Don't Miss!
- News
ప్రస్తుతానికి పర్వాలేదు.. తర్వాతేం జరుగుతుందో చూద్దాం!
- Finance
h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక..
- Sports
INDvsAUS : గిల్ బ్యాటింగ్‌తో రాహుల్‌పై ఒత్తిడి.. డేంజర్లో ఓపెనింగ్ స్థానం?
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Cheppalani Undi movie Reveiw భాష గురించి చక్కటి సందేశం.. చెప్పాలని ఉంది మూవీ ఎలా ఉందంటే?
నటీనటులు: యష్ పూరి, స్టెఫీ పటేల్, సత్య, పృథ్వీ, మురళీ శర్మ, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, రఘుబాబు, అలీ, సత్యం రాజేష్, నంద కిషోర్, అనంత్ తదితరులు
రచన, దర్శకత్వం: అరుణ్ భారతి ఎల్
నిర్మాతలు: వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్
డైలాగ్స్: విజయ్ చిట్నీడి
డివోపీ: ఆర్పీ DFT
సంగీతం: అస్లాం కేయి
ఎడిటింగ్: నందమూరి హరిబాబు
సమర్పణ : ఆర్బీ చౌదరి
బ్యానర్ : సూపర్ గుడ్ ఫిల్మ్స్
ఆర్ట్ డైరెక్టర్: కోటి, వీ రామకృష్ణ
కొరియోగ్రాఫర్స్: అమ్మా రాజశేఖర్, అజయ్ శివశంకర్, రామ్ శివ
పీఆర్వో : వంశీ శేఖర్
రిలీజ్ డేట్: 2022-12-09
మధ్య తరగతి కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ (యష్ పూరి) ర్యాపిడో డ్రైవర్‌గా, టెలివిజన్ ఛానెల్లో న్యూస్ రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు. ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో వెన్నెల (సెఫ్టీ పటేల్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం వారి మధ్య ప్రేమగా మారుతుంది. అయితే న్యూస్ రిపోర్టర్‌గా ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ కోసం వెళ్తుండగా యాక్సిడెంట్‌కు గురవుతాడు. ఆ తర్వాత తెలుగు భాషను మరిచిపోయి.. ఏదో తెలియని భాషను మాట్లాడుతుంటాడు.
ర్యాపిడో డ్రైవర్‌గా, న్యూస్ రిపోర్టర్‌గా చంద్రశేఖర్ ఎందుకు పనిచేస్తుంటాడు? జీవితంలో చంద్రశేఖర్ పొగొట్టుకొన్నది ఏమిటి? ఎలాంటి సమయంలో చంద్రశేఖర్‌కు యాక్సిడెంట్ జరిగింది? సత్యమూర్తి (మురళీశర్మ) ఎవరు? భాష మరిచిపోయిన చంద్రశేఖర్‌ను మామూలుగా చేయడానికి డాక్టర్ (రాజీవ్ కనకాల), వెన్నెల ఏం చేశారు. ఫారిన్ లాంగ్వేజ్ సిండ్రోమ్ డిసీజ్ అంటే ఏమిటి? చంద్రశేఖర్ చివరకు మామూలు మనిషి అయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే చెప్పాలని ఉంది సినిమా కథ.

భాష ఏదైనా గౌరవించాలి అనే ఒక ఫీల్‌గుడ్ పాయింట్‌తో చెప్పాలని ఉంది తెరకెక్కింది. దర్శకుడు అరుణ్ భారతీ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. అయితే ఆ పాయింట్‌ను ఓవరాల్ కథగా మార్చి ముందుకు నడిపించడంలో తడబాటుకు గురయ్యాడనిపిస్తుంది. అయితే కొత్తవారితో అవుట్‌పుట్‌ను రాబట్టుకొన్న తీరును అప్రిషియేట్ చేయాలి. కంటెంట్ బాగానే ఉంది. కానీ మరింత బలంగా కంటెంట్‌ను డిజైన్ చేయలేకపోయారనిపిస్తుంది.
మధ్య తరగతి యువకుడిగా, యువతిగా యష్ పూరీ, సెఫ్టీ పటేల్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అయితే పాత్రను అర్ధం చేసుకొని దానికి న్యాయం చేయాలనే తపన యష్ పూరీ, సెఫ్టీ పటేల్ కనిపించింది. కీలక సన్నివేశాల్లో ఇద్దరికి అనుభవలేమి కనిపించింది. కొత్తవారైనా ప్రతిభను చాటుకొనే ప్రయత్నం బాగుంది. మురళీ శర్మ మరోసారి తనదైన శైలిలో పాత్రకు జీవం పోశారు. హీరోయిన్ తండ్రిగా తనికెళ్ల భరణి భావోద్వేగమైన నటనను ప్రదర్శించారు. విలన్ పాత్రలో రఘుబాబు సర్ప్రైజ్ ఇస్తాడు. ఆలీ, సత్యం రాజేష్, నంద కిషోర్, అనంత్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

చెప్పాలని ఉంది సినిమాకు సంగీతం, సినిమాటోగ్రఫి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. భాష గురించి విజయ్ చిట్నీడి రాసిన డైలాగ్స్ అనుక్షణం ఆలోచింపజేస్తాయి. మిగితా సాంకేతిక విభాగాలు తమ పరిధి మేరకు ఒకే అనిపించారు. వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ అనుసరించిన నిర్మాణ ప్రమాణాలు బాగున్నాయి.
డ్రామా, రొమాన్స్, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ కలిపి అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్న చిత్రం చెప్పాలని ఉంది. మాతృభాషను ప్రేమిద్దాం.. పరాయి భాషను గౌరవిద్దాం అనే చక్కటి సందేశంతో దర్శకుడు అరుణ్ భారతి రాసుకొన్న పాయింట్ బాగుంది. అయితే పూర్తిస్థాయిలో కథగా చెప్పడంలో కాస్త తడబాటు కనిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. తగినంత వినోదం లభిస్తుంది.