twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెకండాఫ్‌లో చల్లబడిన 'ఛత్రపతి'

    By Staff
    |

    Chatrapati
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: ఛత్రపతి‌
    విడుదల తేదీ: సెప్టెంబర్‌ 30, 2005‌
    నటీనటులు: ప్రభాస్‌, శ్రీయ, భానుప్రియ, ప్రదీప్‌ రావత్‌, ‌
    షఫీ, వేణుమాధవ్‌, జయప్రకాష్‌ రెడ్డి, నరేంద్ర ఝా,‌
    జీవా, ఎల్బీ శ్రీరాం, కోట శ్రీనివాసరావు తదితరులు.‌
    కథ: విజయేంద్ర ప్రసాద్‌‌
    మాటలు: ఎం రత్నం‌
    సంగీతం: కీరవాణి‌
    కెమెరా: సెంథిల్‌‌
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి‌
    నిర్మాత: బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌‌

    ప్రభాస్‌- రాజమౌళి చిత్రం 'ఛత్రపతి' క్లాసిక్‌ నేరేషన్‌లో కథను నడిపినా ఫస్టాఫ్‌ పూర్తయ్యేసరికే ఉద్వేగాలు బాగా పెరగడంతో క్లెయిమాక్స్‌ వాతావరణం ఏర్పడింది. సినిమా విజయానికి మూలమైన సెకండాఫ్‌ చప్పబడింది.

    శ్రీలంక నుంచి శరణార్ధిగా వచ్చినవాడు శివాజీ (ప్రభాస్‌). వలస వచ్చే క్రమంలో తల్లి (భానుప్రియ), సవతి తమ్ముడు (షఫి) నుంచి తప్పిపోతాడు. చిన్నప్పుడే జరిగిన సంఘటన శివాజీని నిరంతరం వెంటాడుతుంది. పనికోసం విశాఖపట్నం వచ్చి బాజీరావు అనే స్ధానిక మాఫియా నాయకుడి వద్ద పెరిగి పెద్దవాడవుతాడు. బాజీరావు నిర్బంధంగా పని చేయించికుంటూ తలెత్తిన వారి తల లేకుండా చేస్తుంటాడు. ఒకరోజు ఒక శరణార్ధి తనవారి కోసం వెళుతుంటే అడ్డుపడతాడు. అది చూసి శివాజీ తిరగబడి బాజీరావును, అతని మనుషులను చంపి అక్కడి వారికి స్వాతంత్య్రం కలిగిస్తాడు. ఛత్రపతిగా ఎదుగుతాడు. అయినా శివాజీకి సంతృప్తి కలగదు. తప్పిపోయిన తనవారి కోసం తపన పడుతుంటాడు. తల్లి అడ్రసు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు. అక్కడ పరిచయమైన ఆఫీసరు నీలవేణి (శ్రీయ) అతనితో ప్రేమలో పడుతుంది.

    ఒకరోజు శివాజీకి అనుకోకుండా తమ్ముడు షఫీ కన్పిస్తాడు. షఫి తన అన్నను గుర్తిస్తాడు. శివాజీ తల్లి వద్దకు చేరకుండా షఫీ అడ్డుపడుతుంటాడు. తన తమ్ముడు బాజీరావును చంపిన ఛత్రపతిని సంహరించడానికి రాజ్‌ బిహారీ (ప్రదీప్‌ రావత్‌) రంగంలోకి దిగుతాడు. తాను ఎంతగానో ప్రేమించే తల్లిని ఎలా చేరుకుంటాడన్నది తెర మీద చూడాల్సిందే.

    ఏ కథలోనైనా హీరో వ్యక్తిత్వం ఉన్నతంగా మారుతూ చివరికి 'తన' అనేది వదిలి 'మన'తో ముగుస్తుంది. ఈ సినిమాలో విచిత్రంగా ఇంటర్వల్‌ వరకు ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఛత్రపతి తర్వాత తన తల్లిని వెదుక్కోవడంతోనే కాలం గడుపుతాడు. శివాజీ 'ఛత్రపతి' ఎలా అయ్యాడన్న టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఫస్టాఫ్‌లోనే జరిగిపోయి క్లెయిమాక్స్‌ వాతావరణం కన్పించింది. పెరిగిన ఎమోషన్‌ గ్రాఫ్‌ సెకండాఫ్‌లో పడిపోయి తేలిపోయింది. ప్రారంభంలో 'సర్కిల్‌ ఆఫ్‌ బీయింగ్‌' బాగా ఏర్పాటు చేసినా చివర్లో 'ప్రీ క్లెయిమాక్స్‌' లీడ్‌ తీసుకోలేక పోవడంతో క్లెయిమాక్స్‌ హడావుడిగా వచ్చినట్టయింది. ఇది పూర్తిగా స్క్రీన్‌ప్లే లోపమే. యాక్షన్‌ సీన్లతో ఇంటర్వల్‌కే ఒక స్ధాయికి వచ్చిన ఎమోషన్స్‌ను కొనసాగించలేకపోవడంతో సినిమా చప్పగా ముగిసింది. చాలా చోట్ల దర్శకుడి ప్రతిభ, స్టైల్‌ సీన్లు తీయడంలో నేర్పు ఆశ్చర్యపరుస్తాయి. ఫస్టాఫ్‌ అద్భుతంగా తీశారు. కానీ శ్రీలంక సమస్య ఇప్పటిది కాకపోవడం, ఆ నేపధ్యం కొత్తది కావడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ప్రభాస్‌ నటనలో పరిణతి కనిపించింది. కెమెరా, రీ రికార్డింగ్‌ అద్భుతంగా ఉన్నాయి. మూడ్‌కి అనుగుణంగా లైటింగ్‌ అందించిన తీరు బాగుంది. పాటలు, మాటలు సో సో. వేణుమాధవ్‌ కామెడీ కూడా బాగుంది.

    'తనకోసం బతికే వాడే మనిషి, ప్రజల కోసం బతికేవాడు ఛత్రపతి' అనే నినాదంతో వచ్చిన ఈ చిత్రంలో యాక్షన్‌ ఎపిసోడ్లు యువతకు, సెంటిమెంట్‌ సన్నివేశాలు స్త్రీలకు టార్గెట్‌ చేసినట్టున్నారు. ఈ చిత్రానికి మూలమైన 'స్కార్‌ ఫేస్‌' 'అగ్నిపథ్‌' 'రాక్షసుడు' చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో ఈ చిత్రంపై ఆశలు కల్పిస్తాయి. స్క్రీన్‌ప్లేను తలకిందులు చేసి ఉంటే అంటే, తల్లి సెంటిమెంట్‌ను మొదట, యాక్షన్‌ సన్నివేశాలను చివర పెట్టి ఉంటే ఈ సినిమా మరింత విజయం సాధించి ఉండేది.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X