For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Cheruvaina Dooramaina Movie Review: టాప్ కమెడియన్ అల్లుడు హీరోగా.. ఫీల్‌గుడ్ క్లైమాక్స్‌తో...

  |

  తెలుగు సినీ పరిశ్రమ ఎంతో మంది సినీ వారసులను అక్కున చేర్చుకొంటూ ప్రోత్సాహిస్తున్నది. చాలా మంది తమ ప్రతిభతో వెండితెర మీద రాణించేందుకు ప్రయత్నించి తమ అదృష్ణాన్ని పరీక్షించుకొంటున్నారు. ఇదే కోవలో నటుడు, కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి తెలుగు సినీ తెరకు పరిచయం అవుతున్నారు. చేరమైన దూరమైన చిత్రంతో ఆగస్టు 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మర్డర్ మిస్టరీతో ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకొందామా?

  ఆర్జీవి (శశి కుమార్ రాజేంద్రన్)కు తన చెల్లెలు అక్షర (తరుణి సింగ్) తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తాడు. కాలేజీలో ఎవరైనా చెల్లెలి వంక చూస్తే దారుణంగా శిక్షిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజ్‌లో చదివే సుజిత్ (సుజిత్ రెడ్డి)ని చూసి అక్షర ప్రేమలో పడుతుంది. అయితే తన కుటుంబంలో జరిగిన ఓ సంఘటన కారణంగా అక్షర ప్రేమకు దూరంగా ఉంటూ ఆమెను పట్టించుకోకుండా ఉంటాడు. సుజిత్ ప్రేమను పొందాలనుకొన్న అక్షర.. బతుకైనా, చావైనా నీతోనే అంటూ తెగిస్తుంది.

  Cheruvaina Dooramaina Movie Review: Comedian Srinivasa Reddys nephew Sujith Reddy into Tollywood

  అక్షర ప్రేమను సుజిత్ ఎందుకు తిరస్కరించేందుకు ప్రయత్నించారు? సుజిత్ కుటుంబంలో జరిగిన సంఘటన ఆయనపై ఎలాంటి ప్రభావం చూపింది. తన అన్నయ్య ఆర్జీవి పెట్టే ఆంక్షల వల్ల అక్షర ఎలాంటి ఇబ్బందులకు గురైంది. ఫీల్ మై లవ్ అంటూ సుజిత్ వెంట పడిన అక్షర ప్రేమ ఫలించిందా? ఈ అక్షర ప్రేమకు ముగింపు ఏమిటి? అక్షర ప్రేమ విషయంలో తన అన్నయ్య ఆర్జీవి యాటిట్యూడ్ ఏమైనా మారిందా అనే ప్రశ్నలకు సమాధానమే చేరువైన దూరమైన సినిమా కథ.

  సిస్టర్ సెంటిమెంట్ బలమైన అంశంగా మర్డర్ మిస్టరీగా సాగే సినిమా కథ చేరువైన దూరమైన. అటు సుజిత్ క్యారెక్టర్ కానీ.. ఇటు ఆర్జీవి క్యారెక్టర్ గానీ చెల్లెలి మంచి కోసం పరితపించడం ఈ సినిమాలో ఫీల్ గుడ్ పాయింట్. ప్రియురాలి మంచి కోసం ప్రియుడు తన ప్రేమను త్యాగం చేయాలనుకోవడం, అన్నయ్య ప్రేమకు దూరం కాలేక ప్రియుడికి దూరం కాలేక నలిగే పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తాయి. ఈ చిత్రంలో కొత్తవాళ్లే నటించినప్పటికీ.. నటనపరంగా ఆకట్టుకొన్నారు. సుజిత్, తరుణి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సీనియర్ నటులు బెనర్జీ, సుజిత్ తల్లిదండ్రులుగా దేవీప్రసాద్, మణిచందన ఈ సినిమాకు బలంగా మారారు. ఇక ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రాణంగా మారిందని చెప్పవచ్చు. ప్రతీ ఒక్కరిని చివరి 15 నిమిషాలు భావోద్వేగానికి గురిచేస్తుంది.

  Cheruvaina Dooramaina Movie Review: Comedian Srinivasa Reddys nephew Sujith Reddy into Tollywood

  సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఉప్పాడ బీచ్ ప్రాంతంలో షూట్ చేసిన సన్నివేశాలు హైలెట్‌గా, ఆహ్లాదకరంగా ఉంటాయి. సుకుమార్ పమ్మి మ్యూజిక్, సినిమాటోగ్రఫి సినిమాకు ఫీల్‌గుడ్ అంశాలుగా మారాయి. అనిల్ జల్లు ఎడిటింగ్ బాగుంది. ఇక సినిమాలో డైలాగ్స్ కూడా ఆకట్టుకొనేలా ఉన్నాయి. తన ప్రేమను రిజెక్ట్ చేసిన ప్రియుడిని ఉద్దేశించి.. నిన్ను లవర్‌లా కాకుండా దేవుడిలా చూడాలనిపిస్తుంది. నిన్ను ప్రేమిచడం కంటే పూజించడం మేలు అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్స్ హృదయాన్ని కదిలిస్తాయి. నిర్మాతలు కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చు విషయంలో రాజీ పడకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారని చెప్పవచ్చు.

  Cheruvaina Dooramaina Pre Release Event |Anil Ravipudi| Srinivas Reddy | Filmibeat Telugu

  దర్శకుడు చంద్రశేఖర్ కానూరి టేకింగ్ బాగుంది. సిస్టర్ సెంటిమెంట్‌ను జోడించి మర్డర్ మిస్టరీని బాగా డీల్ చేశాడు. క్లైమాక్స్ ఎవరూ ఊహించని రీతిలో డిజైన్ చేశాడు. చిన్న సినిమాలో కొన్ని లోపాలు ఉన్నా.. వాటిని వేలెత్తి చూపడం సరికాదు. ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాలపై పాజిటివ్ దృక్పథం ఏర్పడేలా పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ చేరువైన దూరమైన సినిమాను ఎలాంటి అంచనాలకు లేకుండా వెళ్లి చూడవచ్చు.

  English summary
  Tollywood's top Comedian Srinivasa Reddy's nephew Sujith Reddy has entered into Telugu film Industry with Cheruvaina Dooramaina Movie. In This occassion, Telugu Filmibeat brings Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X