Champion First Review: ఛాంపియన్ మూవీ ఫస్ట్ రివ్యూ
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మాతలు ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్, ఉమేష్ భన్సాల్, తెరకెక్కించిన చిత్రం ఛాంపియన్. స్వతంత్రానికి పూర్వం నుంచి చారిత్రాత్మక నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రోషన్, అనశ్వర రాజన్, మురళీ శర్మ తదితరులు నటించారు. ప్రముఖ నిర్మాత సీ అశ్వినీదత్ సమర్పించిన ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. పద్మశ్రీ తోట తరణి ప్రొడక్షన్ డిజైన్, మది సినిమాటోగ్రఫిని, మిక్కీ జే మేయర్ మ్యూజిక్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, పీటర్ హెయిన్స్ ఫైట్స్, చంద్రకాంత్ సోనావానే క్యాస్టూమ్ డిజైనర్‌గా తమ విభాగాల పనితీరును పర్యవేక్షించారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ ఇటీవల ముగిసాయి. ఈ సినిమాపై సెన్సార్ ప్రతినిధులు, అధికారులు వెల్లడించిన అభిప్రాయం ఏమిటి? ఈ సినిమాకు జారీ చేసిన సర్టిఫికెట్ ఏంటి? ఈ మూవీ రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

దేశానికి స్వాతంత్ర్యం సిద్దించడానికి ముందు సికింద్రాబాద్‌లో మైఖేల్ అనే ఔత్సాహిక ఫుట్‌బాల్ క్రీడాకారుడు లండన్ స్థాయిలో తనకు ఇష్టమైన ఆటను ఆడాలని కలలు కంటాడు. అయితే తెలంగాణ ప్రాంతంలోని ఉద్యమాలకు పుట్టినిల్లు భైరాన్‌పల్లి ప్రాంతంలో జరిగిన సంఘటన మైఖేల్ జీవితాన్ని ఎలాంటి మలుపుతిప్పింది? అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ క్రీడాకారుడు కావాలని కలలు కన్న మైఖేల్ ఉద్యమకారుడిగా ఎందుకు మారాడు? అనేది ఈ సినిమా కథ.
1948 ప్రాంతంలో భైరాన్‌పల్లి గ్రామంలో రజాకార్లు జరిపిన దమనకాండపై ఆ గ్రామస్థులు ఎదురుదాడి జరిపారు. అలాంటి చారిత్రాత్మక కథను బ్యాక్ డ్రాప్‌గా తీసుకొని రూపొందించిన ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు అధికారులు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. డైలాగ్స్ పరంగా, సన్నివేశాల పరంగా స్వల్ప మార్పులు సూచించారు. వారి సలహాలు, సూచనల మేరకు కొన్ని మార్పులు చేశాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది. దాంతో సెన్సార్ కార్యక్రమాలు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పూర్తయ్యాయి అని పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) జారీ చేశారు. ఈ మూవీకి యూఏ (U/A 16+) సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఈ సినిమాను 16 ఏళ్లు నిండిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల ఫర్యవేక్షణలో చూడొచ్చని సర్టిఫికెట్‌లో స్పష్టంగా తెలియజేశారు అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.
ఛాంపియన్ సినిమాలో పలు రకాలు సామాజిక కోణాలు, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో కూడిన ఎమోషన్స్, వార్ సీక్వెన్స్ ఉండటం వల్ల ఈ సినిమా కంటెంట్ నిడివి పెరగడానికి డిమాండ్ చేసింది. దాంతో ఈ సినిమా నిడివి 2 గంటల 49 నిమిషాలుగా సెట్ చేశారు. ఈ సినిమాను రన్ టైమ్ సుమారుగా 169 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్టు సెన్సార్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రాన్ని రోషన్ తన నటనతో ఏ రేంజ్‌లో ప్రేక్షకులకు అనుభూతిని పంచారనేది తేలాల్సి ఉంది. ఈ సినిమా గురించిన అప్ డేట్స్ గురించి ఫిలింబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











