twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫర్వాలేని 'చంటిగాడు'

    By Staff
    |

    Chantigadu
    -జలపతి గూడెల్లి
    చిత్రం: చంటిగాడు
    నటీనటులు: బాలాదిత్య, సుహాసిని, రాజీవ్‌ కనకాల, ఆహుతి ప్రసాద్‌
    సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌
    నిర్మాత: బి.ఎ.రాజు
    రచన, దర్శకత్వం: బి.జయ

    పదోతరగతి దాటి ఇంటర్లోకి అడుగుపెట్టిన టీనేజ్‌ జంట ప్రేమకథ. సెకాంఢాప్‌ బోర్‌. ఫస్ట్‌ హాఫ్‌ ఫర్వాలేదు. మొత్తమ్మీద సాధారణంగా సాగిన చిత్రమిది. 'సూపర్‌ హిట్‌' సినిమా పత్రిక సహసంపాదకురాలు జయ దర్శకురాలిగా మారి రూపొందించిన తొలి చిత్రం ఇది. సినిమా సాదాసీదాగా మొదలయ్యి మధ్యలో మంచి ఆసక్తిని పెంచుతుంది.

    చివర్లో సాదాసీదాగానే ముగుస్తుంది. తేజ రూపొందించిన 'జయం'కి ఈ సినిమాకు పోలీకలు చాలా ఉన్నాయి. కాకపోతే, 'జయం' చంటిగాడుతో పోలిస్తే చాలా బెటర్‌, ఎంటర్‌ టైనర్‌. 'చంటిగాడు'లో పూర్ణ ఫోటోగ్రఫీ, హీరోయిన్‌ సుహాసిని హైలెట్‌ అని చెప్పాలి. తెలుగు అమ్మాయైన సుహాసినికి మంచి భవిష్యత్‌ ఉంది.

    టెన్త్‌ పాసయ్యి ఇంటర్‌ కు వచ్చిన చంటిగాడు (బాలాదిత్య) మామూలు కుటుంబానికి చెందినవాడు. వాళ్ళమ్మ గుడిలో వంటచేస్తుంది. ఊరిలో జమీందారు తరహాలో ఉండే రెడ్డప్ప (ఆహుతి ప్రసాద్‌) తన కూతురి సీతని (సుహాసిని) గారాబంగా పెంచుతాడు. తొలిసారి పక్క ఊరికి ఇంటర్‌ కోసం పంపుతాడు. రోజూ పడవలో వెళ్ళే చంటిగాడికి, సీతకి మధ్య ఇక ప్రేమ మొదలవుతుంది. చంటిగాడు స్నేహితుల బృందంలో ఉండే ఒకడు తన ప్రియురాలని రాత్రిపూట తీసుకురమ్మని ఆ గ్యాంగ్‌ ను పురమాయిస్తాడు.

    వాళ్ళు పొరపాటున వాడి ప్రియురాలు బదలు సీతను తీసుకొస్తారు. సీతను తీసుకొచ్చామని తెలిసి..వాళ్ళు పారిపోతారు. ఆ అడవిలో అలా సీత, చంటిగాడు ఉండిపోతారు. వీరికోసం రెడ్డప్ప వెతుకుతుండగా, చిన్నప్పుడు సీత కోసం తన భార్యను చంపి జైలుకెళ్ళిన మేనళ్ళుడు ఎంటర్‌ అవుతాడు. సీతను పెళ్ళి చేసుకునేందుకు వాడు ప్రయత్నం చేస్తాడు. చివరికి సీత, చంటిగాడు ఎలా పెళ్ళి చేసుకుంటారనేది చిత్రం.

    ప్రథమార్థం పెద్ద బోర్‌ కొట్టకుండా ఫాస్ట్‌ గా ముగిసిపోతుంది. సెకాండాఫ్‌ లో కథ లేకపోవడంతో అడవిలో చంటిగాడు, సీతల పాటలు, ఫైట్స్‌...తో సినిమాను నడిపించారు. అదీ కూడా ఆల్మోస్ట్‌ 'జయం' టైప్‌ లో. బాలనటుడిగా చేసి హీరోగా మారిన బాలాదిత్య నటన బాగున్నా, పర్సనాలిటీ బాగాలేదు. హీరో క్యాలీటీస్‌ లేవు. హీరోయిన్‌ బాగుంది. రెడ్డప్ప పాత్రలో ఆహుతి ప్రసాద్‌ బాగా చేశాడు. గోదావరి యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్‌ వల్ల ఆ పాత్ర కాస్తా వెరైటీగా అన్పిస్తుంది. రాజీవ్‌ కనకాల పాత్ర ఎంత అతిగా ఉందో, ఆయన నటన కూడా అంతే అతిగా ఉంది.

    దర్శకురాలు జయ టేకింగ్‌ పరంగా ఫర్వాలేదు. కానీ కథ, కథనంలో చాలా వీక్‌ అని ఈ సినిమా ద్వారా అర్థమవుతుంది. అదీ ఆమె రచయిత్రి అయి ఉండి కూడా కథపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడం ఏమిటో! 'గోదావరి తల్లమ్మ'కు ఈ చిత్రాన్ని ఆమె అంకితం చేసినా, గోదావరి జిల్లాల సంస్కృతిని, ఆ చక్కటి వాతావరణాన్ని గొప్పగా చిత్రీకరించలేకపోయారు.

    వంశీ తరహాలో గోదావరి అందాలను బహుశా ఎవరూ ప్రెజెంట్‌ చేయలేరోమో! అయితే, సినిమాటోగ్రాఫర్‌ పూర్ణ గోదావరిలో పడవ వెళుతోన్న విధానాన్ని చిత్రీకరించిన తీరు బాగుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X