twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాణక్య మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.0/5
    Star Cast: https://www.imdb.com/title/tt8933650/
    Director: తిరు

    అర్జున్ అలియాస్ రామకృష్ణ (గోపిచంద్) బయటకు బ్యాంక్ ఉద్యోగి కనిపిస్తూ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)లో పనిచేసే స్పై ఏజెంట్. పాకిస్థాన్‌లో తలదాచుకొన్న ఇబ్రహిం (రాజేశ్ కట్టర్), అతడి కుమారుడు సోహైల్ (ఉపెన్ పటేల్)ను పట్టుకొనేందుకు మిషన్ ప్రారంభిస్తాడు. ఈ ఆపరేషన్‌లో భాగంగా తన నలుగురు తోటి అధికారులు ఇబ్రహింకు బందీలుగా పట్టుబడుతారు. అత్యుత్సాహం అనే పేరుతో పై అధికారులు చివాట్లకు అర్జున్ గురవుతాడు.

    చాణక్య కథ

    చాణక్య కథ

    అర్జున్ అలియాస్ రామకృష్ణ (గోపిచంద్) బయటకు బ్యాంక్ ఉద్యోగి కనిపిస్తూ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)లో పనిచేసే స్పై ఏజెంట్. పాకిస్థాన్‌లో తలదాచుకొన్న ఇబ్రహిం (రాజేశ్ కట్టర్), అతడి కుమారుడు సోహైల్ (ఉపెన్ పటేల్)ను పట్టుకొనేందుకు మిషన్ ప్రారంభిస్తాడు. ఈ ఆపరేషన్‌లో భాగంగా తన నలుగురు తోటి అధికారులు ఇబ్రహింకు బందీలుగా పట్టుబడుతారు. అత్యుత్సాహం అనే పేరుతో పై అధికారులు చివాట్లకు అర్జున్ గురవుతాడు.

    చాణక్య కథలో మలుపులు

    చాణక్య కథలో మలుపులు

    దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అరాచక శక్తులను ఎలా ముట్టుపెట్టాడు? తన నలుగురు తోటి అధికారులను విడిపించడంలో సఫలమయ్యడా? ఈ కథలో ఐశ్వర్య (మెహ్రీన్) పాత్ర ఏమిటి? అలాగే పాక్‌లో నృత్యకారిణిగా ఉంటూ భారత్‌కు సహకరించే జుబేదా (జరీన్ ఖాన్) రోల్ ఏమిటి? చివరకు తన వ్యూహాలతో సోహైల్‌ను భారత్‌కు పట్టుకొచ్చి అధికారుల మెప్పు పొందాడా అనే ప్రశ్నలకు సమాధానమే చాణక్య.

    ఫస్టాఫ్‌లో

    ఫస్టాఫ్‌లో

    సిరియాలో ఉగ్రవాదిని పట్టుకొచ్చే ఓ ఆపరేషన్‌తో చాణక్య మొదలవుతుంది. మధ్యలో హీరోయిన్ మెహ్రీన్ (ఐశ్వర్య) ఎంట్రీతో కాస్త రొమాంటిక్ మారినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత అలీ కుక్క కామెడీతో సినిమాలో సీన్లు వెగటు పుట్టిస్తుంది. ఆ తర్వాత పాక్‌లో ఉండే ఇబ్రహిం నలుగురు రా సిబ్బందిని ఎత్తుకెళ్లడంతో కథ కొంత గంభీరంగా మారుతుంది. ఇబ్రహిం ఇచ్చిన షాక్‌తో ప్రథమార్థం ముగుస్తుంది.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    ఇక సెకండాఫ్‌లో పాక్‌లో ఉన్న ‘రా' సిబ్బందిని విడిపించేందుకు చేసిన ప్రయత్నాలు కనిపిస్తాయి. ఇబ్రహిం, సోహైల్ వేసే ఎత్తులకు అర్జున్ పైఎత్తులకు ఎలా వేశాడనే అంశాలు సినిమాలో కీలకంగా కనిపిస్తాయి. ప్రధానంగా రెండో భాగంగా యాక్షన్ సీన్లు మోతాదు ఎక్కువగానే కనిపిస్తుంది. కథలో, కథనంలో వైవిధ్యం లేకపోవడం సినిమా సాదాసీదాగా అనిపిస్తుంది.

