Chinna Movie Review: సిద్దార్థ్ వన్ మ్యాన్ షో.. చిన్నా మూవీ రివ్యూ!

Rating: 3/5

నటీనటులు: సిద్దార్థ్, నిమిషా సజయన్, అంజలీ నాయర్ తదితరులు
దర్శకత్వం:ఎస్ యూ అరుణ్ కుమార్
నిర్మాత: సిద్దార్థ్
సినిమాటోగ్రఫి: బాలాజీ సుబ్రమణ్యం
ఎడిటింగ్: సురేష్ ఏ ప్రసాద్
మ్యూజిక్: ధిబూ నినన్ థామస్, సంతోష్ నారాయణ్, విశాల్ చంద్రశేఖర్
బ్యానర్: ఎటాకీ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2023-10-06

ఈశ్వర్ (సిద్దార్థ్) మున్సిపల్ శాఖలో పనిచేసే ఉద్యోగి. తన అన్నయ్య చనిపోవడంతో వదిన, సోదరుడి కూతురు చిట్టి అలియాస్ సుందర్‌ బాధ్యతలను తన భుజానికి ఎత్తుకొంటాడు. చిట్టి అంటే పంచ ప్రాణాలు. అలాంటి చిట్టికి ఇష్టమైన స్నేహితురాలిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఈశ్వర్‌పై వస్తాయి. ఈ ఆరోపణలు ఉండగానే.. తన చిట్టి కనిపించకుండా పోతుంది.

ఈశ్వర్‌తో చిట్టికి ఉన్న అనుబంధం ఎలా ఉంది? ఈశ్వర్ ప్రియురాలు (నిమిషా సజయన్)తో రిలేషన్ ఎలా సాగింది? 8 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం ఆరోపణలు వస్తే ఈశ్వర్ పరిస్థితి ఏమిటి? అత్యాచార ఆరోపణల నుంచి ఈశ్వర్ ఎలా తప్పించుకొన్నాడు? ఇక చిట్టి ఎలా కిడ్నాప్‌కు గురైంది? చిట్టిని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరు? చిట్టిని కిడ్నాప్ చేసి ఎలా వేధింపులకు గురిచేశాడు? చిట్టిని కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించి వెతుకులాట ఎలా సాగింది? చిట్టి కోసం ఈశ్వర్ పడిన తపన ఏమిటి? చిట్టిని కిడ్నాప్ చేసి.. లైంగిక దాడి చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడింది? అనే ప్రశ్నలకు సమాధానమే చిన్నా సినిమా కథ.

 Chinna Movie Review

మున్సిపల్ శాఖలో పారిశుద్ద విభాగానికి చెందిన ఈశ్వర్ క్యారెక్టర్, అతడి చుట్టూ ఉండే పరిస్థితులను చాలా డీటైల్డ్‌గా చూపించడం ద్వారా ఏదో ఆర్ట్ ఫిలిం చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. క్యారెక్టర్లను, కథను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకోవడంతో సాగదీసినట్టు అనిపిస్తుంది. కాకపోతే కొన్ని సీన్లలో ఉండే ఎమోషన్స్, మానసిక సంఘర్షణ కథలో ప్రేక్షకుడిని లీనమయ్యేలా చేస్తుంది. ఇక ఇంటర్వెల్‌‌కు 20 నిమిషాల ముందు అసలు కథ మొదలవ్వడంతో సినిమా ఎమోషనల్ జోన్‌లోకి ప్రవేశిస్తుంది.

Siddharth

ఈశ్వర్‌పై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో కథంతా అదే విధంగా సాగుతుందా? అనే ఓ ఆసక్తి క్రియేట్ చేసిన దర్శకుడు.. ఫస్టాఫ్ కాన్‌ఫ్లిక్ట్‌కు వెంటనే పుల్‌స్టాప్ పెట్టి.. మరో ఎమోషనల్ పాయింట్‌ను పట్టుకొని కథలో మరింత భావోద్వేగాన్ని నింపడంలో సక్సెస్ అయ్యాడు. చిట్టి కిడ్నాప్ డ్రామా హృదయాన్ని పిండేసేలా చేస్తుంది. సెకండాఫ్‌లో కథ నడిచిన విధానం చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ఓ ఫీల్‌గుడ్ ఎమోషనల్ మూవీ చూడబోతున్నామా? అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ క్లైమాక్స్‌ను చాలా అస్పష్టంగా, తొందరపడి ముగించిన ఫీలింగ్ కలుగుతుంది.

