twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛల్ మోహన్ రంగ సినిమా రివ్యూ: రెగ్యులర్ ప్రేమకథ..

    By Rajababu
    |

    Recommended Video

    Nithiin’s Chal Mohan Ranga Movie Review ఛల్ మోహన్ రంగ సినిమా రివ్యూ

    Rating : 2.5/5

    టాలీవుడ్‌లో విజయాలు, అపజయాలు అనేవి పట్టించుకోకుండా యువహీరో నితిన్ దూసుకెళ్తున్నారు. గత 16 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చవి చూశారు. ఆయన నటించిన చిత్రాలు కొన్ని ఘనవిజయాలు, కొన్ని నిరాశపరిచాయి. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం ఛల్ మోహన రంగ. ఈ చిత్రం నితిన్‌కు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నితిన్‌కు 25 వ చిత్రం కావడం, అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించడం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను అందించడం సినిమా స్పెషల్‌గా మారింది. లై చిత్రం నిరాశపరిచిన తర్వాత, ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం నితిన్, మేఘా ఆకాశ్‌లకు ఎలాంటి సక్సెస్‌ను అందించింది? నిర్మాతగా పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రతిఫలాన్ని పొందారు అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     ఛల్ మోహన్ రంగ కథ ఏమిటంటే

    ఛల్ మోహన్ రంగ కథ ఏమిటంటే

    మోహన రంగ (నితిన్) చిన్నప్పటి నుంచే యావరేజ్ స్టూడెంట్. బాల్యంలోనే మేఘా సుబ్రమణ్యం (మేఘా ఆకాశ్) చూసి ఇష్టపడుతాడు. కానీ ఓ కారణంగా విడిపోయిన వారిద్దరూ మళ్లీ అమెరికాలో కలుసుకొంటారు. వారి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. తమను ప్రేమను వ్యక్తీకరించుకోవాలనుకొన్న తరుణంలోనే, కారణం లేకుండానే విడిపోతారు. అలా విడిపోయిన మేఘా ఊటికి చేరుకొంటుంది. మోహనరంగ అమెరికాలో ఉండిపోతాడు. కానీ సంఘటన కారణంగా మేఘాకు దూరమయ్యానని తెలుసుకొన్న మోహనరంగ ఆమెను కలుసుకోవడానికి ఊటికి చేరుకొంటాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరుగుతుంటుంది. ఓ కారణంగా ఆ నిశ్చితార్థం కూడా ఆగిపోతుంది.

    ముగింపు ఎలా అంటే

    ముగింపు ఎలా అంటే

    మేఘా నిశ్చితార్థం ఎందుకు ఆగిపోయింది? మేఘకు నిశ్చితార్థం జరుగుతుందని తెలుసుకొన్న మోహనరంగ ఏమి చేశాడు? అందుకు కారణం ఏమై ఉంటుంది? తన ప్రేమను మేఘాకు మోహనరంగ ఎలా చెప్పి ఒప్పించాడు? ఈ కథలో లిజి, రావు రమేష్, నరేష్ పాత్రలు ఏంటీ? అనే ప్రశ్నలకు తెరపైన సమాధానమే ఛల్ మోహన రంగ చిత్ర కథ.

    ఫస్టాఫ్ స్క్రిప్ట్ అనాలిసిస్

    ఫస్టాఫ్ స్క్రిప్ట్ అనాలిసిస్

    ఇద్దరి మధ్య ప్రేమ కలుగడానికి ఇద్దరి అభిరుచులు కలువాల్సిన అవసరం లేదు. నిత్యం గొడవలు పడుతూ ప్రేమగా జీవించవచ్చు అనే సింగిల్ పాయింట్ ఛల్ మోహనరంగ సినిమా కథ. దీనికి రెగ్యులర్ బాల్యం ఎపిసోడ్స్‌ను జతచేసి ఆరంభంలోనే సాగదీసే ప్రయత్నం జరిగింది. ఓ ఆసక్తికరమైన అంశాన్ని జోడించి ఓ సాధారణ యువకుడు అమెరికాకు పంపడం అనేది కొంత ఇంటరెస్టింగ్ అనిపిస్తుంది. కానీ అమెరికాలో సన్నివేశాలు రొటీన్‌గా అనిపించడం, వాటిలో ఫీల్, డైలాగ్స్‌లో పసలేకపోవడంతో మొదటి భాగం సాదాసీదాగా గడిచిపోతుంది. ఎలాంటి ఎమోషన్ పాయింట్ లేకుండా ఇంటర్వెల్ కార్డు వేయాలి కాబట్టి ఏదో సీన్ పెట్టి వేశారా అనిపిస్తుంది.

