Chand Mera Dil First Review: చాంద్ మేరా దిల్ మూవీ ఫస్ట్ రివ్యూ

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే, యువ హీరో లక్ష్య నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ చాంద్ మేరా దిల్. హిందీ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరూ యష్ జోహర్, కరణ్ జోహర్, ఆదార్ పూరన్‌వాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా, మర్జికే డిసౌజా తదితరులు నిర్మాతలుగా వ్యవహరించి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ సోని దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ఆస్తా సింగ్, ప్రథమ్ రాథోడ్, ఆశీష్ దూబే, అంకుర్ పోద్దార్, ఎల్వీస్ జోష్ తదితరులు నటించారు.

ఈ సినిమా టెక్నికల్ క్రూ విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: దెబోజీత్ రే, ఎడిటర్: ప్రశాంత్ రాంచంద్రన్, మ్యూజిక్: సచిన్ జిగర్, సచిన్ సాంఘ్వీ, జిగర్ సారైయా అందించారు. ఈ సినిమా మే 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా గురించి సెన్సార్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి? ఈ చిత్రానికి లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

Chand Mera Dil Review by Censor Board

చాందిని (అనన్య పాండే), ఆరవ్ (లక్ష్య) ఇద్దరూ ఇష్టపడి ప్రేమించుకొంటారు. చాందిని అంటే ఆరవ్‌కు చెప్పలేనంత ఇష్టం. పీకల్లోతు ప్రేమలో ఇద్దరు మునిగి తేలుతారు. పెళ్లికి ముందే రొమాంటిక్ లైఫ్‌ను పూర్తిగా, అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తారు. కానీ వారి ప్రేమకు ఓ కారణం అడ్డుపడుతుంది. ఆ కారణం వల్ల ఆరవ్‌ని చాందిని దూరం పెడుతుంది. ఆ క్రమంలో ఆరవ్ పడిన మానసిక సంఘర్షణ ఏమిటి? ఆరవ్‌ను ఎందుకు చాందినీ దూరం పెట్టింది. ఆరవ్‌ను దూరంగా పెట్టినా గానీ ఎందుకు ప్రేమిస్తూనే ఉంది. చివరకు ఇద్దరి ప్రేమ సఫలం అయిందా? లేదా? అనేది సినిమా కథ.

ఈ సినిమాలోని రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దులు, లిప్‌లాక్స్‌పైనే సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన సుదీర్ఘమైన ముద్దును తొలగించాలని సెన్సార్ పట్టుబట్టింది. అలాగే ఇతర ముద్దు సీన్ల నిడివిని తగ్గించాలి లేదా తొలగించాలి లేదా వాటి స్థానంలో మరో సన్నివేశాలను పెట్టి రివ్యూకు ఇవ్వండని సూచించారు. దాదాపు మొత్తం 96 సెకన్ల మేర ముద్దు సీన్లపై కత్తెర వేశారు.

సెన్సార్ సూచనలు, సలహాల మేరకు మార్పులు, చేర్పులతో చిత్ర యూనిట్ సమర్పించిన సినిమాను చూసిన వారు ఈ చిత్రానికి యూఏ (U/A 16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దాంతో ఈ సినిమాను 16 ఏళ్లకు పైబడిన వారందరూ చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుందని సెన్సార్ సర్టిఫికెట్ జారీ సందర్భంగా స్పష్టమైన మార్గదర్శకాలను వెల్లడించారు.

చాంద్ మేరా దిల్ సినిమా నిడివి విషయానికి వస్తే.. ఎమోషనల్ లవ్ స్టోరి కావడం, కథలో పెద్దగా వేరియేషన్స్ లేకపోవడం వల్ల నిడివి పరిమితిగానే ఉంచాల్సి వచ్చింది. ఈ సినిమాకు నిడివి 2 గంటల 15 నిమిషాలు. అంటే 135 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. అనన్య పాండే, లక్ష్య పెర్ఫార్మెన్సెస్ హైలెట్‌గా ఉంటాయి. వివేక్ సోనీ కథ, కథనాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. ఈ సినిమా కంటెంట్ యూత్‌ను ఎట్రాక్ట్ చేసినట్లయితే.. ఆషికీ 2, సయ్యారా తరహా చిత్రం మాదిరిగా ఆడియెన్స్ మంచి అనుభూతిని అందిస్తుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం గురించి ఎక్స్‌క్లూజివ్ అప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X