Cheekatilo Movie Review: చీకటిలో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

మూవీ: చీకటిలో
నటీనటులు: శోభితా ధూళిపాల, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్, విశ్వదేవ్ రాచకొండ, చైతన్య, విశాలక్ష్మి, ఇషా చావ్లా, ఝాన్సీ, ఆమని తదితరులు
దర్శకత్వం: శరణ్ కోపిశెట్టి
రచన: చంద్ర పెమ్మరాజు, శరణ్ కొప్పిశెట్టి
నిర్మాత: డీ సురేష్ బాబు
సినిమాటోగ్రాఫర్: మల్లికార్జున్
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
ఎడిటింగ్: కేఎస్ఎన్
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2026-01-23

చిన్నతనం నుంచే రాజీపడని మనస్తత్వం ఉండే సంధ్య నెల్లూరి (శోభిత ధూళిపాల) జర్నలిస్ట్‌గా టెలివిజన్ ఛానెల్‌లో పనిచేస్తుంటాడు. మీడియాలోని నైతిక విలువలకు వ్యతిరేకంగా పనిచేయడం ఇష్టం లేక తన ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. ఆ తర్వాత పాడ్‌కాస్ట్‌ మొదలుపెట్టి పలు సమస్యలపై దృష్టి పెట్టాలనుకొంటుంది. ఆ క్రమంలోనే తన సహ ఉద్యోగి బాబీ (అదితి మ్యాకల్), ఆమె బాయ్‌ఫ్రెండ్ అనుమానాస్పద పరిస్థితుల్లో హత్య చేయబడుతారు. ఆ మర్డర్ వెనుక ఎవరి హస్తం అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా.. గోదావరి జిల్లాలో ఒకే పద్దతిలో జరిగిన చాలా హత్యలు సంధ్య దృష్టికి వస్తాయి. దాంతో తన కాబోయే భర్త అమర్ (విశ్వదేవ్ రాచకొండ)తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేపడుతుంది.

టెలివిజన్ ఛానెల్‌లో సంధ్యకు నచ్చని విషయాలు ఏమిటి? చీకటిలో అనే పాడ్‌కాస్ట్ ఎందుకు స్టార్ట్ చేసింది? తన స్నేహితురాలు బాబీ హత్య సంధ్యను ఎలా కదిలించింది? గోదావరి జిల్లాలో గత 20 ఏళ్లలో జరిగిన రేప్, మర్డర్ కేసులు వెనుక హస్తం ఎవరిది? మర్డర్ కేసులపై పోలీస్ అధికారి (సురేష్) స్పందన ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగి రావు (వడ్లమాని శ్రీనివాస్) పాత్ర ఏమిటి? ఈ కథలో రవీంద్ర విజయ్ పాత్ర ఏమిటి? అమర్‌తో సంధ్య లవ్ లైఫ్ ఎలా సాగింది? పద్మ (ఆమని) హత్య కథను ఎలాంటి మలుపు తిప్పింది? సంధ్య ఇన్వెస్టిగేషన్ హంతకుడిని పట్టించిందా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసర్ (ఇషా చావ్లా) ఈ కేసును ఎలా డీల్ చేసింది? అనే ప్రశ్నలకు సమాధానమే చీకటిలో సినిమా కథ.

Cheekatilo Movie Review and Rating

క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీతో సినిమా వస్తుందంటే.. బలమైన కథ, కథనాలు, ఊపిరి బిగబట్టే ట్విస్టులు ఉంటే గానీ ఆ సినిమా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించదు. అలాంటి కథతోనే ఈ సినిమా వచ్చిందా? అనే ఎదురు చూసిన ప్రేక్షకులకు కొంత అసంతృప్తి కలుగ మానదు. ఎందుకంటే.. చిన్న పాయింట్ చుట్టూ కథను సాగదీసి నడిపించడం, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో సాదాసీదా మర్డర్ మిస్టరీ చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి మైనస్ పాయింట్లు ఉన్న కథలో సంధ్య పాత్రతో శోభితా ధూళిపాల ఈ మూవీ గ్రాఫ్‌ను పంచేలా నటించింది.

