twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చపాక్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    By Staff
    |

    Rating:
    3.0/5
    Star Cast: దీపికా పదుకోన్, విక్రాంత్ మస్సీ, విశాల్ దహియా
    Director: మేఘనా గుల్జార్

    యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిథ కథ నేపథ్యంగా తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం చపాక్ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన దీపికా పదుకోన్ ఇటీవల దాడికి గురైన జేఎన్‌యూను సందర్శించడంతో ఈ సినిమాకు రాజకీయ రంగు పులుముకొన్నది. దాంతో ఈ సినిమాను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. దాంతో చపాక్ చిత్రంపై మీడియాతోపాటు, సగటు ప్రేక్షకుడిని దృష్టి పడింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చపాక్ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో దీపికా పదుకోన్ మెప్పించిందా? అనే విషయాన్ని తెలుసుకొనేందుకు కథలోకి వెళ్దాం.

    చపాక్ మూవీ కథ

    చపాక్ మూవీ కథ

    గాయనిగా రాణించాలనే కలను సాకారం చేసుకొనే ప్రయత్నించే 19 ఏళ్ల యువతి మాలతి (దీపిక పదుకోన్). ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో ఊహించని విధంగా యాసిడ్ దాడికి గురవుతుంది. దాంతో ఆమె జీవితం గందరగోళంగా మారుతుంది. కలలు కల్లలుగా మారిపోతాయి.

    చపాక్ మూవీలో ట్విస్టులు

    చపాక్ మూవీలో ట్విస్టులు


    యాసిడి దాడి తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయింది? తనపై దాడికి ప్రయత్నించిన బాయ్‌ఫెండ్ర్ బషీర్ షేక్ (విశాల్ దహియా)పై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నది? అసలు బాయ్‌ఫ్రెండ్ ఎందుకు దాడి చేశాడు?. తనకు జరిగిన తీరని అన్యాయంపై న్యాయ పోరాటం చేసే క్రమంలో మాలతీ జీవితంలో అమోల్ (విక్రాంత్ మస్సీ) పోషించిన పాత్ర ఏంటి? అమోల్ ఎలాంటి సహాయ సహకారాలు అందించారనేది సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..


    యాసిడ్ దాడి తర్వాత ఉద్యోగం కోసం వెతుకులాడే ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఉద్యోగానికి వెళ్లిన క్రమంలో ‘యాసిడ్ బాధితులకు సపరేట్‌గా కేటగిరి లేదు. ఒకవేళ ఉంటే నేను దానికి టిక్ చేసేదానిని' అలాగే బ్యూటీ పార్లర్‌లో పని చేయడానికి నేను అందంగా ఉండాలా? అనే డైలాగ్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. ఫస్టాఫ్‌లో యాసిడ్ దాడికి గురైన అందమైన అమ్మాయి పడిన కష్టాలు.. మానసిక వేధన తదితర అంశాలను దర్శకురాలు మేఘనా గుల్జార్ భావోద్వేగమైన రితీలో తెరక్కించారు.

    సెకండాఫ్ ఎలా ఉందంటే..

    సెకండాఫ్ ఎలా ఉందంటే..

    ఇక సెకండాఫ్‌లో మాలతి సాగించే న్యాయపోరాటమే ప్రధానంగా ఉంటుంది. మాలతి పోరాటం సగటు యువతికి మానసికంగా ధైర్యాన్ని, స్పూర్తిని అందించేలా ఉంటుంది. కాకపోతే కథనం సాగదీసినట్టుగా ఉండటం ప్రేక్షకులను కొంత అసహనానికి గురిచేస్తుంది. కాకపోతే ఓ మంచి సినిమాను చూసిన అనుభూతి చివర్లో మిగులుతుంది.

    దీపిక పదుకోన్ ఫెర్ఫార్మెన్స్

    దీపిక పదుకోన్ ఫెర్ఫార్మెన్స్


    దీపిక పదుకోన్ విషయానికి వస్తే మాలతి పాత్రలోకి చాలా సులభంగా పరకాయ ప్రవేశం చేసింది. అందవికారమైన పాత్రను చేయడానికి ముందుకు రావడమే ఆమె నటనకు సవాల్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఆమె నటన మరోస్థాయిలో ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ కథను అందించడానికి నిర్మాతగా మారడాన్ని కూడా ప్రశంసించాల్సిందే. మాలతి పాత్ర ద్వారా తన ప్రతిభతో మరోసారి అభిమానులను, సగటు ప్రేక్షకుడినే కాకుండా సినీ విమర్శకులను మెప్పించదని చెప్పవచ్చు. యాసిడి దాడి తర్వాత అద్దంలో తన రూపం చూసుకొని దు:ఖించే తీరు కంటతడి పెట్టిస్తుంది. ఇక మిగితా పాత్రదారుల్లో అమోల్‌గా విక్రాంత్ మాస్సే ఫర్వాలేదనిపించారు. మాలతి లాయర్ నటన ఇంప్రెసివ్‌గా ఉంది.

    మేఘన గుల్జార్ ప్రతిభ

    మేఘన గుల్జార్ ప్రతిభ

    యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ కథను తెరకెక్కించడానికి దర్శకురాలు మేఘన గుల్జార్ చేసిన కసరత్తు సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ఈ కథను తెరమీదకు మలచిన తీరు అభినందనీయం. తల్వార్, రాజీ సినిమాల తర్వాత చపాక్‌ను హృదయాన్ని తాకే భావోద్వేగమైన కథగా మలిచారని చెప్పవచ్చు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    బాలీవుడ్ చిత్రం చపాక్ భావోద్వేగాలను పండించిన చిత్రం. దర్శకురాలు మేఘన గుల్జార్ టాలెంట్‌కు ప్రతీక ఈ చిత్రమని చెప్పవచ్చు. అందాల తార దీపికా పదుకోన్ అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. దీపిక కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించే చిత్రంగా చెప్పవచ్చు. కమర్షియల్‌గానే కాకుండా.. అవార్డులు పంట పండించడానికి అవకాశం ఉంది.

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: దీపికా పదుకోన్, విక్రాంత్ మస్సీ, విశాల్ దహియా తదితరులు
    దర్శకత్వం: మేఘనా గుల్జార్
    రచన: అతికా చోహన్, మేఘన గుల్జార్
    నిర్మాతలు: ఫాక్స్‌స్టార్ స్టూడియోస్
    మ్యూజిక్: శంకర్ ఎహసాన్ లాయ్
    సినిమాటోగ్రఫి: మలయ్ ప్రకాశ్
    ఎడిటింగ్: నితిన్ బేద్
    బ్యానర్: ఫాక్స్‌స్టార్ స్టూడియోస్, కా ప్రొడక్షన్స్, మృగ ఫిలింస్
    రిలీజ్: 2020-01-10

    English summary
    Bollywood movie Chhapaak film directed by Meghna Gulzar and produced by her as well as Deepika Padukone in collaboration with Fox Star Studios. Based on the life of Laxmi Agarwal, it stars Padukone as an acid attack survivor, alongside Vikrant Massey.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X