twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    GodFather movie review సిల్వర్ స్క్రీన్‌పై మెగా శివతాండవం.. చిరంజీవితో రఫ్ ఆడించిన మోహన్ రాజా!

    |

    Rating: 3.25/5

    మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ మూవీ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్‌లో గాడ్‌ఫాదర్ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆచార్య చిత్రం డిజాస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో మెగా అభిమానులు భారీగా ఆశలు పెట్టుకొన్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో నటించడంతో అంచనాలు రెండింతలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన గాడ్‌ఫాదర్ చిత్రం అభిమానులకు, ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. కథ, కథనాల సమీక్షలో వెళ్లాల్సిందే..

     గాడ్‌ఫాదర్ కథ ఏమిటంటే?

    గాడ్‌ఫాదర్ కథ ఏమిటంటే?

    రాష్ట్రానికి ముఖ్యమంత్రి పీకేఆర్ (సర్వదమన్ బెనర్జీ) కొడుకు బ్రహ్మ (చిరంజీవి), సత్యప్రియ (నయనతార) పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంటుంది. తన తల్లికి జరిగిన అన్యాయంతో బ్రహ్మను కుటుంబానికి దూరంగా సత్యప్రియ పెడుతుంది. కుటుంబ విభేదాలు తీవ్రస్థాయిలో ఉండగా.. ముఖ్యమంత్రి పీకేఆర్ ఆకస్మిక మరణంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. సీఎం పదవిని చేజిక్కించుకోవడానికి సీనియర్ నేతలు కుట్రలకు తెరలేపుతారు. ఈ పరిస్థితులను అవకాశంగా చేసుకొని సత్యప్రియ భర్త జయదేవ్ (సత్యదేవ్) సీఎం పదవిని చేపట్టేందుకు కుట్ర పన్నుతాడు.

    గాడ్‌ఫాదర్ మూవీలో ట్విస్టులు

    గాడ్‌ఫాదర్ మూవీలో ట్విస్టులు

    సీఎం కొడుకైనా బ్రహ్మ కుటుంబానికి ఎందుకు దూరంగా ఉంటాడు? సత్యప్రియ, బ్రహ్మ మధ్య విభేదాలకు కారణం ఏమిటి? తండ్రి మరణం తర్వాత కుటుంబానికి బ్రహ్మ అండగా ఉండాలని ఎందుకు అనుకొంటాడు? జయదేవ్ సీఎం పదవిని అధిష్టించడానికి ఎలాంటి కుతంత్రాలకు పాల్పడ్డాడు. జయదేవ్ అక్రమాలను బ్రహ్మ ఎలా అడ్డుకొన్నాడు. బ్రహ్మ చేపట్టిన మిషన్‌లో మాసూమ్ భాయ్ (సల్మాన్ ఖాన్) ఎలా భాగమయ్యాడు? చివరకు జయదేవ్ తన లక్ష్యాన్ని చేరుకొన్నాడా? జయదేవ్ నిజస్వరూపాన్ని తెలుసుకొన్న సత్యప్రియ ఏం చేసింది? పీకల్లోతు కష్టాల్లో ఉన్న సోదరికి బ్రహ్మ ఎలాంటి సాయం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే గాడ్‌ఫాదర్ సినిమా కథ.

    గాడ్‌ఫాదర్ ఫస్టాఫ్‌లో

    గాడ్‌ఫాదర్ ఫస్టాఫ్‌లో

    రాష్ట్ర సీఎం మరణంతో కథ ఎమోషనల్‌గా ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలను పరోక్షంగా తెర మీద చెబుతూ.. పొలిటిక్ అంశాలతో కథను ముందుకు వెళ్తుంది. జయదేవ్ రాజకీయ కుతంత్రాలు, పోలీస్ అధికారి (సముద్రఖని) పాత్రల తీరుతో కథ మరింత పకడ్బందీగా కథ ముందుకు సాగుతుంది. రేణుక దంపతులు (సునీల్, దివి వద్యా) ఎపిసోడ్‌తో ఫస్టాఫ్‌ మరో రేంజ్‌కు వెళ్తుంది. ఫస్టాఫ్‌లో పూరీ జగన్నాథ్‌తో సన్నివేశాలు, సల్మాన్ ఎంట్రీ హైలెట్‌గా మారడమే కాకుండా కథను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి.

     సల్మాన్, చిరంజీవి క్రేజ్ పీక్స్

    సల్మాన్, చిరంజీవి క్రేజ్ పీక్స్

    సెకండాఫ్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ పాత్ర ఎలివేషన్స్ సినిమాను మరింత క్రేజీగా మార్చాయి. ఇక నయనతార, సత్యదేవ్, తన్యా రవిచంద్రన్ పాత్రల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు సినిమాను మరో రేంజ్‌లో పెట్టింది. ఇక క్లైమాక్స్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో జరిగే రచ్చ ఫ్యాన్స్‌కు పండుగ భోజనంగా మార్చేస్తుంది. ఓవరాల్‌గా చిరంజీవి కెరీర్‌లో ది బెస్ట్ అని చెప్పుకొనే మాస్ ఎంటర్‌టైనర్‌గా గాడ్‌ఫాదర్ నిలిచింది.

