Chandramukhi 2 Music Review స్టెప్పులతో అదరగొట్టిన వడివేలు.. చంద్రముఖి 2 తొరి బోరి సాంగ్ రివ్యూ
దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ నిర్మాతగా కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్, బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ జంటగా నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2. గతంలో రజనీకాంత్, నయనతార, జ్యోతిక కాంబినేషన్‌లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా వస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, పాటలు రిలీజ్ తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్ కలుగు చేసింది. ఆ ఫీలింగ్‌కు అనుగుణంగానే తాజాగా రిలీజ్ చేసిన నుంచి తొరి బొరి అంటూ రిలీజ్ చేసిన లిరికల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ పాటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
చంద్రముఖి 2 సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలను చూస్తే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ మెలోడిస్‌ను అందించే ప్రయత్నం చేస్తున్నారని అనిపించింది. తాజాగా తొరి బొరి అనే పాట మంచి సాహిత్యంతోపాటు శబ్ద కాలుష్యం లేకుండా సరదాగా సాగిపోయింది అనే ఫీలింగ్ కలిగింది.

తొరి బొరి పాట విషయానికి వస్తే. ఈ పాటకు సీనియర్ గేయ రచయిత భువన చంద్ర సాహిత్యం అందించగా.. యువ గాయకులు అరుణ్ కౌండిన్య, అమల చెంబోలు చక్కగా ఆలపించారు. ఈ పాటలో రాధిక, లారెన్స్ రాఘవ, సినిమాలోని నటీనటులందరూ పాల్గొన్నట్టు కనిపించింది. ఈ పాటకు కళా, దినేష్, బాబా భాస్కర్ నృత్యాలను సమకూర్చారు.
అయితే తొరి బొరి పాటలో లారెన్స్ రాఘవను మినహాయిస్తే.. కమెడియన్ వడివేలు వేసిన స్టెప్పులు, పలికించిన హావభావాలు హైలెట్‌గా మారాయి. నాటు మూమెంట్స్‌తో వడివేలు బాడీలాంగ్వేజ్ అందర్నీ ఆకట్టుకొంటున్నది. మామన్నన్ సినిమాతో మళ్లీ ఓ రేంజ్‌లోకి వచ్చిన వడివేలు చంద్రముఖి 2లో మరోసారి అలరించే ప్రయత్నం చేసినట్టు కనిపించింది.
చంద్రముఖి 2 సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన అట్టహాసంగా దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాలని లైకా ప్రొడక్షన్ ప్లాన్ చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.
నటీనటులు: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, రవిమారియ, శృష్టి డాంగే, శుభిక్ష, వైజీ మహేంద్రన్, రావు రమేష్, సాయి అయ్యప్పన్, సురేష్ మీనన్, శత్రు, టీఎం కార్తీక్ తదితరులు
దర్శకత్వం: పి వాసు
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
నిర్మాత: సుభాస్కరన్
సినిమాటోగ్రఫి: ఆర్‌డీ రాజశేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి
మ్యూజిక్: ఎంఎం కీరవాణి
ఎడిటర్: ఆంథోని
స్టంట్స్: కమల్ కన్నన్, రవివర్మ, స్టంట్ శివ, ఓం ప్రకాష్,
లిరిక్స్: యుగ భారతి, మదన్ కర్కి, వివేక్, చైతన్యప్రసాద్
రిలీజ్ డేట్: 28-09-2023


Click it and Unblock the Notifications











