Chandramukhi 2 Review కంగన రనౌత్ చంద్రముఖిగా మెప్పించిందా? చంద్రముఖి2 రివ్యూ

Rating:
2.5/5

నటీనటులు: రాఘవ లారెన్స్, కంగన రనౌత్, వడివేలు, రాధిక శరత్ కుమార్, మహిమ నంబియార్, లక్ష్మీ మీనన్, రావు రమేష్ తదితరులు
రచన, దర్శకత్వం: పీ వాసు
నిర్మాత: సుభాస్కరన్ అల్లిరాజా
సినిమాటోగ్రఫి: ఆర్డీ రాజశేఖర్
ఎడిటింగ్: ఆంటోని
సంగీతం: ఎంఎం కీరవాణి
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2023-09-28

చంద్రముఖి 2 కథ:రంగనాయకులమ్మ (రాధిక శరత్ కుమార్) కుటుంబం రకరకాల సమస్యలతో బాధపడుతుంటుంది. తమ కుల దేవతకు పూజలు చేస్తే సమస్యలు దూరమవుతాయని పూజారి (రావు రమేష్) చెబితే.. ఓ ప్రాంతానికి వచ్చి అంతపురంలోని భవనాన్ని అద్దెకు తీసుకొంటారు. రంగనాయకులమ్మ కుటుంబంతో ఇద్దరు అనాథ పిల్లలకు కేర్ టేకర్‌గా మధు (లారెన్స్ రాఘవ) వ్యవహరిస్తుంటాడు. అంతపురంలో పనిచేసే లక్ష్మీ (మహిమ నంబియార్)ను తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. ఇదిలా ఉండగా, అంతపురానికి యజమాని బసవయ్య (వడివేలు) ఆ అంతపురంలో దక్షిణ ప్రాంతానికి వెళ్లకూడదని చెబుతాడు. కానీ అంగవైకల్యంతో బాధపడే దివ్య (లక్ష్మీ మీనన్) దక్షిణ ప్రాంతంలో ఉన్న గదిలోకి వెళ్లి గంగ కాలి గజ్జెను ధరిస్తుంది.

Chandramukhi 2 movie Review and Rating: Kangana Ranaut unimpressive Show

చంద్రముఖి 2లో ట్విస్టులు:అంతపురంలోని దక్షిణంలో ఉన్న గదిలోకి వెళ్లకూడదని బసవయ్య ఎందుకు చెబుతాడు. 15 ఏళ్ల క్రితం గంగ చేసిన పూజ కోసం వేసిన ముగ్గుపైకి వెళ్లిన వారిని ఎలాంటి సమస్య వెంటాడుతుంది? మధు సంరక్షణలో ఉన్న ఇద్దరు పిల్లలు ఎవరు? దివ్యను చంద్రముఖి ఎందుకు వెంటాడింది? వేట్టాయన్‌తో చంద్రముఖికి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? వేట్టాయన్‌పై చంద్రముఖి ఎందుకు పగ తీర్చుకోవాలని అనుకొన్నది? చంద్రముఖిని లారెన్స్ ఎలా శాంతింప జేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే చంద్రముఖి 2 కథ.

చంద్రముఖి 2 ఎలా ఉంది?:17 ఏళ్ల క్రితం చంద్రముఖి చిత్రం ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా బాక్సాఫీస్‌ను కుదిపేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రం చంద్రముఖిగా సీక్వెల్‌గా వచ్చిన చంద్రముఖి2 చిత్రం విషయానికి వస్తే.. ఎలాంటి కొత్తదనం, కథపై కసరత్తు చేయకుండానే నాసిరకంగా సినిమాను చుట్టేశారనిపిస్తుంది. చంద్రముఖిగా కంగన రనౌత్ అద్బుతంగా ఉండటమే కాకుండా భయపెడుతుందనుకొని ఆశించిన వారికి పూర్తిగా నిరాశను కలిగిస్తుంది. చంద్రముఖి సినిమాను యధావిధిగా మళ్లీ కొత్త నటీనటులతో తీసినట్టు ఉంటుంది. పీ వాసు పూర్తిగా నిరాశపరిచారనే చెప్పాలి.

Chandramukhi 2 movie Review and Rating: Kangana Ranaut unimpressive Show

నటీనటులు పెర్ఫార్మెన్స్ గురించి:ఇక నటీనటుల విషయానికి వస్తే.. లారెన్స్‌ రాఘవ ఈ సినిమా భారాన్నంత మోశాడు. కామెడీ, లవ్, ఎమోషన్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. కానీ కథ, కథనంలో బలం లేకపోవడం వల్ల లారెన్స్ పాత్ర ఆకట్టుకోలేకపోయిందనిపిస్తుంది. ఇక మహిమ నంబియార్ పోషించిన పాత్రకు స్కోప్ తక్కువగానే ఉన్నప్పటికీ.. ఉన్నంతలో అందం, అభినయంతో ఆకట్టుకొన్నది. ఇక చంద్రముఖిగా కంగన రనౌత్ కేవలం అతిథి పాత్రకే పరిమితమైంది. వడివేలు ఉన్నంతలో మంచి హాస్యాన్ని అందించారు.

Chandramukhi 2 movie Review and Rating: Kangana Ranaut unimpressive Show

టెక్నికల్‌గా ఎలా ఉందంటే? :టెక్నికల్ అంశాల విషయానికి.. ఆర్టీ రాజశేఖర్ కెమెరా పనితనం చంద్రముఖి 2 సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా చెప్పుకోవచ్చు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాకు మైనస్. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొలేకపోయాయి. ఆంటోని ఎడిటింగ్ కూడా అంతంతా మాత్రమే. లైకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Chandramukhi 2 movie Review and Rating: Kangana Ranaut unimpressive Show

చంద్రముఖి 2 గురించి ఫైనల్‌గా:చంద్రముఖి 2 సినిమా.. కొత్త సీసాలో పాత సారా లాంటింది. కథలో వైవిధ్యం లేకుండా చంద్రముఖి సినిమా చూసినట్టే ఉంటుంది. కంగన రనౌత్ కేవలం గెస్ట్ పాత్రకు పరిమితం కావడంతో సినిమాకు ఉండే క్రేజీ నీరుగారింది. కంగన రనౌత్ రోల్ కూడా స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల ఆమె అభిమానులు పూర్తిగా నిరాశ పడే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా సాదాసీదాగా మారిపోయింది. చంద్రముఖి చూడని వారికి ఈ సినిమా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. కొత్త నటీనటులతో ఉన్న చంద్రముఖి మూవీని మరోసారి చూడాలనుకొనే వారికి నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X