Cheekatilo Trailer Review: చీకట్లో ట్రైలర్ రివ్యూ.. బోల్డ్ పాత్రలో శోభిత స్టన్నింగ్‌గా!
Sobhita Dhulipala's Cheekatilo Trailer Review: టాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)'చీకటిలో' (Cheekatilo) అనే క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. థియేటర్లకు కాకుండా నేరుగా ఓటీటీ విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు ట్రైలర్ ఆ హైప్‌ను మరింత పెంచేసింది.
ఇక 'చీకటిలో' ట్రైలర్ ప్రారంభం నుంచే ఆద్యంతం సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా సాగుతోంది. నగరంలో వరుసగా జరుగుతున్న అమ్మాయిల హత్యలు, అర్ధరాత్రి జంట హత్యల వార్తలతో కథ మొదలవుతుంది. ఈ కేసులను ఛేదించేందుకు ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్‌గా మారిన జర్నలిస్ట్ సంధ్య పాత్రలో శోభిత ధూళిపాళ్ల కనిపిస్తోంది. ఆమె డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్‌కే సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

సంధ్య పాత్రే కథకు ప్రాణం
ఈ సినిమాలో శోభిత 'సంధ్య' అనే పాత్రలో కనిపించబోతుంది. ఈ పాత్ర కేవలం గ్లామర్‌కు పరిమితం కాకుండా, కథను ముందుకు నడిపించే స్ట్రాంగ్ క్యారెక్టర్‌గా కనిపిస్తోంది. ఒకప్పుడు న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసిన సంధ్య, ఆ ఉద్యోగం నచ్చక బయటకు వచ్చి, ట్రూ క్రైమ్ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో నగరంలో జరుగుతున్న హత్యల వెనక ఉన్న చీకటి రహస్యాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె ప్రమాదకరమైన నిజాలకు చేరువ అవుతుంది. ఈ క్రమంలో ఆమె స్నేహితుల హత్యలు, గోదావరి జిల్లాలతో లింక్ ఉన్న వరుస నేరాలు కథలో కీలక మలుపులు తిరుగుతోంది.
ట్రైలర్‌లో చూపించినట్లు గోదావరి జిల్లాలకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఓ సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తుంటాడు. ఆ కిల్లర్‌ను పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు, ఆ హత్యలపై సంధ్య ఇన్వెస్టిగేషన్ ఎలా కనెక్ట్ అవుతుందన్నది ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. చివరిలో 'సోషల్ మీడియా పోస్ట్‌లో ట్యాగ్ చేసినందుకే హత్య చేశాడా?' అనే ప్రశ్నతో ట్రైలర్ ముగియడంతో సినిమాపై మరింత ఉత్కంఠ పెరిగింది.
ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా, చంద్ర పెమ్మరాజు రచనా సహకారం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions)బ్యానర్‌పై డి. సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మించారు. శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్‌లోనే సినిమాకు ప్లస్‌గా అనిపిస్తోంది.
'మేజర్' సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న శోభిత, ఇప్పుడు 'చీకటిలో'తో తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మధ్యలో కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆమె, ఈ క్రైమ్ థ్రిల్లర్‌తో మరోసారి తన నటనా పరిధిని చూపించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా 'మేడ్ ఇన్ హెవెన్' వంటి వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ఆడియన్స్‌లో ఆమెకు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ప్లస్‌గా మారుతోంది.
ఓటీటీలో కొత్త బ్రేక్ అవుతుందా?
క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఓటీటీలో మంచి డిమాండ్ ఉండటంతో 'చీకటిలో' శోభిత కెరీర్‌లో కీలక మైలురాయిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తే.. సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక 'చీకటిలో'తో శోభిత ధూళిపాళ్ల మరోసారి తన స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎంపికను నిరూపించిందని చెప్పొచ్చు. జనవరి 23న స్ట్రీమింగ్ మొదలైన తర్వాత, ఈ సినిమా ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











