Chiranjeeva Movie Review: చిరంజీవ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: రాజ్ తరుణ్, కుషిత కల్లపు, కిరీటి, రాజా రవీంద్ర, సంజయ్ కృష్ణ, గడ్డం నవీన్, టేస్టీ తేజ తదితరులు
దర్శకత్వం: అభినయ్ కృష్ణ (జబర్దస్త్ అదిరే అభి)
నిర్మాతలు: రాహుల్ అవుదొడ్డి, సుహాసిని రాహుల్
సంగీతం: అచ్చు రాజమణి
సినిమాటోగ్రఫి: రాకేష్ ఎస్ నారాయణ్
ఎడిటింగ్: సాయి మురళి
ఓటీటీ రిలీజ్: ఆహా
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-11-07
తండ్రి చేసిన అప్పులను తీర్చలేక రకరకాల పనులు చేస్తూ శివ (రాజ్ తరుణ్) కుటుంబాన్ని పోషిస్తుంటాడు. తన కాలనీలో ఉండే దివ్య (కుషిత కల్లపు)తో ప్రేమలో ఉంటాడు. జాతక రీత్యా ఓ సంఘటన కారణంగా ఆయన అతీంద్ర శక్తులు వస్తాయి. దాంతో ఎదుటి వారి ఆయుష్షు తెలిసి పోతుంది. అలా తన ముందు ఉండే వ్యక్తులు ఎంత కాలం జీవిస్తారు. ఎన్ని రోజుల్లో చనిపోతారనే విషయం తెలిసిపోతుంది. తనకు లభించిన శక్తిని ఆసరాగా చేసుకొని తన తండ్రి చేసిన అప్పులను తీర్చే పనిలో ఉంటాడు. అయితే తనకు లభించిన శక్తితో ఎదుటి వారి ఆయుష్షును తెలుసుకొనే శివకు ఓ షాక్ తగులుతుంది.

శివ బాల్యం ఎలాంటి సమస్యలతో గడిచిపోయింది? శివ జీవితం గురించి ఓ గురూజీ చెప్పిన జాతకం ఎలా వర్కవుట్ అయింది? దివ్యతో లవ్ అఫైర్ ఎలా సాగింది. తనకు లభించిన శక్తులను తన లైఫ్ కోసం ఎలా ఉపయోగించుకొన్నాడు? తన శక్తిని పరీక్షించే విధంగా ఎదురైన షాకింగ్ సంఘటన ఏమిటి? శివ జీవితానికి, తనకు లభించిన శక్తులతో అతడి జీవితానికి ఎలాంటి మేలు జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే చిరంజీవ సినిమా కథ.
జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అదిరే అభి అలియాస్ అభినయ్ కృష్ణ తన తొలి ప్రయత్నంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి చిరంజీవ సినిమాను రూపొందించారు. అయితే యుముడు, ఎదుటి వాళ్ల చావును తెలుసుకొనే మహిమ అనే డిఫరెంట్ పాయింట్‌తో ఊహించుకొన్న పాయింట్ బాగుంటుంది. కాకపోతే మంచి పాయింట్‌ను పూర్తి స్థాయి కథను ఎమోషనల్ డ్రామాతో కూడిన సన్నివేశాలను రాసుకోవడంలో కొంత మేరకే సక్సెస్ అయ్యాడు. ఇంకా కథ, కథనాలపై దృష్టిపెట్టి ఉంటే ఇంకా బెటర్ రిజల్డ్ వచ్చి ఉండేదనిపిస్తుంది.
తొలి చిత్ర దర్శకుడైనా అనుభవం ఉన్న డైరెక్టర్‌గా కథను చెప్పే ప్రయత్నం కనిపించింది. ఫన్, సెంటిమెంట్, మైథాలజీ టచ్ ఉండే ఈ సినిమా కామెడీ లవర్స్‌కు బాగా నచ్చుతుంది. తెలంగాణలోని యుముడి ఆలయం గురించిన సమాచారం. అలాగే బస్సును విధి వెంటాడిన ఎపిసోడ్ ఆయన దర్శకత్వ ప్రతిభను తెలియజెప్పాయి. ఇంకాస్త జాగ్రత్త పడి కంటెంట్ బాగా ప్లాన్ చేసుకొని ఉంటే.. డైరెక్టర్‌గా 100 కు 100 మార్కులు సొంతం చేసుకొనే వారనే అభిప్రాయం కలుగుతుంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. రాజ్ తరుణ్ తనదైన శైలిలో శివ క్యారెక్టర్‌ను అలవోకగా పోషించాడు. కామెడీ, ఎమోషన్స్‌ను పండిస్తూ తన టైమింగ్‌ను మెయింటెన్ చేశాడు. కుషిత గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నది. తన ప్రతిభను చాటుకోవడానికి పూర్తి స్థాయిలో రోల్ లభించకపోవడంతో తన పాత్ర పరిధి మేరకే నటించింది. రాజా రవీంద్ర, సంజయ్ కృష్ణ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అచ్చు రాజమణి మ్యూజిక్, రాకేష్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ సాయింట్. ఎడిటింగ్ పరంగా సాయి మురళీ పర్వాలేదనిపించినా.. ఇంకా కొంత ల్యాగ్ ఉందనిపిస్తుంది. కొన్ని సీన్లు కారణంగా సినిమా సాగదీతగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆహా పాటించిన నిర్మాణ విలువలు, పాత్రలకు ఎంపిక చేసిన నటీనటుల తీరు బాగుంది. ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్నది. తీరిక వేళను చూసుకొని.. ఒకేసారి ఈ సినిమాను చూసేయండి.. మంచి వినోదం, అనుభూతి కలుగుతుంది.


Click it and Unblock the Notifications