చిన్నా సినిమాలో సిద్దార్థ్‌ను చూస్తే.. పూర్తీగా డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్. తనకు ఉన్న చాక్లెట్ బాయ్ ఇమేజ్‌కు దూరంగా క్యారెక్టర్‌ను ఎంపిక చేసుకొని అందులో దూరిపోయాడు. కథ తన చుట్టూ నడిచేలా రాసుకోవడం వల్ల సినిమాను పూర్తిగా తన భుజాలపైనే మోశాడు. చిట్టితో ఎమోషనల్ సీన్లు, అలాగే సెకండాఫ్‌లో సిద్దార్థ్ ఫెర్ఫార్మెన్స్ చూస్తే ఊహించని విధంగా భావోద్వేగాన్ని నింపుతాడు. చిట్టిగా చేసిన పాప, మరో పాప అద్బుతంగా నటించారు. నిమిషా, అంజలి నాయర్, ఇతర నటీనటులు కథకు బలంగా ఉండే పాత్రల్లో గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు.

Chinna Movie Review and Rating

చిన్నా మూవీ సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. లొకేషన్లు, నేచురాలిటీని బాలాజీ అద్బుతంగా కెమెరాలో బంధించాడు. విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను, సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త షార్ప్‌గా వ్యవహరించి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. సిద్దార్థ్ నిర్మాతగా కూడా వ్యవహరించడంలో సినిమా క్వాలిటీ, అవుట్ పుట్ విషయంలో ఎలాంటి రాజీ పడలేదని ప్రతీ ఫ్రేమ్ చెప్పకనే చెప్పింది. ఈ సినిమా తమిళ సినిమాకు చిత్తాకు డబ్బింగ్ చిత్రంగా రిలీజైంది. కానీ డబ్బింగ్ చెప్పించిన విధానం చూస్తే.. పక్కాగా తెలుగు సినిమా అనే ఫీలింగ్ కల్పించారు. అలాగే సినిమాలో తెలుగు బోర్డులు, తెలుగు నేటివిటీని మిస్ కాకుండా చూసుకోవడంతో పక్కాగా తెలుగు సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది.

చిన్నా సినిమా విషయానికి వస్తే.. దీపావళీ రోజున ఇంట్లో ఓ పాప మిస్ అయితే ఆ ఫ్యామిలీ పడే మానసిక సంఘర్షణే ఈ మూవీ కథ. ఈ కథలో ఎంత వరకు ఎమోషన్స్ జొప్పించాలో అంత వరకు జొప్పించి సక్సెస్ అయ్యారు. గతంలో చిన్న పిల్లలపై మానభంగాలు కథతో మహానది, గార్గీ, లవ్ స్టోరీ లాంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. అలాంటి కోవలోనే చిన్నా భావోద్వేగంగా సాగుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పాకులాడకుండా సహజసిద్దంగా సినిమాను అందించే ప్రయత్నమే ఈ సినిమాకు బ్యూటీ. సిద్దార్థ్‌తోపాటు, ఇతర నటీనటులు ఫెర్ఫార్మెన్స్ సినిమాకు అత్యంత బలంగా మారింది. గుండె కోత పెట్టే కంటెంట్‌తో వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. పిల్లలకు మొబైల్ ఫోన్లు అలవాటు చేస్తే ఎలాంటి దుష్బరిణామాలు జరుగుతాయే సందేశం చక్కగా ఉంది. ఈ సినిమా మంచి ఎమోషన్ నింపుతుందది.ఎలాంటి అంచనాలతో వెళ్లినా మిమ్మల్ని ఈ సినిమా నిరాశ పరచదు. మంచి ఫీల్‌తో బయటకు వచ్చే అంశాలు చాలానే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X