For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చెక్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating: 2.75/5

  నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణ మురళీ, మురళీ శర్మ తదితరులు
  రచన, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి
  నిర్మాత: వీ ఆనంద ప్రసాద్
  మ్యూజిక్: కల్యాణి మాలిక్
  సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీవాస్తవ్
  ఎడిటింగ్: సనల్ అనిరుధన్
  బ్యానర్: భవ్య క్రియేషన్స్
  రిలీజ్: 2021-06-26

  చెక్ మూవీ కథ ఏమిటంటే

  చెక్ మూవీ కథ ఏమిటంటే

  ఆదిత్య (నితిన్) చేయని నేరానికి ఉరిశిక్ష పడిన ఖైదీ. గద్వాల జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో శివన్నారాయణ (సాయి చంద్) అనే తోటి ఖైదీ ప్రభావంతో చెస్ ప్లేయర్‌గా మారుతారు. అయితే ఆదిత్య కోసం లాయర్ మానస (రకుల్ ప్రీత్ సింగ్) రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో తన ప్రేయసి యాత్ర (ప్రియా ప్రకాశ్ వారియర్ ) కారణంగా టెర్రిరిస్టుగా ముద్ర పడ్డారనే విషయాన్ని వెల్లడిస్తారు.

  చెక్ మూవీలో ట్విస్టులు

  చెక్ మూవీలో ట్విస్టులు

  ప్రేయసి యాత్రతో అఫైర్ వల్ల ఆదిత్యపై టెర్రిరిస్టు ముద్ర ఎందుకు పడింది. ఆదిత్యను యాత్ర ఎందుకు మోసం చేసి వెళ్లింది? ఆదిత్య నిర్ధోషి అని మానస ప్రూవ్ చేసిందా? జైలులో ఖైదీగా ఉన్న ఆదిత్య అంతర్జాతీయ స్థాయిలో ఆదిత్య చెస్ గ్రాండ్ మాస్టర్‌గా ఎలా మారింది. నరసింహరెడ్డి (సంపత్ రాజ్) ఎందుకు ఆదిత్యపై పగ, ప్రతీకారం పెంచుకొంటాడు? చివరకు ఆదిత్య ఎలా జైలు నుంచి బయటపడ్డారు అనే ప్రశ్నలకు సమాధానమే చెక్ సినిమా.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఉరిశిక్ష పడిన ఆదిత్య తన కథను చెప్పడం ద్వారా ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లే ప్రయత్నంతో చెక్ సినిమా మొదలవుతుంది. జైలులో సాయిచంద్ పరిచయంతో అసలు కథ మొదలవుతుంది. చెస్ ప్రధానంగా కథ కొనసాగిస్తూనే.. ప్రేక్షకుడి మైండ్‌కు పదను పెట్టే ప్రయత్నం జరుగుతుంది. సినిమా కథ బంపీ రైడ్‌గా సాగడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో చక్కటి సన్నివేశంతో తొలి భాగాన్ని ముగించి రెండో భాగంపై ఆసక్తిని దర్శకుడు కలిగించాడు.

  సెకండాఫ్ అనాలిసిస్

  సెకండాఫ్ అనాలిసిస్

  సెకండాఫ్‌లో కోర్టు, చెస్ ఆట ప్రధానంగా, అలాగే జైలులో అంతర్గత పోరాటాలు నేపథ్యంగా ఆసక్తిగా సాగుతుంది. సెకండాఫ్‌లో తన సౌలభ్యం కోసం సినిమాటిక్ లిబర్టిని వాడుకొన్నారనే విధంగా సీన్లు సాగుతాయి. అయితే చెస్ ఆటలో ఉండే ఎమోషనల్ పాయింట్స్‌తో కొన్ని లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేసినట్టు అనిపిస్తుంది. విశ్వనాథన్ ఆనంద్ ఎపిసోడ్ వరకు సినిమా సరైనా దారిలోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాతే కాస్త కథా గమనం దారి తప్పినట్టు అనిపిస్తుంది. ఓవరాల్‌గా చంద్రశేఖర్ యేలేటి బ్రిల్లియెన్స్ కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తాయి.

  దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి టేకింగ్

  దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి టేకింగ్

  చంద్రశేఖర్ యేలేటి సినిమా అంటే మైండ్ గేమ్, ఇంటెలిజెన్సీకి పెద్ద పీట వేస్తారని ప్రేక్షకులు ఆశిస్తారు. చెక్ సినిమా విషయంలోనే తన పంథాను దర్శకుడు కొనసాగించారు. జైలులో సీన్లను అత్యంత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లారు. జైలులో ఖైదీల ప్రవర్తన, వాతావరణాన్ని చక్కగా చూపించారు. ఇక మురళీ శర్మ లాంటి సాఫ్ట్ జైలర్, సంపత్ రాజ్ లాంటి మొండి అధికారి పాత్రలతో సినిమాను బ్యాలెన్స్ చేశాడు. నితిన్ పాత్రకు సంబంధించిన వరకు కథను ఆద్యంత ఆసక్తిని కలిగించేలా రూపొందించారు. కానీ క్లైమాక్స్ విషయంలో మాత్రం తన మార్కును చూపించాడు.

