చిరునవ్వుతో చూడొచ్చు

By Staff

Chirunavvuto
వేణు, లయతో స్వయంవరం చిత్రం నిర్మించి విజయం సాధించిన ఎస్‌.పి.ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ సంస్థ నిర్మించిన ద్వితీయ చిత్రం- చిరునవ్వుతో. సింపుల్‌ కథను తీసుకొని రూపొందించిన ఈ చిత్రం ఫర్వాలేదన్న రీతిలో సాగింది. ఇప్పటి ట్రెండ్‌ ప్రకారం ప్రేమకథకు కాస్తా కామెడీ, నాలుగైదు పాటలు జోడించి తీసిన సాధారణ చిత్రం. కాకపోతే ఎక్కడా బోర్‌ కొట్టించకుండా చిత్రం నడవడం వల్ల ఇప్పటి చిత్రాల్లో కాస్త బెటర్‌ చిత్రమని చెప్పొచ్చు. కొత్త దర్శకుడు రాంప్రసాద్‌ ఆలోచనల్లో కొత్తదనం లేకపోయినా చిరునవ్వుతో చూడగలిగేలా రూపొందించాడు. కామెడీ ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్‌.

వేణు హోంసైన్స్‌ చదివి, వంటలు బాగా చేయగలిగినా ఉద్యొగం దొరకదు. 'మనసుతో ఆలోచించి, బుర్రతో పనులు' చేసే వేణు మరదలు పెళ్ళిపీటల మీద నుంచి లేచిపోతుంది- వేరే అతన్ని పెళ్లి చేసుకునేందుకు. సో...బాధతో సొంత ఊరును వొదిలి హైదరాబాద్‌ వస్తాడు. అక్కడ ఓ ఫ్రెండ్‌ దగ్గర ఉంటూ తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో షహీన్‌ పరిచయం అవుతుంది. ఆ పరిచయం పెరిగి పెద్దదై ఇద్దరూ కలిసి తిరుగుతుంటారు. వేణు ఆమెను ప్రేమిస్తుంటాడు. కానీ షహీన్‌ దాన్ని ఫ్రెండ్‌ షిప్‌ గా మాత్రమే భావిస్తుంది. ప్రకాష్‌ రాజ్‌ తో ఆమెకు పెళ్ళిసంబంధం కుదురుతుంది.

దాంతో వేణు తన ప్రేమను బయటపెడుతాడు. ఆమె ప్రేమించకున్నా తన ప్రేమ ఆగదని చెబుతాడు. ఈ లోగా పారిపోయిన మరదలు(ప్రేమ) తిరిగి వస్తుంది. ప్రేమించినవాడు వదిలేయడంతో తిరిగి వేణు చేరదీస్తాడు. తనని వదిలేసి వెళ్ళిన అమ్మాయిపై కూడా కోపం ప్రదర్శించకపోవడం, ప్రకాష్‌ రాజ్‌ ప్రవర్తన నచ్చకపోవడంతో చివరికి షహీన్‌ కూడా ప్రేమలో పడుతుంది. ఎట్టకేలకు వేణు, షహీన్‌ పెళ్ళిచేసుకోవడంతో సినిమా ముగుస్తుంది.

ఒక్క పాట మినహా సంగీతం బాగాలేదు. మణిశర్మ ఈ మధ్య కాలంలో సంగీతం అందించిన చిత్రాలన్నింటిలాగే పేలవమైన మ్యూజిక్‌ ఉంది ఈ చిత్రంలో. వేణు నటన ఇంకా ఇంప్రూవ్‌ కావాలి. కనీసం మేకప్‌ విషయంలోనైనా శ్రద్ధ చూపాలి. షహీన్‌ ఓకే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X