రోమాంటిక్‌ చెలి

By Staff

Cheli
- హిమబిందు
చిత్రం: చెలి
నటీనటులు: మాధవన్‌, రీమాసేన్‌, అబ్బాస్‌
సంగీతం: హరీష్‌ జైరాజ్‌
ఫోటోగ్రఫీ: రాజశేఖర్‌
దర్శకత్వం: గౌతం

టీనేజ్‌ క్రేజీ స్టార్స్‌ మాధవన్‌, రీమాసేన్‌ ల కాంబినేషన్‌ లో వచ్చిన తొలిచిత్రం ఇది. సున్నితమైన ప్రేమకథ-చెలి. కాలేజ్‌ యూత్‌ కు, భారీ డైలాగ్స్‌ ను అసహ్యించుకునే వారికి నచ్చుతుంది. కథలో కొత్తదనం లేకపోయినా, స్క్రీన్‌ ప్లే బాగుండడం, యూత్‌ అప్పీలింగ్‌ గా చిత్రాన్ని తీయడం ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్స్‌. హరీష్‌ జైరాజ్‌ అందించిన మెలోడి సంగీతం కూడా తోడవడంతో చిత్రం హాయిగొల్పుతుంది. వినోదాత్మకంగా రూపొందించిన లవ్‌ ట్రయాంగిల్‌.

వానలో తడుస్తూ ఆనందిస్తున్న అందాల రీమాసేన్‌ ను చూడగానే మాధవన్‌ మనసు పారేసుకుంటాడు. తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ రీమాసేన్‌ కు అప్పటికే ఎంగేజ్‌ మెంట్‌ అవుతుంది. అమెరికాలో ఉంటున్న రాజీవ్‌ శామ్యూల్‌(అబ్బాస్‌) అనే సాప్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ తో ఎంగేజ్‌ మెంట్‌ అయిందని, అయితే ఇప్పటివరకు అబ్బాస్‌ ను రీమాసేన్‌ చూడలేదని మాధవన్‌ తెలుసుకుంటాడు. ఎలాగైనా ఆమె ప్రేమను పొందేందుకు మాధవన్‌ రాజీవ్‌ శామ్యూల్‌ గా రీమా సేన్‌ కు పరిచయమవుతాడు.

సో..ఇద్దరూ ప్రేమించుకుంటారు. పాటలు పాడుకుంటారు. పార్కుల వెంట తిరుగుతారు. ఈ లోగా అబ్బాస్‌ అమెరికా నుంచి రావడంతో రీమాసేన్‌ కు అసలు విషయం తెలుస్తుంది. అప్పటినుంచి మాధవన్‌ ను అసహ్యించుకోవడం ప్రారంభిస్తుంది. ఐనా మాధవన్‌ ప్రేమించడం మానడు. రీమాను వదిలి వెళ్ళమని అబ్బాస్‌ ను బెదరిస్తాడు కూడా. ఐనా రీమా కనికరించకపోవడంతో సింగపూర్‌ కు వెళ్ళి సెటిల్‌ అవ్వాలని నిర్ణయించుకుంటాడు మాధవన్‌. ఆ తర్వాత సింగ్‌ పూర్‌ వెళుతాడా? రీమాసేన్‌, అబ్బాస్‌ ల పెళ్ళి అవుతుందా? అనేది క్లైమాక్స్‌.

రీమాసేన్‌, మాధవన్‌ ల నటన చాలా బాగుంది. అబ్బాస్‌ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. రీమాసేన్‌ అందాన్ని కెమెరామెన్‌ రాజశేఖర్‌ చక్కగా తెరకెక్కించాడు. భారీ డైలాగ్‌ లు, సెంటిమెంట్‌ సీన్స్‌ లేకపోవడంతో సినిమా బోరు కొట్టదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X