Chennai Love Story Twitter Review: చెన్నై లవ్ స్టోరీ ట్విట్టర్ రివ్యూ..

Chennai Love Story Twitter Review: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, యువ నటి శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ'. ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ సంయుక్తంగా నిర్మించారు. ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

మణిశర్మ సంగీతం అందించగా, సాయి రాజేశ్ కథను అందించారు. రవి నంబూరి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందించగా, భాస్కర్ ముదావత్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. పాటలకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండగా, జూలై 23 రాత్రి పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Chennai Love Story Twitter Review

మూవీకి మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియలే. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

ఒక నెటిజన్ తన ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. "చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ బాగుంది . నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా స్టీవెన్ శంకర్, నివి పాత్రలు మనసు దోచుకున్నాయి. సింపుల్‌గా ఉన్నా కంటెంట్‌తో కూడిన రైటింగ్ ఆకట్టుకుంది. మణిశర్మ సంగీతం మరోసారి మ్యాజిక్ చేసింది. ఫస్ట్ హాఫ్ సూపర్బ్" అంటూ ప్రశంసించాడు.


మరో నెటిజన్ తన ట్విట్టర్‌లో ఫస్ట్ హాఫ్‌ గురించి చెబుతూ.. " కిరణ్ అబ్బవరం ఎంట్రీ సీన్ అదిరిపోయింది. శ్రీ గౌరీ ప్రియ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం థియేటర్‌ను సినిమాతో కనెక్ట్ చేసింది. ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అద్భుతంగా వర్కౌట్ అయింది. 'చెన్నై లవ్ స్టోరీ' బొమ్మ బ్లాక్‌బస్టర్" అంటూ ప్రశంసించాడు.

'చెన్నై లవ్ స్టోరీ' ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా, క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. కిరణ్ అబ్బవరం నటన, శ్రీ గౌరీ ప్రియతో ఫ్రెష్ కెమిస్ట్రీ ఆకట్టుకున్నాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా వర్కౌట్ అయిందని, ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

'చెన్నై లవ్ స్టోరీ' ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో రివ్యూ ఇచ్చాడు. హీరో కిరణ్ అబ్బవరం నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని, శ్రీ గౌరీ ప్రియతో ఆయన కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపించిందని ప్రశంసించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉండి థియేటర్‌లో మంచి హైప్ క్రియేట్ చేసిందని పేర్కొన్నాడు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంగేజ్ చేసిందని, సెకండ్ హాఫ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయని వెల్లడించాడు.


'చెన్నై లవ్ స్టోరీ' ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డాడు. ప్రారంభంలో సినిమా స్లోగా, రొటీన్ లవ్ స్టోరీలా అనిపించినా.. కొన్ని మంచి డైలాగ్స్, ఎమోషనల్ మూమెంట్స్‌తో కథ ఆసక్తికరంగా మారిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుందని, అందుకే సెకండ్ హాఫ్ సినిమాకు కీలకమని అభిప్రాయపడ్డాడు. అలాగే 'గుర్తుందా గుర్తుందా' పాట ప్లేస్‌మెంట్ ఇటీవల కాలంలో బెస్ట్‌గా అనిపించిందని తన రివ్యూలో వెల్లడించాడు.

'చెన్నై లవ్ స్టోరీ' ఎమోషన్స్ వర్క్ అయితే సినిమా ఎంత అందంగా ఉంటుందో మరోసారి నిరూపించిందని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ప్రశంసించాడు. కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, శ్రీ గౌరీ ప్రియ ఎంతో సహజమైన నటనతో ఆకట్టుకుందని పేర్కొన్నాడు. అలాగే సాయి రాజేశ్ రాసిన బలమైన ఎమోషన్స్, రవి నంబూరి ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలమని అభిప్రాయపడ్డాడు. మణిశర్మ సంగీతం ప్రతి సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేసిందని, మాస్ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకున్నాయని కొనియాడాడు. మొత్తంగా ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి తప్పక చూడదగ్గ హార్ట్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అని తన ట్విట్టర్ రివ్యూలో వెల్లడించాడు.

'చెన్నై లవ్ స్టోరీ' హృదయాన్ని తాకే ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో రివ్యూ ఇచ్చాడు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, మణిశర్మ సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచిందని ప్రశంసించాడు. ఫీల్‌గుడ్ రొమాన్స్, ఆకట్టుకునే పాటలు, అందమైన విజువల్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయని, కథనం ఎక్కడా స్లో కాకుండా ప్రతి ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు అతిపెద్ద సర్‌ప్రైజ్‌గా నిలిచిందని, క్లైమాక్స్ పూర్తిస్థాయి సంతృప్తిని ఇచ్చిందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా ఈ వీకెండ్ కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అంటూ 4.5/5 రేటింగ్ ఇచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X