    సెకండాఫ్.. స్క్రిప్టు అనాలిసిస్

    సెకండాఫ్.. స్క్రిప్టు అనాలిసిస్

    మోహనరంగ, మేఘ బ్రేకప్ అంశం తర్వాత ఏమైనా ఫీల్ గుడ్ అంశాలతో ముందుకు వెళ్తుందా అంటే అది జరగకపోవడంతో ప్రేక్షకుడికి ఏం జరుగబోతుందో మెల్లగా అర్ధమై పోతుంది. రెండు యాక్సిడెంట్లు, మూడు జోకులతో ప్రీ క్లైమాక్స్‌ను దాటేస్తాడు. ఆ తర్వాత మళ్లీ కొంత సాగదీసి ఏదో ప్రేమకథను ముగించామనే చేతులు దులిపేసుకొన్నట్టు కనిపిస్తుంది.

    దర్శకుడి గురించి

    దర్శకుడి గురించి

    ప్రేమ కథల్లో విభిన్నమైన పాయింట్ అనేది పెద్దగా ఆశించడం అత్యాశే అవుతుంది. కాకపోతే కథ చెప్పే విధానం, బలమైన సన్నివేశాలే ప్రేమకథలకు బలంగా మారుతాయి. ఓ ప్రేమకథను అందంగా చెప్పడంలోనే దర్శకుల ప్రతిభ బయటకు కనిపిస్తుంది. అయితే కృష్ణ చైతన్య చేసిన ప్రయత్నంలో ఈ అంశాలేమీ కనిపించవు. రొటీన్‌గా కథను చెప్పడంతోనే సంతృప్తిపడినట్టు కనిపిస్తుంది. కథ, కథనాలు, డైలాగ్స్‌పై దర్శకుడు మరింత దృష్టి పెట్టి ఉంటే ఫలితం మారోలా ఉండేదనిపిస్తుంది. డైలాగ్స్ అక్కడక్కడ పేలినప్పటికీ.. బలహీనంగా ఉన్న స్క్రిప్టును అండగా నిలబడలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    నితిన్ ఫెర్ఫార్మెన్స్

    నితిన్ ఫెర్ఫార్మెన్స్

    మోహన రంగ లాంటి క్యారెక్టర్లు నితిన్ కొత్తేమీ కాదనిపిస్తుంది. ఈ చిత్రంలో తన క్యారెక్టరైజేషన్ మరింత బలంగా ఉండి ఉంటే నితిన్ మంచి ఫెర్ఫార్మెన్స్‌ అందించడానికి స్కోప్ ఉండేది. అయినా ఎమోషన్, కామెడీ, ఫైట్స్ లాంటి సన్నివేశాల్లో తన మార్కు చూపించాడు. రావు రమేష్ ఇంటికి వెళ్లే సీను, పమ్మిసాయితో మందు తాగే సీన్లు, జాకీ ఎపిసోడ్స్‌లో నితిన్ నటన ఆకట్టుకునేలా ఉంటుంది. ఓవరాల్‌గా మోహన రంగ పాత్రకు నితిన్ న్యాయం చేశాడనే చెప్పవచ్చు.

     మేఘా ఆకాశ్ గ్లామర్

    మేఘా ఆకాశ్ గ్లామర్

    ఇక మేఘా ఆకాశ్ పాత్ర గ్లామర్, ఫెర్ఫార్మెన్స్ మధ్య ఊగిసలాడినట్టు కనిపిస్తుంది. గ్లామర్ కోసం వాడుకోవాలా? లేదా ఫెర్ఫార్మెన్స్ రాబట్టుకోవాలా అనే డౌట్స్ మధ్య మేఘా ఆకాష్ పాత్రను డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. మేఘా ఆకాష్ అటు గ్లామర్‌ను పండించలేక, ఇటు ఫెర్ఫార్మెన్స్ స్కోప్ లేని పాత్రలో నలిగిపోయిందా అనే సందేహం కలుగుతుంది. భావోద్వేగమైన మేఘా సుబ్రమణ్యం పాత్రకు ఆమె కరెక్ట్ కాదేమో అనే ఫీలింగ్ కూడా కలుగకమానదు.

    నటీనటుల ప్రతిభ

    నటీనటుల ప్రతిభ

    నితిన్ తండ్రిగా నరేష్, తల్లిగా ప్రగతి నటించారు. మేఘా ఆకాష్ తల్లిదండ్రులుగా సినియర్ నటి లిజి, సంజయ్ స్వరూప్ కనిపించారు. వీరి పాత్రలకు పెద్దగా చెప్పుకొనే స్థాయి లేకపోవడం ఓ మైనస్. అమెరికాలో కంపెనీ యజమానిగా కనిపించిన ప్రభాస్ శ్రీను పాత్ర కూడా అంతంతే మాత్రంగానే ఉంది. ఉన్నంతలో పమ్మిసాయి రోల్ ఆకట్టుకునేలా ఉంది. పమ్మిసాయి రూపంలో తెలుగు తెరకు మరో మంచి కమెడియన్ లభించాడని చెప్పవచ్చు. పమ్మిసాయి ఎక్స్‌ప్రెషన్స్, టైమింగ్ బాగున్నాయి.

