Chhaava Twitter Review: ఛావా మూవీ ట్విట్టర్ రివ్యూ.. రష్మిక, వికీ కౌశల్ మ్యాజిక్ వర్కవుట్ అయిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మోస్ట్ టాలెంటెడ్ హీరో వికీ కౌశల్ జంటగా రూపొందిన చిత్రం ఛావా. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నది. మరాఠా కింగ్ చత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. డయానా పెంటీ స్పెషల్ రోల్ కనిపించనున్నాను.

ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫి, మనీష్ ప్రధాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ముంబై, ఇతర ప్రాంతాల్లో ప్రదర్శించారు. ఈ సినిమాపై నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

Chhaava Twitter Review

ఛావా మూవీపై ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. మూవీ అద్బుతంగా ఉంది. హిస్టరీ, ఎమోషన్స్, ప్యాషన్, దేశభక్తి, యాక్షన్ అంశాలను మేలవించి రూపొందించారు. వికీ కౌశల్ యాక్టింగ్ టెర్రిఫిక్‌గా ఉంది. ఈ తరం నటుల్లో గొప్ప ఫెర్ఫార్మెన్స్ ముద్రను ప్రేక్షకుల హృదయాల్లో వేసుకొన్నాడు. స్టోరీ టెల్లర్‌గా లక్ష్మణ్ ఉటేకర్ గొప్ప సక్సెస్ సాధించడం ఖాయం అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఛావా చిత్రం చూసినంత సేపు రోమాలు నిక్కబొడిచేలా సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాతో మడోక్ ఫిల్మ్స్ మరోసారి గొప్ప విజయాన్ని అందుకోవడం ఖాయం. గుండెలు పిండేసే ఛత్రపతి సంబాజీ మహారాజ్ జీవిత కథ స్పూర్తిని కలిగించేదే కాకుండా కంటతడి పెట్టించేలా ఉంటుంది. వెండితెర దృశ్యకావ్యమే కాకుండా మంచి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా .. మిస్ కాకుండా చూడండి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ భావోద్వేగంగా సాగి ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుంది. ఈ సినిమా కథను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ అద్బుతంగా తెరకెక్కించాడు. త్యాగం, ప్రేమ అంశాలను మేలవించి ఈ సినిమాను తీర్చిదిద్దారు. సంభాజీ మహారాజ్‌గా వికీ కౌశల్ తన పాత్రలో పరకాయం చేయగా.. మహరాణి యేసుభాయ్‌గా రష్మిక మందన్న అద్బుతమైన పెర్ఫార్మెన్స్‌ను తెరపైన పండించింది అని ఓ నెటిజన్ తన రివ్యూను అందించారు.

ఛావా సినిమా పాటలు బాగున్నాయి. ఏఆర్ రెహ్మాన్ మరో అద్బుతమైన ఆల్బమ్‌ను అందించి సినిమాను సూపర్ హిట్ చేశాడు. అమర్ సింగ్ చమ్కిలా తర్వాత మరో మంచి ఆల్బమ్‌ను అందించారు అని నెటిజన్ కామెంట్ చేశాడు.

ఛావా చిత్రం యుద్ధం, గౌరవం, త్యాగాలకు ప్రతీ రూపం. మరాఠాల హీరోయిజం, క్రూరత్వంతో కూడిన చరిత్రను తెర మీద దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు. వీరుడిగా, సైన్యాధ్యక్షుడిగా వికీ కౌశల్ ఊహకు అందని పెర్ఫార్మెన్స్‌ను చూపించాడు. ప్రేక్షకుడిని కళ్లు తిప్పుకోని విధంగా నటీనటులు తమ నటనతో ఆకట్టుకొన్నారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


ఛావా మూవీ క్లైమాక్స్ మిమ్మల్ని మాటలకు అందని అనుభూతిని పంచుతుంది. ఆ సన్నివేశాలను చూసి మీరంతా స్టన్నింగ్ కావడం తథ్యం. కథలోని ఇంటెన్సిటి, ఎమోషన్స్, పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ మీ రోమాలను నిక్కబొడిచేలా చేస్తుంది. వికీ కౌశల్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అక్షయ్ ఖన్నాతో పోటాపోటీగా నటించాడు అని ఓ నెటిజన్ తన రివ్యూను పోస్టు చేశాడు.

ఛావా సినిమా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో టెర్రిఫిక్‌గా ఉంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితాన్ని అద్బుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఎంగేజింగ్‌గానే కాకుండా ఇన్ఫర్మేటివ్‌గా ఉంది. స్క్రీన్ ప్లే అద్బుతంగా ఉంది. మరాఠా యోధుడిగా వికీ కౌశల్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను అందించారు. రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ గొప్పగా ఉండటమే కాకుండా కథకు మరింత బలాన్ని అందించింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X