  నితిన్ యాక్టింగ్

  నితిన్ యాక్టింగ్

  ఉరిశిక్ష పడిన ఖైదీగా, చెస్ ప్లేయర్‌గా, ప్రేమికుడిగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న నటుడిగా నితిన్ కనిపిస్తాడు. ఫైట్స్ విషయంలో చెక్‌లో కాస్త విజృంభించాడనే చెప్పవచ్చు. కీలక సన్నివేశాల్లో నితిన్‌లో మెచ్యురిటీ కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఆదిత్య పాత్రలో నితిన్ పర్‌ఫెక్ట్‌గా ఒదిగిపోయాడని చెప్పవచ్చు.

  ప్రియా ప్రకాశ్ వారియర్ పెర్ఫార్మెన్స్

  ప్రియా ప్రకాశ్ వారియర్ పెర్ఫార్మెన్స్

  యాత్ర పాత్ర విషయానికి వస్తే నిడివి తక్కువే అయినప్పటికీ.. ఆ పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. యాత్ర పాత్ర కనిపించకపోయినా కీలక సీన్లలో యాత్ర ప్రభావం కనిపిస్తుంది. అలాంటి పాత్రలో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒదిగిపోయారు. గ్లామర్‌గా కూడా మెప్పించారు. ఒకే ఒక పాటలో నితిన్‌తో కెమిస్ట్రీని పండించారు.

  రకుల్ ప్రీత్ సింగ్ ఎలా చేసిందంటే

  రకుల్ ప్రీత్ సింగ్ ఎలా చేసిందంటే

  మానస పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ తన గత చిత్రాల్లోని పాత్రలకంటే భిన్నంగా కనిపిస్తుంది. లాయర్ పాత్రలో హావభావాలు మంచిగా పండిచింది. గ్లామర్ ఆస్కారం లేకున్నా గానీ.. లుక్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో ఆకట్టుకొన్నారు. ముఖ్యంగా జైలులో ఓ ఖైదీ తనతో మిస్ బిహేవ్ చేసిన సన్నివేశంలో రకుల్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది.

  ఇతర నటీనటులు గురించి

  ఇతర నటీనటులు గురించి

  చెక్ సినిమా విషయానికి వస్తే.. సాయిచంద్ పాత్ర ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అరుదైన నటనతో మరోసారి ప్రేక్షకులను తనవైపు తిప్పుకొనే పాత్రలో మెప్పించారు. అలాగే మురళీ శర్మ పాత్ర కూడా సాఫ్ట్‌గా ఫీల్‌గుడ్‌గా కనిపిస్తుంది. ఇక నెగిటివ్ కోణంతో సాగే సంపత్ రాజ్ పాత్ర కూడా సెకండాఫ్‌లో కీలకంగా మారింది. హర్షవర్ధన్, పోసాని పాత్రలు కామెడీని పండించాయి.

  కల్యాణీ మాలిక్ మ్యూజిక్

  కల్యాణీ మాలిక్ మ్యూజిక్

  కల్యాణీ మాలిక్ మ్యూజిక్ చెక్ సినిమాను మరో రెంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రీరికార్డింగ్ సినిమాకు ప్రాణంగా మారింది. కొన్ని సన్నివేశాలను తన బీజీఎంతో కల్యాణీ మాలిక్ మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. గత చిత్రాలతో పోల్చుకొంటే చెక్ సినిమాకు కల్యాణీ మాలిక్ ఇచ్చిన మ్యూజిక్ చాలా ఢిఫరెంట్‌గా ఉంది

  టెక్నికల్ విభాగాల పనితీరు

  టెక్నికల్ విభాగాల పనితీరు

  చెక్ సినిమా విషయానికి వస్తే రాహుల్ శ్రీవాస్తవ్ అందించిన సినిమాటోగ్రఫిని ముందుగా చెప్పుకోవాలి. కత్తి మీద సాము లాంటి జైల్ ఎపిసోడ్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. జైలుగదిలో తీసిన ఫైట్ చాలా బాగుంటుంది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. జైల్ సెట్ తెరపై వాస్తవికతను ఉట్టిపడేలా చేసింది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  భవ్య క్రియేషన్స్ ఉత్తమ నిర్మాణ విలువలకు పెట్టింది పేరు. తన బ్యానర్‌కు తగినట్టుగానే చెక్ సినిమాలో ఉత్తమ నిర్మాణ విలువలు కనిపించాయి. మరోసారి మంచి కథతో ముందుకు వచ్చారు. నటీనటులు ఎంపిక సినిమాపై వారికి ఉన్న అభిరుచిని తెలియజెప్పింది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చితే చెక్ సినిమా భవ్య క్రియేషన్స్‌కు మరో బెస్ట్ పిక్చర్ అయ్యే అవకాశం ఉంది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చెక్ సినిమా. ఎప్పటిలానే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తన ప్రతిభకు పదును పెట్టారు. ఆద్యంతం ప్రేక్షకుడు ఎంగేజింగ్‌గా ఉండేలా కథను పరుగులు పెట్టించారు. క్లైమాక్స్‌ను డీల్ చేసిన విధానం కాస్త నిరాశపరిచారనే చెప్పవచ్చు. స్పోర్ట్స్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు నచ్చే చిత్రం చెక్ అని చెప్పవచ్చు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  కథ, కథనాలు
  చంద్రశేఖర్ యేలేటి టేకింగ్
  నితిన్ పెర్ఫార్మెన్స్
  కల్యాణీ మాలిక్ మ్యూజిక్

  మైనస్ పాయింట్
  క్లైమాక్స్

  English summary
  Check movie review and rating
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X