేశాలు నిదానంగా సాగినట్టు అనిపిస్తాయి. అయితే తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ కథ, కథనాల విషయంలో మంచి పరిణతిని చూపించారు.

Chakravyuham: The Trap Review and Rating: murder Mystery with Interesting twists

సెకండాఫ్‌లో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా కొన్ని సన్నివేశాలు థ్రిల్లింగ్ చేస్తాయి. దర్శకుడు చెట్కూరి మధుసూదన్ కథ రాసుకొన్న విధానం, అనుసరించిన కథనం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉందనిపిస్తుంది. కొన్ని సీన్లు ప్రేక్షకులకు మంచి జోష్‌ను కలిగిస్తాయి. ఓవరాల్‌గా మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే.. సంజయ్‌గా వివేక్, సిరిగా ఊర్వశి పరదేశి, శరత్‌గా సుదేష్, ప్రగ్యా నయన్ పాత్రలు యూత్‌ఫుల్‌గా ఆకట్టుకొంటాయి. కొత్తవారైనా మంచి అనుభవం ఉన్న నటులగా తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా ఫర్వాలేదనిపించారు. తనదైన శైలిలో కథను మరింత ఆసక్తికరంగా మల్చడంలో అజయ్ సక్సెస్ అయ్యారు. కీలక పాత్రల్లో కనిపించిన ప్రియ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.

Chakravyuham: The Trap Review and Rating: murder Mystery with Interesting twists

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అజయ్ జీవి కూమార్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. భరత్ మాచిరాజు మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఫస్టాఫ్‌లో కొంత నిడివి తగ్గించి ఉంటే మరింత బాగుండేదనిపిస్తుంది. జెస్విన్ ప్రభు ఎడిటింగ్ బాగుంది. శ్రీమతి సావిత్రి, అజయ్ జాస్తి, చిలుక మహేష్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

లవ్, ఎమోషన్స్, డిఫరెంట్ ట్విస్టులతో సాగే మర్డర్ మిస్టరీ చక్రవ్యూహం. నూతన దర్శకుడు, కొత్త నటీనటులు తమ ప్రతిభను బ్రహ్మండంగా చాటుకొంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేశారు. సాంకేతిక నిపుణులు పనితీరు, నిర్మాణ విలువలు రిచ్‌గా ఉంటాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే డిఫరెంట్ కంటెంట్‌తో ఉన్న సినిమాను చూశామనే ఫీల్ కలుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X