ఛెప్పినా ఎవరూ నమ్మరు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5
Star Cast: ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్
Director: ఆర్యన్ కృష్ణ

ఇటీవల కాలంలో సృజనాత్మకతతో కూడిన చిన్న చిత్రాల హవా టాలీవుడ్‌‌లో కొనసాగుతూనే ఉంది. యువ డైరెక్టర్లు రూపొందించిన చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇలాంటి తరుణంలో జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఛెప్పినా ఎవరు వినరు'. యువ హీరో ఆర్యన్ కృష్ణ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా మెప్పించిందనే విషయం తెలుసుకోవాలంటే చెప్పినా ఎవ్వరూ నమ్మరు సినిమాను సమీక్షించాల్సిందే.

జీవితంలో ఏదైనా సాధించాలని ముగ్గురు యువకులు (ఆర్యన్ కృష్ణ, విక్రమ్ విక్కి , విజయేందర్) పట్టుదల, సంకల్పంతో ఉంటారు. ఈ క్రమంలో గోవాకు వెళ్లిన యువకులు డ్రగ్స్ మాఫియా పన్నిన ఉచ్చులో భాగంగా ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కొంటారు. డ్రగ్స్ మాఫియా అరాచకాలను ఓ జర్నలిస్టు బయటపెడుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో గోవాలో ముగ్గురు యువకులకు జోసఫ్ అనే గైడ్ పరిచయం అవుతాడు. ఈ సందర్భంగా జోసఫ్ చేతిలో ఉన్న డ్రగ్స్ బాటిల్ కిందపడటం దాని ప్రభావవంతో ముగ్గురు యువకులు మత్తులోకి జారుకొంటారు.

 cheppina evaru nammaru movie review and rating

గోవాలో డ్రగ్ మాఫియా ఉచ్చులో ముగ్గురు యువకులు ఎలా ఇరుక్కొన్నారు? మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? ఈ కథలో గైడ్ జోసఫ్ పాత్ర ఏమిటి? జోసఫ్‌తో పరిచయం తర్వాత ముగ్గురు యువకుల జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి. చివరకు ఈ ముగ్గురు యువకులు తన లక్ష్యాన్ని చేరుకొన్నారా? అనే ప్రశ్నలకు సమాధానమే చెప్పినా ఎవ్వరూ నమ్మరు కథ.

చెప్పినా ఎవ్వరూ నమ్మరు సినిమా విషయానికి వస్తే పక్కా యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పవచ్చు. యువకులతో కూడిన ప్రతిభావంతులు ఈ సినిమాలో భాగంగా కావడంతో సన్నివేశాల్లో ప్రెష్‌నెస్ కనిపిస్తుంది. ప్రతీ సీన్‌లో కొత్తదనం కనిపించేలా ప్రయత్నం చేశారు. ఈ సినిమా చూస్తున్న సేపు మరుక్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను కలిగించడంలో దర్శకుడిగా ఆర్యన్ కృష్ణ సఫలమయ్యారనే చెప్పవచ్చు. కొన్ని చోట్ల అనుభవ రాహిత్యం కనిపించినా.. తన ప్రతిభతో ఆ లోపాన్ని సరిదిద్దుకొన్నారు. ఓవరాల్‌గా నటనలోను, దర్శకత్వం బాధ్యతను ఆర్యన్ కృష్ణ పర్‌ఫెక్ట్‌గా నిర్వహించారనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే సుప్యార్ది సింగ్ గ్లామర్‌తో ఆకట్టుకొన్నారు. నటనపరంగా ఇంకా నేర్చుకోవాల్సి చాలానే ఉందనిపిస్తుంది.

ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. జగదీశ్ వేముల మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పలు సన్నివేశాలను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. భాస్కరభట్ల సాహిత్యం మరో హైలెట్‌గా మారింది. బురన్ షేక్, అఖిల్ వల్లూరి గోవా అందాలను చక్కగా కెమెరాలో బంధించారు. సన్నివేశాల సాగదీత లేకుండా అనకల లోకేష్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.

క్వాలిటీ కోసం రాజీ పడకుండా నిర్మాత ఎం మురళి శ్రీనివాసులు సినిమాను గ్రాండ్‌గా, రిచ్‌గా నిర్మించారు. చిన్న బడ్జెట్‌ చిత్రమైనా భారీ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా క్వాలిటీని మెయింటెన్ చేశారు. యువకులతో కూడిన టీమ్‌తో ఛెప్పినా ఎవరు వినరు ఫీల్‌గుడ్ మూవీగా రూపొందించారని చెప్పవచ్చు.

ప్రస్తుత జనరేషన్‌లో యువత ఆలోచనలు, దూకుడు, సమస్యను ఎలా చేధిస్తారనే విషయాలను ఛెప్పినా ఎవరు వినరు చిత్రంలో ఆర్యన్ కృష్ణ చక్కగా చూపించారు. ఇంటర్వెల్ ట్విస్ట్, సినిమా ద్వితీయ భాగంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొంటాయి. గోవాలో సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అన్నివర్గాలను ఆకర్షించే విధంగా దర్శకుడు ఆర్యన్ కృష్ణ స్క్రిప్టు పరంగా తీసుకొన్న జాగ్రత్తలు మెప్పిస్తాయి. కమర్షియల్ అంశాలతోపాటు చిన్న సందేశాన్ని ఇవ్వడంలో దర్శకుడు సఫలమయ్యారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి చెప్పినా ఎవ్వరూ నమ్మరు చిత్రం మంచి అనుభూతిని మిగుల్చుతుంది.

నటీనటులు: ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్
డైరెక్టర్: ఆర్యన్ కృష్ణ
నిర్మాత: ఎం. మురళి శ్రీనివాసులు
సినిమాటోగ్రఫీ: బురన్ షేక్, అఖిల్ వల్లూరి
సంగీతం: జగదీశ్ వేముల
ఎడిటర్: అనకల లోకేష్
లిరిక్స్: భాస్కరభట్ల
బ్యానర్: శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్
రిలీజ్: 2021-01-29

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X