    సీనియర్ నటి లిజి పరిచయం

    సీనియర్ నటి లిజి పరిచయం

    గతంలో అత్తారింటికి దారేది చిత్రంలో నదియా, అజాతవాసి చిత్రంలో కుష్బూను త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిచయం చేసి ఆకట్టుకొన్నాడు. ఇక ఛల్ మెహన రంగ సినిమాలో సినీయర్ నటి లిజిని తెలుగు తెరకు మళ్లీ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ లిజి పాత్ర చాలా నార్మల్‌గా ఉండటం ప్రేక్షకులకు మింగుడుపడని విషయంగా మారింది. అలాంటి క్యారెక్టర్ తెలుగులో ఎంతో మంచి ఆర్టిస్టులు ఉన్నారు. రొటీన్‌ పాత్ర కోసం ఇతర భాషల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది.

    సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

    సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

    ఛల్ మోహన రంగ సినిమాకు నటరాజ సుబ్రమణియన్ అలియాస్ నట్టి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. అటు అమెరికాలోనూ, ఊటీలోనూ సన్నివేశాలను అందంగానూ, ఆహ్లదకరంగా తెరకెక్కించారు. సినిమాకు నట్టి ఫొటోగ్రఫి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. శేఖర్ ఎడిటింగ్ పూర్థిస్థాయిలో సంతృప్తిపరిచే విధంగా లేదు. ఇంకా ఆయన కత్తెరకు పనికల్పించాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సినిమా వేగానికి అడ్డుపడినట్టు అనిపిస్తాయి.

    మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

    మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

    కథ, కథనాలు రొటీన్ ఉన్నప్పటికీ ఎస్ఎస్ థమన్ తన వంతుగా రీరికార్డింగ్‌తో సరిదిద్దే ప్రయత్నాన్ని చేశాడు. తొలిభాగంలో పెద్దపులి పాట మ్యూజిక్‌‌ను, సెకండాఫ్‌లో వారం పాట ట్యూన్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా వాడుకోవడం ఫీల్ గుడ్‌గా అనిపిస్తుంది. మియామీ పాట, గ గ మేఘా, అర్ధం లేని నువ్వు పాటలు ఆడియోపరంగానూ, తెరపైన ఆకట్టుకునేలా ఉన్నాయి.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ఛల్ మోహన రంగ సినిమాకు మంచి హైప్ ఇచ్చిన అంశాల్లో ముఖ్యమైనది ప్రొడక్షన్ వ్యాల్యూస్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతలుగా మారడంతో ఈ సినిమా క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది. నిర్మాత సుధాకర్ రెడ్డి నిర్మాణ విలువలకు పెట్టింది పేరు. ఇవన్నీ ప్రాజెక్టుకు ప్లస్‌గా మారాయి. వీరి పేర్లు మార్కెటింగ్ ఉపయోగపడటం ఖాయం. కథకు ఉపయోగం ఉన్నా లేకపోయినా మంచి లోకేషన్లలో చాలా రిచ్‌గా తెరకెక్కించారు. అవసరం ఉన్నా లేకపోయినా తెరనిందా ఆర్టిస్టులను జొప్పించారు. కానీ కథ, కథనాలనే పెద్దగా పట్టించుకోలేదనే అపవాదును మోయాల్సి వస్తుందేమో.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఛల్ మోహన రంగ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందించారనే విషయంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డైలాగ్స్, కామెడీకి పెద్ద పీటవేయడం ఖాయమని ఊహిస్తారు. పవన్ కల్యాణ్ తొలిసారి నిర్మాతగా మారారంటే ఏదో విషయం ఉండకుండా ఉండదు అని ఫీలింగ్ కలుగుతుంది. వీరి పేర్లు సినిమా ప్రమోషన్‌కు ఉపయోగపడుతాయి. కానీ సినిమాను నిలబెట్టడానికి పెద్దగా ఉపయోగపడకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు నచ్చడం ఖాయం. అదే విధంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమా సూపర్ హిట్‌గా మారే అవకాశం ఉంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    నితిన్ యాక్టింగ్
    సినిమాటోగ్రఫి
    రీరికార్డింగ్, పాటలు
    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మైనస్ పాయింట్స్
    కథ, కథనం
    రొటీన్ టేకింగ్
    నిడివి

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: నితిన్, మేఘా ఆకాశ్, నరేష్, లిజి, రోహిణి హట్టంగడి, రావు రమేష్, సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి తదితరులు
    స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కృష్ణ చైతన్య
    నిర్మాత: ఎం.సుధాకర్ రెడ్డి
    సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి
    సంగీతం: థమన్.ఎస్.ఎస్
    కెమెరా: ఎం నటరాజ సుబ్రమణియన్
    ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్
    నృత్యాలు: శేఖర్ .వి.జె
    ఫైట్స్: స్టంట్ సిల్వ, రవివర్మ
    బ్యానర్: శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్
    రిలీజ్ డేట్: ఏప్రిల్ 5, 2018

    English summary
    Nithiin’s latest movie is Chal Mohan Ranga. This movie is special for Nithiin, because its 25th film for him and A joint production venture of Pawan Kalyan and Trivikram Srinivas, The film also stars Megha Akash, who has teamed up with Nithiin for the second time in a row after last year’s Lie, The film hits the screens on April 5. In this occassion, Telugu Filmibeat brings reviews exclusively for..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X