Che Movie Review చెగువేరా బయోపిక్ ఎలా ఉంది? పోరాట యోధుడు ఛే మూవీ సమీక్ష
నటీనటులు: లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బీఆర్ సభావత్ నాయక్ తదితరులు
రచన, దర్శకుడు: బీఆర్ సభావత్ నాయక్
కో డైరెక్టర్: నాని బాబు
నిర్మాతలు: సూర్య , బాబు, దేవేంద్ర
సినిమాటోగ్రఫి: కళ్యాణ్ సమి, జగదీష్
ఎడిటర్: శివ శర్వాణి
మ్యూజిక్: రవిశంకర్
బ్యానర్: నేచర్ ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2023-12-15
పేదలు, అణగారిన ప్రజలను చైతన్యపరిచేందుకు పలు దేశాలు తిరుగుతూ విపవ బాటను ఎంచుకొన్న చే అలియాస్ చెగువేరా (సభాయత్ నాయక్) పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గాయపడుతాడు. ఆ క్రమంలో సింగి (లావణ్య)ను కలుకొంటాడు. వారి పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ శారీరకంగా ఒక్కటవుతాడు. తాను చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన దళంలోని సభ్యులు పోలీసులు చేతిలో మృత్యువాత పడుతారు. అదే సమయంలో బొలివియా సైనికులకు బందీగా చే చిక్కుతాడు?
పేద ప్రజలకు కోసం చేపట్టిన ఉద్యమాన్ని కొనసాగించడానికి ఎలాంటి సవాళ్లను చే ఎదుర్కొన్నాడు? తాను ప్రేమించిన సింగితో రిలేషన్ ఎలా కొనసాగింది. బొలివియా సైనికుల చేతిలో చిక్కిన తర్వాత ఏం జరిగింది? ఫీడెల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా విప్లవ విజయానికి ఎలాంటి వ్యూహ రచన చేశాడు? యుద్ధంలో గెరిల్లా దళాలను ఎలా ముందుకు నడిపించాడు? తాను నమ్ముకొన్న సిద్దాంతం కోసం ఛే ఎలాంటి త్యాగాలకు ఒడిగొట్టాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఛే సినిమా కథ.

చెగువేరా జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా రాసుకొన్న కథ, కథనాలు బాగున్నాయి. ఇలాంటి కథలో స్వయంగా తాను నటిస్తూ.. అంతా కొత్తవారితోనే ఈ పాత్రలను పండించే ప్రయత్నం చేయడం ఓ ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. బొలివియా, కాంగో విముక్తి కోసం చేసిన పోరాటలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. విప్లవ వీరుడు చే జర్నీని తెరపైన చూపిన విధానం చూస్తే సభాయత్ నాయక్‌కు సినిమాపై ఉన్న తపన ఏంటో తెలుస్తుంది.
చెగువేరా పాత్రలో నటించడమే కాకుండా సినిమాకు దర్శకత్వం వహించి తన ప్రతిభను చాటుకొన్నారు. చెగువేరా గెటప్, బాడీ లాంగ్వేజ్ పక్కాగా చూపించాడు. ఈ పాత్రలో నటించాడని చెప్పడం కంటే జీవించాడనే చెప్పాలి. చే పాత్ర ద్వారా ఆయన చెప్పిన డైలాగ్స్ ఉద్వేగానికి గురిచేస్తాయి. గిరిజన యువతి సింగిగా లావణ్య తన పాత్రతో ఆకట్టుకొన్నది. పసల ఉమామహేశ్వర్, వినోద్, కార్తీక్ నూనే, పూల సిద్దేశ్వర్ తదితరులు తమ పాత్రలకు ఫిర్యాదు చేశారు.

చే సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. ఈ సినిమాకు రవిశంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కల్యాణ్ సమీ, జగదీష్ అందించిన సినిమాటోగ్రఫితో సన్నివేశాలు మరింత ఎమోషనల్ కనిపించాయి. ఎడిటర్ శివ శర్వాణి ఎడిటింగ్ బాగుంది. సూర్య , బాబు, దేవేంద్ర అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సినిమాను రిచ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యారు.

పేద ప్రజల కోసం, పలు దేశాల విముక్తి కోసం పోరాటం చేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న చెగువేరా జీవితంలోని కీలక సన్నివేశాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇండియన్ నేటివిటితో సినిమాను తెరకెక్కించిన విధానం బాగుంది. పోరాట యోధుల సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఈ సినిమా ఎట్టి పరిస్థితిలో నిరాశ పరచదు.


Click it and Unblock the Notifications











