Chaurya Paatam Review: చౌర్యపాఠం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.0/5

నటీనటులు: ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ, ఫేక్ సలీం, రాజీవ్ కనకాల, అంజి వాల్గుమన్, సుప్రియా ఐసోల్, ఎడ్వార్డ్ స్టీవెన్‌సన్, మ్యాడీ మన్నెపల్లి తదితరులు
రచన, దర్శకత్వం: నిఖిల్ గొల్లమారి
నిర్మాతలు: త్రినాథరావు నక్కిన, వీ చూడామణి
కథ, సినిమాటోగ్రఫి: కార్తీక్ ఘట్టమనేని
మ్యూజిక్: డావ్‌జాండ్
ఎడిటర్: ఉత్తుర పార్థసారథీ
బ్యానర్: నక్కిన నేరెటివ్స్
రిలీజ్ డేట్: 2025-04-25

వేదాంత్ రామ్ (ఇంధ్రా రామ్) దర్శకుడిగా కావాలనే లక్ష్యంతో సినీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటాడు. నిర్మాతలకు కథలు వినిపిస్తూ చేదు అనుభవాలను చవిచూస్తుంటాడు. అయితే షూటింగులో ఓ తప్పిదం కారణంగా దాదాపు వేదాంత్ రామ్‌ను ఇండస్ట్రీ నుంచి వెలివేస్తారు. ఈ క్రమంలో బ్యాంకు కొల్లగొట్టడం ద్వారా డబ్బు సంపాదించి స్వయంగా సినిమాను నిర్మించాలని ప్లాన్ వేస్తాడు. బ్లాస్టింగ్ టెక్నిషియన్ బాబుల్ (సలీం ఫేక్), జాక్ (అంజి వాల్గుమన్), మరో వ్యక్తి (మ్యాడీ)తో కలిసి ఓ టీమ్‌గా ఫార్మ్ అవుతారు. అలా ధనపల్లి గ్రామంలో బ్యాంకు లూటీ చేయడానికి ప్లాన్ చేస్తారు.

Chaurya Paatam Movie Review

ధనపల్లి గ్రామంలో బ్యాంక్ లూటీకి ఎలాంటి ప్లాన్ వేశారు? బ్యాంక్ క్లర్క్‌ అంజలి (పాయల్ రాధాకృష్ణ)తో ఎలా ప్రేమలో పడ్డాడు? ధనపల్లి గ్రామ సర్పంచ్ వసుధ (సుప్రియా)తో ఎదురైన పరిస్థితులేంటి? సర్పంచ్ వసుధకు ఆమె సోదరుడు, జమీందార్ (రాజీవ్ కనకాల)కు ఉన్న వైరం ఏమిటి? డాక్యుమెంట్ తీస్తున్నామని చెప్పిన వేధాంత్ రామ్‌ దృష్టికి వచ్చిన స్కామ్ ఏంటి? చివరకు వేదాంత్ రామ్ బ్యాంక్ లూటీ చేసి సినిమా తీశాడా? లేదా వసుధ చేతిలో చిక్కి ఎలాంటి బాధలు అనుభవించారు? ధనపల్లి గ్రామంలో జరిగిన భారీ కుంభకోణం ఏమిటి? అది వేదాంత్ రామ్‌కు ఎలా ఉపయోగపడింది? అనే ప్రశ్నలకు సమాధానమే చౌర్యపాఠం సినిమా కథ.

బ్యాంక్‌ను లూటీ లైఫ్ యాంబిషన్ సెట్ చేసుకోవాలనే పాయింట్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది. కార్తీక్ ఘట్టమనేని అందించిన అలాంటి పాయింట్‌‌ను మంచి స్క్రీన్ ప్లేతో కథను విస్తరించే విషయంలో, బలమైన సీన్లను రాసుకొనే విషయంలో దర్శకుడు నిఖిల్ తడబాటుకు గురయ్యాడనే చెప్పాలి. ఆసక్తికరంగా సినిమాను నడిపించే విషయంలో పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. కథలో స్కామ్, సర్పంచ్, జమీందార్‌కు మధ్య వారసత్వ పోరు లాంటి అంశాలను సరిగా ఉపయోగించుకోలేకపోయాడనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను కొంతలో కొంత బెటర్‌గా రూపొందించినప్పటికీ.. సెకండాఫ్‌ను మాత్రం పూర్తిగా గాలికి వదిలేశాడనిపిస్తుంది.

ఫిల్మ్ మేకర్ కావాలనే యాంబిషన్‌తో యువకుడు వేదాంత్ రామ్‌గా ఇంద్రారామ్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. లుక్, స్టైయిల్ వైజ్ ఆకట్టుకొన్నాడు. కానీ నటనపరంగా ఇంకా బెటర్ కావాల్సి ఉందనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయంలో మెరుగు పరుచుకొంటే ఇండస్ట్రీకి యంగ్ టాలెంట్ దొరికినట్టే అనే ఫీలింగ్ కల్పించాడు. అంజలిగా పాయల్ రాజ్‌పుత్ గ్లామర్‌గానే కాకుండా తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. సలీం ఫేక్ అక్కడక్కడా నవ్వించారు. వసుధగా సుప్రియా గంభీరంగా కనిపించారు కానీ ఆ పాత్రలో పవర్ లేకపోవడం వల్ల పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. రాజీవ్ కనకాల పాత్రకు స్కోప్ ఉంది. కానీ ఆ పాత్ర డెలివర్ చేయడానికి కంటెంట్ లేకపోయింది. మిగితా పాత్రల్లో నటించిన వారాంత ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమా విజువల్‌గా బాగుంది. కలర్ టోన్ సినిమాకు బ్యూటీగా మారింది. రూరల్ వాతావరణం సినిమాకు మంచి ఫీల్‌ను తెచ్చిపెట్టింది. కార్తీక్ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. నక్కిన నేరేటివ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే కంటెంట్ పరంగా ఇంకాస్త వర్క్ చేయాల్సి ఉందనిపించింది. నక్కిన త్రినాథరావు లాంటి డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కంటెంట్ విషయంలో పూర్తిగా నిరాశపరిచారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే.. కొన్ని పాయింట్స్ నచ్చే విధంగా ఉంటాయి. నక్కిన, కార్తీక్ ఘట్టమనేని సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుందేమో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X