Champion Movie Review: ఛాంపియన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: రోషన్, అనశ్వర రాజన్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రచ్చ రవి, అర్చన, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి తదితరులు
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
నిర్మాతలు: ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్, ఉమేష్ భన్సాల్
ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి
సినిమాటోగ్రఫి: మది
మ్యూజిక్: మిక్కీ జే మేయర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: పీటర్ హెయిన్స్
క్యాస్టూమ్ డిజైనర్: చంద్రకాంత్ సోనావే
బ్యానర్: స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2025-12-25

Champion Movie Review and Rating in Telugu  Roshan wins hearts with good performance

సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మైఖేల్ (రోషన్ మేక) ఔత్సాహిక పుట్‌బాల్ క్రీడాకారుడు. ఇంగ్లాండ్‌లో మాంచెస్టర్ క్లబ్‌‌ కోసం ఆడే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారుతుంది. ఎలాగైనా ఇంగ్లాండ్‌కు వెళ్లి ఆ క్లబ్‌ తరుఫున ఆడి గొప్ప ఫుట్‌బాలర్ కావాలని కలలు కంటాడు. అదే సమయంలో హైదరాబాద్ స్టేట్‌‌లో రజకార్లకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతుంటాయి. ఆ పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌కు వెళ్లాలంటే ఓ మైఖేల్ తుపాకులకు బీదర్ ప్రాంతానికి తరలించాల్సి వస్తుంది. అయితే అానుకొని విధంగా భైరాన్ పల్లికి తలదాచుకోవాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో హైదరాబాద్ ప్రభుత్వానికి, రజకార్లకు వ్యతిరేకంగా రోషన్ తుపాకి ఎక్కుపెట్టాల్సి వస్తుంది.

హైదరాబాద్ ప్రభుత్వానికి చెందిన టీమ్‌పై సికింద్రాబాద్ జట్టు తరుఫున మైఖేల్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌గా ఎలా నిలిచాడు? మాంచెస్టర్ టీమ్‌కు ఆఢే ఛాన్స్ లభించినప్పటికీ ఏ కారణంగా ఆ అవకాశాన్ని కోల్పోయాడు? ఇంగ్లాండ్‌కు వెళ్లడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? బీదర్‌కు తుపాకుల రవాణా చేయడానికి ఎందుకు ఒప్పుకొన్నాడు? బీదర్ చేరుకోలేకపోవడానికి కారణం ఏమిటి? భైరాన్‌పల్లికి మైఖేల్‌ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? భైరాన్ పల్లిలో జరిగిన సంఘటన మైఖేల్ జీవితాన్ని ఎలాంటి కుదుపులకు, మలుపులకు లోను చేసింది అనే ప్రశ్నలకు సమాధానమే ఛాంపియన్ సినిమా కథ.

రజాకర్ దురాగతాలు, హైదరాబాద్ స్టేట్ విలీనం అంశాలను బేస్ చేసుకొని దర్శకుడు ప్రదీప్ అద్వైతం అల్లుకొన్న కథ బాగుంది. తెలంగాణ ప్రాంతంలో గొప్ప చరిత్ర ఉన్న భైరాన్ పల్లి ఉద్యమం కథలోకి మైఖేల్ అను ఫుట్ బాల్ క్రీడాకారుడు చుట్టూ అల్లుకొన్న కథ కూడా ఇంకా బాగుంది. కానీ కథ చెప్పడంలోనే ఆయన తడబాటుకు గురయ్యాడు. ఫస్టాఫ్‌లో కథను సాగదీసి చెప్పడం.. ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసమే సినిమాను రొటీన్, రెగ్యులర్‌గా సన్నివేశాలను రాసుకొని నడిపించిన విధానం సినిమా వేగానికి పూర్తిగా బ్రేక్ వేసింది. సినిమాలో ఇంటెన్సిటీని కొంత మేరకు ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లు అడ్డంకిగా మారాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను చాలా బాగా తీసి.. ఆ లోపాలను సరిదిద్దుకొనే ప్రయత్నం చేశాడు. ఫస్టాప్‌లో రొమాన్స్, యాక్షన్, చరిత్రకు సంబంధించిన సీన్లతో కిచిడిగా వండేసినట్టు అనిపిస్తుంది.

ఇక సెకండాఫ్‌లో మైఖేల్ కథను ఏ మాత్రం పట్టించుకోకుండా కథనంతా భైరాన్‌పల్లి చుట్టే నడిపించడం ఈ సినిమా మెయిన్ పర్పస్ దెబ్బ తీసేలా చేసింది. అయితే సెకండాఫ్‌లో కథ, కథనాల్లో క్లారిటీ మిస్ అయింది. కాకపోతే వార్ ఎపిసోడ్స్‌ను భారీగా, హైలీ టెక్నికల్ వాల్యూస్‌తో చిత్రీకరించారు. దాంతో ఈ సినిమా సాదాసీదాగా మారిపోయింది. కథలో ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవ్వడం ఈ సినిమాకు మైనస్. అలాగే మైఖేల్ క్యారెక్టర్‌లో ఉండే ఇంటెన్సిటీ తెరపైన కనిపించలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఛాంపియన్ సినిమాకు మైఖేల్‌గా రోషన్ మేకా ఫెర్ఫార్మెన్స్ అల్టిమేట్. కొన్నిసార్లు తెర మీద తన పాత్ర మిస్ అయినా.. కనిపించిన ప్రతీసారి యాక్టింగ్ పరంగా, స్క్రీన్ ప్రజెన్స్ పరంగా ఇరగదీశాడు. యాక్షన్, ఎమోషన్స్, రొమాంటిక్ సీన్లు అనే తేడా లేకుండా అన్ని రకాలుగా తన నటనతో వన్ మ్యాన్ షో అనిపించుకొన్నాడు. అనశ్వర రాజన్ తన పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకొన్నారు. రచ్చ రవి తన లభించిన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మురళీశర్మ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. చాలా రోజుల తర్వాత నందమూరి కల్యాణ్ చక్రవర్తి హుందా పాత్రలో కనిపించారు.

ఈ సినిమా విషయంలో రైటింగ్ ఇంకా బెటర్‌గా ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే సాంకేతిక అంశాలు బలంగా ఉండటం వల్ల చాలా లోపాలు కనిపించకుండా చేశాయి. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమాకు అత్యంత బలంగా నిలిచాయి. చాలా పేలవమైన సీన్లను బీజీఎం వల్ల ఎలివేట్ అయ్యాయి. ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ మరో బ్యూటీ. ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీ, అలాగే స్క్రీన్ మీద రిచ్‌నెస్‌ను తీసుకొచ్చారు. కాస్త కంటెంట్ మీద జాగ్రత్తలు తీసుకొని ఉంటే.. వైజయంతీ మూవీస్‌లో మరో బెటర్ సినిమా అయి ఉండేది. టెక్నికల్‌గా సౌండ్‌గా ఉందే కానీ.. కంటెంట్ పరంగా రిచ్‌నెస్ లేకపోవడం మైనస్. సెకండాఫ్‌లో రజాకర్ సినిమా మరో వెర్షన్ చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాను కేవలం రోషన్ కోసం, టెక్నికల్ వాల్యూస్ కోసం ఓ సారి చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X