ఈ సినిమాలో సగభాగం అంతా కథను, క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికే సమయం తీసుకోవడం వల్ల మూవీ ఆసక్తికరంగా సాగదు. రెండో భాగంలో అసలు కథ ప్రారంభం కావడం.. హంతకుడు ఎవరు తెలిసిన తర్వాత సాగే ఎమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేస్తుంది. హంతకుడి కోణాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. కానీ ఈ సినిమాను మరో లెవెల్ తీసుకెళ్లేంతగా ఆ కంటెంట్ లేకపోవడం కొంత నిరాశ కలిగించే విషయం. హంతకుడు పాత్రధారి చేసిన పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా అనిపిస్తుంది. సింగిల్ పాయింట్ ఎజెండాతో సినిమాను నడిపించడం కత్తిమీద సామే. కానీ శరణ్ కొప్పిశెట్టి ఈ ప్రయత్నంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. శోభితా ధూళిపాల ప్రధాన పాత్రలో సినిమా అనే సరికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, క్యూరియాసిటీ ఉంటుంది. అంచనాలకు తగినట్టే.. సంధ్య పాత్రకు శోభిత ధూళిపాల నూటికి నూరుశాతం న్యాయం చేసేందుకు ప్రయత్నించింది. పాత్ర పరిధికి మించి నటించి మెప్పించిందనే చెప్పాలి. ఈ సినిమాకు బలంగా మారిన పాత్ర ఏదైనా ఉందంటే అది రావు పాత్ర. తాను తప్ప మరొకరు చేయలేరనే విధంగా వడ్లమాని శ్రీనివాస్ చేశారు. రవీంద్ర విజయ్, విశ్వదేవ్ రాచకొండ, చైతన్య, విశాలక్ష్మి, ఇషా చావ్లా, ఝాన్సీ, ఆమని లాంటి టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నా వారికి కథలో బలమైన పాత్రలు లభించకపోవడం వల్ల వారి పాత్రల పరిధిలోనే నటించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ కథ డిమాండ్ మేరకు సినిమా అంతా డార్క్ మోడ్‌లో సాగుతుంది. సీన్లలో మూడ్‌ను, వాతావరణాన్ని ఎస్టాబ్లిష్‌ చేయడానికి వాడుకొన్న లైటింగ్ బాగుంది. మల్లికార్జున్ కెమెరా వర్క్ బాగుంది. గోదావరి అందాలను బాగా చూపించాడు. బలమైన సన్నివేశాలు లేకపోయినా.. శ్రీ చరణ్ పాకాల తన మ్యూజిక్‌తో సీన్లను బాగా ఎలివేట్ చేశారు. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలపై ఫోకస్ పెట్టిన సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఇంకాస్త కంటెంట్‌పైన ఫోకస్ పెడితే.. బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ అయి ఉండేది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తగినంత సమయాన్ని కేటాయించి ఒకేసారి ఈ సినిమాను చూసేయండి.. శోభితా ధూళిపాల, వడ్లమాని శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ కోసం ఓసారి ఈమూవీని చూసేయవచ్చు.

ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. దర్శకుడు శరణ్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఇంకా బెటర్‌గా కంటెంట్‌ను డిజైన్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పటి వరకు శోభితాను చూసిన విధానం వేరు.. ఈ సినిమాలో సంధ్య పాత్రలో ఆమె ఫుల్ మార్కులు కొట్టేసింది. సీనియర్ నటుడు సురేష్, రవీంద్ర విజయ్, ఆమని, ఝాన్సీ, చైతన్య లాంటి ఆర్టిస్టులు ఉన్నా కథలో వారి పాత్రలను బలంగా చూపించకలేకపోయారనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య నడిచే ట్విస్టు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాకు ఆ ఎపిసోడ్ కొంత మేరకు హైలెట్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా రెగ్యులర్ పాయింట్‌తో సాగే ఎమోషనల్ మర్డర్ మిస్టరీ అనే ఫీలింగ్ కలిగేలా చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X