    దర్శకుడు మోహన్ రాజా టేకింగ్

    దర్శకుడు మోహన్ రాజా టేకింగ్

    గాడ్‌ఫాదర్‌ను సినీ ప్రేక్షకులు, అభిమానులకు ఫుల్ మీల్స్‌లా అందించడంలో దర్శకుడు మోహన్ రాజా అద్బుతమైన ప్రతిభను చాటుకొన్నాడు. లూసిఫర్ ఛాయలు ఎక్కడా కనపడకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అద్బుతమైన స్క్రీన్ ప్లేతో గాడ్‌ఫాదర్‌ను అన్ని వర్గాలను ఆకట్టుకొనే విధంగా రూపొందించాడు. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు, మాస్, కమర్షియల్ అంశాలను చక్కగా డీల్ చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల చిత్రీకరణ, బిల్డప్ షాట్స్, క్లైమాక్స్ అద్బుతంగా డీల్ చేశాడు. స్టైలిష్ మేకింగ్‌తో చిరంజీవిని కొత్తగా చూపించడంలో డిస్టింక్షన్ సాధించారని చెప్పవచ్చు.

    చిరంజీవి అదే జోష్.. అదే గ్రేస్

    చిరంజీవి అదే జోష్.. అదే గ్రేస్

    చిరంజీవి నటన, ఫెర్ఫార్మెన్స్, యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. బ్రహ్మ పాత్రలో నట శివతాండవం చేశాడని చెబితే చిన్నమాటవుతుంది. అదే జోష్, గ్రేస్, యాటిట్యూడ్, లుక్‌తో ఇరగదీశాడు. ఇక చిరంజీవి తర్వాత ఆ రేంజ్‌లో నయనతార, సత్యదేవ్ పోటీపడి నటించారు. సల్మాన్ ఖాన్ సినిమాకు మరింత క్రేజ్, గ్రేస్‌ను తెచ్చిపెట్టాడు. సునీల్, దివి వద్యా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. తన చుట్టూ తిరిగే కథలో తన పాత్రకు సంబంధించి తన్యా రవిచంద్రన్ మెచ్యురిటీని ప్రదర్శించింది. మిగితా పాత్రల్లోని వారు వందకు వందశాతం న్యాయం చేశారు.

     తమన్ మ్యూజిక్ మ్యాజిక్

    తమన్ మ్యూజిక్ మ్యాజిక్

    ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. తమన్ తన మ్యూజిక్‌తో బాక్సుల బద్దలు చేసే బీజీఎం ఇచ్చారు. పలు సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడిచే విధంగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. తార్ మార్ టక్కర్ మార్ పాట సినిమాకు హైలెట్.. ఫ్యాన్స్‌కు కొత్త ఎనర్జీని ఇచ్చింది. నీరవ్ షా సినిమాటోగ్రఫి అద్బుతంగా ఉంది. సన్నివేశాల్లో ఎమోషన్స్ నింపడానికి వాడుకొన్న లైటింగ్ బాగుంది. ఎడిటింగ్, ఇతర విభాగాలు అన్ని పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను మరింత రిచ్‌గా, నటీనటుల ఎంపిక ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ జోన్‌లోకి తీసుకు రావడానికి దోహదపడ్డాయి.

    ఫైనల్‌గా గాడ్‌ఫాదర్ ఎలా ఉందంటే

    ఫైనల్‌గా గాడ్‌ఫాదర్ ఎలా ఉందంటే

    లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ వ్యాల్యూస్, పాలిటిక్స్ లాంటి అంశాలతో రూపొందిన చిత్రం గాడ్‌‌ఫాదర్. తెలుగు ప్రేక్షకులకు ఈ కథ తెలియనిదేమీ కాదు. కానీ తెలిసిన కథను తెర మీద కన్నార్పకుండా తెరకెక్కించడంలో మోహన్ రాజా టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. లక్ష్మీభూపాల డైలాగ్స్ తుటాల మాదిరిగా పేలాయి. అంచనాలకు రెండింతలు మించి లక్ష్మీ భూపాల తన మాటలతో అభిమానుల కడుపు నింపేశాడని చెప్పవచ్చు. పండగపూట గాడ్ ఫాదర్.. పంచభక్ష్య పరమాన్నం లాంటి మూవీ అనిచెప్పవచ్చు. దసరా పండుగ రోజున వచ్చిన ఈ చిత్రం అభిమానులకు దీపావళీ పండుగను ముందే తెచ్చేసేంత అనుభూతిని నింపింది. డోంట్ వెయిట్.. థియేటర్‌లో మెగా అనుభూతిని పొందండి..

    English summary
    Chiranjeevi's GodFather movie review and Rating: Director Mohan Raja steal the show
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X