Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ, త్రిగుణ్, పీ వాసు, దేవీప్రసాద్, సిరి హన్మంతు తదితరులు
దర్శకత్వం: రవి నంబూరి
బ్యానర్స్: మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్
నిర్మాతలు: ఎస్కేఎన్,సాయి రాజేశ్
సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని
మ్యూజిక్: మణిశర్మ,
ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్,
ఎడిటర్: సాయి నాయుడు,
లిరిక్స్: అనంత శ్రీరామ్
రిలీజ్ డేట్: 2026-07-24
నివి అలియాస్ నివేదిత (శ్రీ గౌరి ప్రియ)కు ప్రియుడు అజయ్ (త్రిగుణ్) హ్యాండ్ ఇవ్వడంతో పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. ఆ షాక్ నుంచి తట్టుకోలేక మద్యానికి బానిస అవుతుంది. తాను ఉద్యోగం చేసే చెన్నైకి వెళ్లిపోయి బ్రేకప్ బాధలో మునిగి తేలుతుంటుంది. ఆ సమయంలో సినీ దర్శకుడి కావాలనే కోరికతో చెన్నైలో కష్టాలు పడుతున్న స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం)తో నివికి పరిచయం అవుతుంది. వారి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంటారు. కానీ నివి, స్టీవెన్ ఒకటి తలిస్తే విధి వారి ప్రేమను కాటు వేస్తుంది. దాంతో మరోసారి నివి పెళ్లి ఆగిపోతుంది.
పెళ్లి రోజునే నివికి అజయ్ ఎందుకు బ్రేకప్ చెప్పాడు? పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో నివి లైఫ్ ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టి వేయబడింది? అనాథగా స్టీవెన్ శంకర్ చెన్నైలో సినీ అవకాశాల కోసం ఎలాంటి కష్టాలు పడ్డారు. అజయ్‌తో బ్రేకప్ తర్వాత స్టీవెన్‌తో నివి ప్రయాణం ఎలా సాగింది? ఏ పరిస్థితుల్లో నివికి స్టీవెన్ దగ్గరయ్యారు? నివీ, స్టీవెన్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? చివరకు స్టీవెన్ డైరెక్టర్ అయ్యాడా? నివి పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే చెన్నై లవ్ స్టోరి సినిమా కథ.

నివి, అజయ్ బ్రేకప్, పీటల మీద పెళ్లి ఆగిపోవడం ఎపిసోడ్‌తో కథను ఎత్తుకొన్న విధానం నూతన దర్శకుడు రవి అంబూరి టాలెంట్ ఏమిటో మొదటి సీన్‌లోనే అర్ధమవుతుంది. కథను ఉద్వేగంగా, ఎమోషనల్‌గా చెప్పడం చూస్తే.. ఏ కోశానా కొత్త డైరెక్టర్ అనిపించరు. పాత్రలను డిజైన్ చేసిన విధానం, సన్నివేశాల్లో భావోద్వేగాలను నింపిన విధానం బాగుంది. ఫస్టాఫ్‌ను చాలా గ్రిప్పింగ్‌గా, ఫీల్ గుడ్ నేరేషన్‌తో కేక పెట్టించాడు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్న విధానం చూస్తే కంటెంట్‌పై ఆయనకు ఉన్న కమాండ్ ఏమిటో తెలిసిపోయింది. ఓ షాకింగ్ ఇంటర్వెల్ బ్లాక్‌తో ఫస్టాఫ్‌ను నెక్ట్స్ రేంజ్‌లోకి తీసుకెళ్లడమే కాకుండా సెకండాఫ్‌పై అంచనాలు పెంచేశాడు.
