Chand Mera Dil Censor Report: చాంద్ మేరా దిల్ సెన్సార్ రివ్యూ.. 86 సెకన్ల లిప్‌లాక్‌పైనే..
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే, యువ హీరో లక్ష్య నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ చాంద్ మేరా దిల్. హిందీ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరూ యష్ జోహర్, కరణ్ జోహర్, ఆదార్ పూరన్‌వాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా, మర్జికే డిసౌజా తదితరులు నిర్మాతలుగా వ్యవహరించి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ సోని దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ఆస్తా సింగ్, ప్రథమ్ రాథోడ్, ఆశీష్ దూబే, అంకుర్ పోద్దార్, ఎల్వీస్ జోష్ తదితరులు నటించారు.
ఈ సినిమా టెక్నికల్ క్రూ విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: దెబోజీత్ రే, ఎడిటర్: ప్రశాంత్ రాంచంద్రన్, మ్యూజిక్: సచిన్ జిగర్, సచిన్ సాంఘ్వీ, జిగర్ సారైయా అందించారు. ఈ సినిమా మే 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొనే పనిలో పడింది. ఈ సినిమా సెన్సార్ చేసే విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆ అభ్యంతరాలు ఏమిటి? ఈ సినిమాకు లభించిన సెన్సార్ సర్టిఫికెట్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

చాందిని (అనన్య పాండే), ఆరవ్ (లక్ష్య) ఇద్దరూ ఇష్టపడి ప్రేమించుకొంటారు. చాందిని అంటే ఆరవ్‌కు చెప్పలేనంత ఇష్టం. పీకల్లోతు ప్రేమలో ఇద్దరు మునిగి తేలుతారు. పెళ్లికి ముందే రొమాంటిక్ లైఫ్‌ను పూర్తిగా, అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తారు. కానీ వారి ప్రేమకు ఓ కారణం అడ్డుపడుతుంది. ఆ కారణం వల్ల ఆరవ్‌ని చాందిని దూరం పెడుతుంది. ఆ క్రమంలో ఆరవ్ పడిన మానసిక సంఘర్షణ ఏమిటి? ఆరవ్‌ను ఎందుకు చాందినీ దూరం పెట్టింది. ఆరవ్‌ను దూరంగా పెట్టినా గానీ ఎందుకు ప్రేమిస్తూనే ఉంది. చివరకు ఇద్దరి ప్రేమ సఫలం అయిందా? లేదా? అనేది సినిమా కథ.
యంగ్, అడల్ట్ రొమాంటిక్ స్టోరితో రూపొందిన ఈ సినిమాను సెన్సార్ బోర్డు ప్రతినిధులు చూశారు. అయితే ఈ చిత్రంలోని సన్నివేశాలపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ముఖ్యంగా మూడు అంశాలపై తీవ్రంగా స్పందించారు. ఒక సన్నివేశం విషయానికి వస్తే.. 10 సెకన్లకు మించి నిడివి ఉన్న ముద్దు సీన్లపై అభ్యంతరం పెట్టారు. ఆ సీన్లను తొలగించడమే లేదా వాటి స్థానంలో కొత్తగా సన్నివేశాలను చేర్చడం చేయాలని దర్శక, నిర్మాతలను సెన్సార్ ప్రతినిధులు రిక్వెస్ట్ చేశారు.
ఇక రెండో అభ్యంతరం విషయానికి వస్తే.. ఈ చిత్రంలో 1 నిమిషం 26 సెకన్ల రన్‌టైమ్‌తో మరో లిప్‌లాక్ సీన్ ఉంది. ఆ సీన్‌పై సెన్సార్ కఠినంగా స్పందించారు. ఆ లిప్‌లాక్ సన్నివేశాన్ని తొలగించాలని చిత్ర యూనిట్‌ను కోరారు. ఈ సినిమాకు సంబంధించిన 96 సెకన్ల నిడివి ఉన్న మొత్తం కిస్సింగ్ సీన్లను తొలగించాలని సూచించారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు కొన్ని సన్నివేశాలను తొలగించారు. కొన్ని ముద్దు సీన్ల నిడివిని తగ్గించారు. కొన్ని సీన్లపై వివరణ ఇవ్వడంతో సెన్సార్ అధికారులు సానుకూలంగా స్పందించారు అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక మూడో అభ్యంతరం విషయానికి వస్తే.. ఈ సినిమాలో నటించిన బాల నటుల నుంచి నిరభ్యంతర పత్రాలను సమర్పించాలి. తమ ఇష్టపూర్వకంగానే ఈ సినిమాలో నటించామని చైల్డ్ ఆర్టిసుల నుంచి ధృవీకరణ పత్రాలను తీసుకొని తమకు సమర్పించాలని సూచించారు. అయితే చిత్ర యూనిట్ సమర్పించిన పత్రాలను సర్టిఫై చేసిన తర్వాత ఈ చిత్రానికి యూఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు.


Click it and Unblock the Notifications