మంచి సినిమాకు చిరునామా

By Staff

Chirunama
చిత్రం: చిరునామ
నటీనటులు: అజిత్‌, జ్వోతిక, రఘువరన్‌, విశ్వనాథ్
సంగీతం: దేవా
నిర్మాత: మల్లికార్జున్‌ రెడ్డి
దర్శకత్వం: దొరై

అర్థం లేని సినిమాలు, కప్పిగంతులతో విసిగిపోయిన తెలుగు ప్రేక్షకులకు చిరునామా ఊరటనిస్తుంది. ఒక చక్కటి చిత్రాన్ని చూసిన అనుభూతిని కలిగిస్తుంది. అనుకున్న పని సాధించేందుకు ఒక క్రియేటివ్‌ పర్సన్‌ పడే తపనను ఎంతో చక్కగా చిత్రీకరించారీ సినిమాలో. ఒక దర్శకుడి హానెస్ట్‌ అటెంప్ట్‌ ఈ సినిమా.

అజిత్‌ వర్ధమాన సంగీత దర్శకుడు. సినిమా మ్యూజిక్‌ డైరక్టర్‌ కావాలనేది అతని లక్ష్యం. ఎనిమిదేళ్ళుగా అజిత్‌ మెట్లెక్కని స్టూడియో లేదు. కలవని దర్శక, నిర్మాతలు లేరు. హామీలు పుష్కలం. అవకాశం ఇచ్చే వాళ్ళే కరువు. అయినా ఇంట్లో నాన్న, అన్నావదిన అందరూ అతన్ని వెన్నంటి ప్రోత్సహిస్తారు. క్యాజ్‌ వల్‌ గా పరిచయమైన స్నేహితురాలు జ్వోతిక కూడా అజిత్‌ ను ఎంకరేజ్‌ చేస్తుంది. అతనికి అవకాశం దక్కేందుకు ప్రయత్నిస్తుంది. ఒకసారి అజిత్‌ కు జ్వోతిక వల్ల ఛాన్స్‌ వస్తుంది. రికార్డింగ్‌ ప్రారంభమవుతుంది. కానీ ప్రొడ్యుసర్‌ కు యాక్సిడెంట్‌ కావడంతో..రికార్డింగ్‌ క్యాన్సిల్‌ అవుతుంది. దాంతో అజిత్‌ డిప్రెషన్‌ కు గురవుతాడు. మరోవైపు జ్వోతిక కావాలో, మ్యూజిక్‌ కావాలో తేల్చుకోమని జ్వోతిక తండ్రి అల్టిమేటం ఇస్తాడు. మ్యూజిక్‌ తన ప్రాణం అని అంటాడు.

అన్న రఘువరన్‌ కు హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది. హాస్పిటల్‌ ఖర్చులు భరించాలంటే పని చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి జాబ్‌ చేసేందుకు సిద్ధమవుతాడు. సినిమా ఇక్కడితో ఆపేస్తే బావుండేది. కానీ అనవసరంగా మరో ట్విస్ట్‌ పెట్టి సినిమాను పొడగించాడు దర్శకుడు. ఓ సంవత్సరం తర్వాత అజిత్‌ పెద్ద సినిమా దర్శకుడి అవుతాడని చూపించడం అనవసరం.

సినిమా కథకు అనుగుణంగా వినసొంపైన పాటలున్నాయి. కర్ణాటక, వెస్ట్రన్‌ లను కలిపి దేవా చేసిన సంగీతప్రయోగం బావుంది. పాటలకు తగ్గ చిత్రీకరణ, డాన్స్‌ మూవ్‌ మెంట్స్‌ చక్కగా కుదిరాయి. దర్శకుడు దొరై తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అజిత్‌, జ్వోతికలతో పాటు నటీనటులందరి నటన ప్రశంసనీయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X