For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చందమామ కథలు (రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  2.0/5
  ఎల్ బి డబ్ల్యూ, రొటీన్ లవ్ స్టోరీ చిత్రాలతో మంచి మంచి సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రవీణ సత్తారు....ఈ సారి 'చందమామ కథలు' పేరుతో ఒకే సినిమాలో ఎనిమిది కథలు చూపించే ప్రయత్నం చేసారు. ఒక కథతో ఒకదానికి సంబంధం లేకుండా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఈ సినిమా విశేషాలు ఏమిటో చూద్దాం...

  ఈ 8 కథలకు దర్శకుడు ఎలాంటి ముగింపు ఇచ్చాడనేదే 'చందమామ కథలు' సినిమా...

  సార‌ధి (కిషోర్) ఓ ర‌చ‌యిత‌. తన కూతురు వైద్యం కోసం ఐదు ల‌క్ష‌లు అవసరం కావడంతో ఆ డబ్బు సంపాదించడానికి క‌థ‌రాయ‌డం మొదలు పెడతాడు.

  Chandamama Kathalu - Movie Review

  వెంకటేశ్వరరావు (కృష్ణుడు) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెళ్లి కాక ఇబ్బందులు పడుతుంటారు. ఎలాగైనా 30 దాటేలోగా పెళ్లి చేసుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు.

  లీసా (ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌) ఓ టాప్ మోడ‌ల్‌. కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగి పతనం అవుతుంది. దీంతో పాటు ప్రియుడు (ఫృథ్వీ) వదిలి వెళ్లి పోతాడు. దీంతో మద్యం, సిగరెట్లకు అలవాటు అవుతుంది.

  పాత బస్తీలో ఉండే అష్ర‌ఫ్ (అభిజిత్‌) ప్రియురాలు హ‌సీనా (రిచాప‌న‌య్‌) ఆస్తి కోసం ఓ దుబాయ్ కుర్రాడిని పెళ్లి చేసుకుంటుంది.

  చైతన్య కృష్ణ కాలేజ్ స్టూడెంట్. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తన క్లామ్ మేట్ ని ప్రేమిస్తాడు. ఇద్దరూ కలిసి పారిపోవాలనుకుంటారు.

  పల్లెటూర్లో గాలితిరుగుడు తిరిగే రఘు(నాగ శౌర్య) పక్క వీధిలో ఉండే గౌరీ (అమిత రావు) ని ప్రేమిస్తాడు....

  ఓ బిచ్చ‌గాడు (కృష్ణేశ్వ‌ర‌రావు) సొంతింటి కల తీర్చుకునేందుకు రూపాయి రూపాయి కూడబెడతాడు.

  అమెరికా నుంచి ఇండియా వచ్చిన మోహ‌న్ (న‌రేష్‌) భర్త దూరమైన తన మాజీ ప్రియురాలు స‌రిత (ఆమ‌ని)కు దగ్గరవుతాడు. ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటారు.

  ఒకే కాలేజీలో చదువుకునే పేద కుర్రాడు రఘు (చైతన్య కృష్ణ) డబ్బున్న రేణు(షామిని అగర్వాల్)ని లొంగదీసుకుని వాళ్ల ఇంటి అల్లుడు కావాల‌నే ప్లాన్లో ఉంటాడు.

  పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే...దర్శకుడు తన పాత్రలకు అవసరమైన వారిని ఏరికోరి తీసుకున్నాడని స్పష్టమవుతోంది. లక్ష్మి మంచు మోడల్ పాత్రలో ఇమిడి పోయారు. అభిజీత్, రిచా పనయ్ తమ పాత్రలకు న్యాయం చేసారు. పెళ్లికాక వేధన పడుతున్న పాత్రలో కృష్ణుడు, ఒక రచయిత పాత్రలో కిషోర్ ఒదిగిపోయారు. నరేష్ మరియు ఆమని తమ పాత్రలకు తగిన విధంగా నటించారు. బిచ్చటగాడి పాత్రలో కృష్ణేశ్వర రావు పర్ ఫెక్టుగా నటించారు. నాగ శౌర్య, అమిత రావు, చైతన్య కృష్ణ, శామిని అగర్వాల్ తమ పాత్రలకు కావాల్సిన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

  సాంకేతిక విభాగాలు పరిశీలిస్తే డైరెక్షన్ పరంగా దర్శకుడు ఓకే. కథలు కూడా బాగా రాసుకున్నాడు. అయితే స్క్రీన్ ప్లే ఇంకాస్త ఆసక్తికరంగా ఉంటే బాగుండేది. మాటుల కొన్ని చోట్ల తప్ప అన్ని చోట్లా ఆకట్టుకోలేక పోయాయి. నరేష్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. మిక్కీజే మేయర్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్. ఎడిటింగ్ బాగోలేదు.

  సినిమాను పూర్తిగా వాస్తవిక దృక్ఫథంతో తెరకెక్కించాలనే ప్రచత్నం చేసిన దర్శకుడు ప్రేక్షకులకు ప్రధానంగా కావాల్సిన వినోదాన్ని సినిమాలో జొప్పించడంలో విఫలం అయ్యాడు. ఎనిమిది కథల సమాహారం కావడంతో ఏం జరుగబోతోంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో లేకుండా పోయింది. ఇక కమర్షియల్ అంశాలు లేక పోవడం కూడా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గడానికి మరో కారణం. వాస్తవికతను చూపించడం ద్వారా మంచి సినిమా తీసాడనే భావనను తేవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. వినోదం, ఇతర అంశాలు ఆశించి వెళ్లే వారు మాత్రం పూర్తిగా నిరాశ పడే విధంగా సినిమా ఉంది. ఏది ఏమైనా వైవిద్యత చూపిస్తూ దర్శకుడు ప్రవీణ్ సత్తారు చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు.

  English summary
  An anthology film is a feature film consisting of several different short films, which are often tied together by a single theme or premise or brief interlocking event. It is said to be one of very difficult kind of genres of filmmaker and not many have dared to do one in Telugu so far. Praveen Sattaru has done it. Hats off to the young director for trying out a rare genre in Tollywood, which is known for masala entertainers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X