ఇక సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుకొన్న ఆడియెన్స్‌కు ఓ డిఫరెంట్ పాయింట్‌ను చెబుతూ కొత్త అనుభూతికి గురి చేసే ప్రయత్నం చేశాడు. కాకపోతే సెకండాఫ్‌లో సినిమా నెమ్మదించడం, కంటెంట్ పరంగా కొంత డ్రాప్ ఉండటం వల్ల చిన్న అసంతృప్తి కలుగుతుంది. కానీ ఫోటో ఎపిసోడ్, థియేటర్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్‌లో డాగ్స్‌తో యాక్షన్ ఎపిసోడ్ చూస్తే మతిపోతుంది. ఓ దశలో కంటతడి పెట్టించేలా ఉన్నాడే అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే మంచి ఎమోషన్స్‌తో చివరి సీన్ వరకు లాక్కొచ్చిన డైరెక్టర్ రవి.. క్లైమాక్స్ విషయంలో తడబాటుకు గురయ్యాడు. క్లైమాక్స్‌ను ఇంకా బెటర్‌గా ప్లాన్ చేసి ఉంటే.. ఈ సినిమా రేంజ్ ఊహించడం కష్టంగా ఉండేదనిపిస్తుంది.
నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు విభిన్నమైన పాత్రలతో నటించి మెప్పించాడు. కానీ స్టీవెన్ శంకర్ పాత్రలో పూర్తిస్థాయి నటుడిగా తన సత్తాను చాటుకొన్నాడు. ఫన్, కామెడీ, ఎమోషన్స్, పెయిన్‌ఫుల్ ఫీలింగ్స్ ఉన్న పాత్రలో రాటుదేలినట్టు కనిపించాడు. ఇక శ్రీ గౌరీ ప్రియ పెర్ఫార్మెన్స్ గురించి మాటల్లో చెప్పలేం. పూర్తిగా సినిమాలో నివి పాత్రతో వన్ ఉమెన్ షో. టెర్రిఫిక్ యాక్టింగ్, ముఖ్యంగా క్లోజప్ షాట్స్‌లో కళ్లతో పలికించిన భావాలు చూస్తే హ్యాట్సాఫ్ అని చెప్పాలి. తెలుగు అమ్మాయిగా తన నటనతో అదరగొట్టేశారు. చాలా రోజుల తర్వాత త్రిగుణ్ డిగ్నిఫైడ్ క్యారెక్టర్‌లో మంచి మార్కులు కొట్టేశారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ చిత్రానికి అసలు హీరో మణిశర్మ. బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో ఎమోషనల్ కంటెంట్‌ను హైప్ చేసిన విధానం హైలెట్. పాటల మాత్రమే కాకుండా కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన బీజీఎం తెర మీద చూస్తే.. మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇక సినిమాటోగ్రఫి మరో స్పెషల్ ఎట్రాక్షన్. బీచ్ ఎపిసోడ్స్, లాంగ్ షాట్స్ , క్లోజప్ షాట్స్ అద్బుతంగా షూట్ చేశారు. ఎడిటింగ్ విషయంలో ఇంకా కొంత సీరియస్‌గా వ్యవహరించాల్సింది. కనీసం 10 నుంచి 15 నిమిషాల నిడివి తగ్గిస్తే.. ఈ సినిమాలోని ఎమోషన్స్ ఇంకా బెటర్‌గా ప్రొజెక్ట్ అయి ఉండేది. ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా చెప్పుకోవాలి.
చెన్నై లవ్ స్టోరి సినిమా యూత్‌ఫుల్, జెన్ జీ టార్గెట్ లవ్ స్టోరి. రెగ్యులర్ ఆడియెన్స్ సెకండాఫ్‌లో అసంతప్తికి గురి కావోచ్చు కానీ.. టీనేజ్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాకు దర్శకుడు రాసుకొన్న సన్నివేశాలు, స్టోరీని డీల్ చేసిన విధానమే ఎక్స్రార్డినరీగా ఉంటుంది. ఓ కొత్త దర్శకుడు ఈ రేంజ్ సినిమా తీశాడా? అనే ఫీలింగ్ కల్పించడంలో సక్సెస్ అయ్యాడు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరిని చూడాలనుకొనే వారు.. చెన్నై లవ్ స్టోరీని ఈ వారం థియేటర్లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. ఈ సినిమా మంచి అనుభూతిని కలుగు జేస్తుంది.


Click it and Unblock the Notifications