Chhaava First Review: ఛావా ఫస్ట్ రివ్యూ.. రష్మిక మందన్న ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మోస్ట్ టాలెంటెడ్ హీరో వికీ కౌశల్ జంటగా రూపొందిన చిత్రం ఛావా. మరాఠా కింగ్ చత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా రూపొంది ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నది. ఈ క్రమంలో ఈ సినిమాపై ప్రముఖ క్రిటిక్ తనదైన శైలిలో రివ్యూ అందించారు. ఈ సినిమాపై సినీ విమర్శకుడు విశ్లేషణ ఏందనే వివరాల్లోకి వెళితే..
ఛావా సినిమా విషయానికి వస్తే.. శివాజీ సాంత్ రచించిన మరాఠీ నవల ఛావా ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మాణ సారథ్యంలో మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఛత్రపతి సంభాజీ మహారాజ్‌గా వికీ కౌశల్, మహరాణి యేసుభాయ్‌గా రష్మిక మందన్న, ఔరంగజేబ్‌గా అక్షయ్ కుమార్,అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయాన పెంటీ తదితరులు నటిస్తున్నారు.

చారిత్రాత్మక నేపథ్యంగా రూపొందిన ఛావా సినిమాను అత్యంత భారీగా నిర్మించారు. భారీ సెట్స్, పురాతన కాలం క్యాస్టూమ్స్‌ను డిజైన్ చేశారు. అలాగే టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ సినిమాను క్రేజీగా ప్రమోట్ చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాను సుమారుగా 130 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఛావా చిత్రాన్ని దుబాయ్‌కు చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ సెన్సార్ ప్రీమియర్‌ను చూసి తన రివ్యూను అందించారు. రష్మిక నటించిన ఈ సినిమా యావరేజ్‌గా కూడా లేదు అని షాకింగ్ కామెంట్ చేశాడు. ఈ మూవీ చాలా లౌడ్‌గా, ఇరిటేటింగ్‌గా ఉంది అని కామెంట్ చేశాడు. ఇంకా ఈ సినిమా అంతగా ఆకట్టుకొనేలా ఉండదనే విధంగా ట్వీట్లు చేస్తున్నాడు.
ఛావా సినిమాలో వికీ కౌశల్ పెర్ఫార్మెన్స్ డిజాస్టర్. రాజుల వేషంతో బాగా కనిపించడం లేదు. రష్మిక మందన్న ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. హిస్టారికల్ స్ట్క్రిప్టులో బూతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చరిత్రను వక్రీకరించి సినిమాను రూపొందించారు. ఓవరాల్‌గా ఈ సినిమా యావరేజ్‌గా కూడా లేదు. వీఎఫ్ఎక్స్ వర్క్ నాసిరకంగా ఉంది అంటూ ఉమేర్ సంధూ తనదైన శైలిలో తన రివ్యూను పోస్టు చేశారు.
అయితే ఉమేర్ సంధూ ఇచ్చే రివ్యూలు అంచనాలకు దూరంగా ఉంటాయి. ఎక్కువగా కొందరిని టార్గెట్ చేసి రివ్యూ ఇస్తారనే వాదన సోషల్ మీడియాలో ఉంది. ఈ క్రమంలో ఛావాపై ఆయన ఇచ్చిన రివ్యూను జాగ్రత్తగా పరిశీలస్తున్నారు. ఈ మూవీ ఎలా ఉంటందనేది సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా అనే ఫీలింగ్‌ను ట్రైలర్లు, ప్రమోషనల్ కాంటెంట్ ద్వారా స్పష్టమైంది.


Click it and Unblock the Notifications