    డైరెక్టర్‌ తిరు గురించి

    డైరెక్టర్‌ తిరు గురించి

    దర్శకుడు తిరు విషయానికి వస్తే చాణక్యలో ఓ స్పై ఏజెంట్ కథలో ఉండే మసాలా ఏ మాత్రం లేకపోవడం ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. కథ, కథనాలు రొటీన్‌గా, సన్నివేశాలు పేలవంగా రాసుకోవడం మరో మైనస్ పాయింట్. సీరియస్‌గా సాగే కథలో వినోదాన్ని జొప్పించే అలీ చేత చేయించిన కుక్క కామెడీ నవ్వులపాలైందనే చెప్పవచ్చు. మెహ్రీన్, గోపిచంద్ మధ్య కెమిస్ట్రీ కూడా ఆసక్తిగా అనిపించదు. ఓవరాల్‌గా నాసిరకమైన కథ, కథనాలతో చేసిన ప్రయత్నం ఆకట్టుకోలేదనే చెప్పాలి.

    గోపిచంద్ ఫెర్ఫార్మెన్స్

    గోపిచంద్ ఫెర్ఫార్మెన్స్


    గోపిచంద్‌ చాణక్యగా నెక్ట్స్ లెవెల్ ఫెర్ఫార్మెన్స్‌ను చూడటానికి అవకాశమే లేకపోయింది. సాదాసీదా సన్నివేశాలకు జీవం పోసేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు. ఫైట్స్, పాటల్లో ఓకే అనిపించారు ఎమోషన్స్ సీన్స్‌లో కూడా పెద్దగా ఆకట్టుకొనే ప్రయత్నం కనిపించదు.

    మెహ్రీన్, జరీన్ ఖాన్ గురించి

    మెహ్రీన్, జరీన్ ఖాన్ గురించి

    ఇక హీరోయిన్ మెహ్రీన్ విషయానికి వస్తే.. ఆటపాటలకు పరిమితమైన పాటలో కనిపించింది. అరకొర సీన్లలో గ్లామర్ పరంగా ఆకట్టుకోలేకపోయింది. పరిమితమైన పాత్ర కావడంతో తనకు తన ఫెర్ఫార్మెన్స్‌ను చూపించుకోవడానికి ఆస్కారం లేకపోయింది. ఇక జరీనా ఖాన్ జుబేదా పాత్రలో ఆకట్టుకొన్నారు. కాస్త సీరియెస్‌నెస్, ఇంటెన్సిటీ ఉండటంతో సెకండాఫ్‌లో గోపిచంద్ పాత్రకు కాస్త బలాన్ని కలిగిందుకు తోడ్పాటు కలిగింది.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    ఇక చాణక్య సినిమాకు ప్రధానమైన విలన్ ప్రతి నాయకులు. రాజేష్ కట్టర్, ఉపేన్ పటేల్ విలన్లుగా తేలిపోయారు. బలమైన ప్రతినాయక పాత్రలు లేకపోవడంతో సీరియస్ కథ టెలివిజన్ సీరియల్‌లా మారిందని అనిపిస్తుంది. కథలో నాజర్ రా అధికారిగా కనిపిస్తాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో తన మార్కు యాక్టింగ్ కనిపిస్తుంది. అలాగే నాసిరకమైన కామెడీతో అలీ ఆకట్టుకోలేకపోయాడు. సిరివెన్నెల రాజా, ఆదర్శ్ తదితరులు పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో నటించారు.

    టెక్నికల్‌‌ పాయింట్స్

    టెక్నికల్‌‌ పాయింట్స్

    చాణక్య సినిమాకు ప్రధాన బలం సాంకేతిక విభాగాలు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫి బాగుంది. విశాల్ చంద్రశేఖర్ రీరికార్డింగ్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. అబ్బూరి రవి మాటలు కొన్ని చోట్ల పేలాయి. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    స్పై ఏజెంట్ సినిమాలు ఇప్పటికే వెండితెరపై చాలానే వచ్చాయి. అయితే వాటికి భిన్నంగా చాణక్య ఏమాత్రం కనిపించదు. నాసిరకమైన కథ, కథనాలు సినిమాకు మైనస్‌గా మారాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే కమర్షియల్‌గా సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి.

    ప్లస్, మైనస్ పాయింట్స్

    ప్లస్, మైనస్ పాయింట్స్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్
    సినిమాటోగ్రఫి

    మైనస్ పాయింట్స్
    కథ, కథనాలు
    వెగటు పుట్టించే హాస్యం
    నాసిరకమైన సన్నివేశాలు
    బలమైన విలనిజం లేకపోవడం
    రొటీన్‌గా కథ సాగడం

    తెరవెనుక, తెర ముందు

    తెరవెనుక, తెర ముందు

    నటీనటులు: గోపిచంద్, మెహ్రీన్ పిర్జాదా, జరీన్ ఖాన్, నాజర్, రాజేష్ కట్టర్, ఉపేన్ పటేల్, సిరివెన్నెల రాజా, ఆదర్శ్ తదితరులు
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తిరు
    రచన: అబ్బూరి రవి
    మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
    సినిమాటోగ్రఫి: వెట్రి పళనిస్వామి
    ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
    బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్
    రిలీజ్: 2019-10-05

    English summary
    Chanakya movie review and rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X