twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాయిగొలిపే చిత్రం

    By Staff
    |

    Chitram
    చిత్రం: చిత్రం-ది పిక్చర్
    నటీనటులు: ఉదయ్‌ కిరణ్‌, రీమాసేన్‌, తనికెళ్ల, రాళ్ళపల్లి
    సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్
    కెమెరా: రసూల్‌
    నిర్మాత: రామోజీరావు
    కథ, మాటలు, దర్శకత్వం: తేజ

    అప్పుడే కాలేజీలోకి అడుగుపెట్టిన టీనేజ్‌ కుర్రకారు ఆలోచనలు, ఆకర్షణలు ఎలా ఉంటాయో తెలిపే చిత్రం ఇది. ఆ వయసులో ఏర్పడే ఆకర్షణలను ప్రేమనుకోవడమూ సహజం. టీనేజ్‌ లవ్‌ స్టోరీ ను చాలా హృద్యంగా చిత్రీకరించడంలో దర్శకుడి తేజ మంచి ప్రతిభను కనబరిచాడు. కథ కన్నా చిత్రీకరించిన తీరు చాలా బావుంది. తెలుగులో ఇలాంటి టీనేజ్‌ లవ్‌ స్టోరీలు చాలా తక్కువగా వచ్చాయి.

    తనికెళ్ళ భరణి ఓ గుమాస్తా. అతని భార్య రాజేశ్వరి. వీరికి ముగ్గురు కొడుకులు. వీరిలో పెద్దవాడు రమణ(ఉదయ్‌ కిరణ్‌). ఇతడే ఈ చిత్రంలో హీరో. గిటార్‌ వాయించడమంటే తెగ పిచ్చి ఉన్న రమణ ఇంటర్మీడియేట్‌ చేస్తుంటాడు. కాలేజ్‌ లోనూ మ్యూజిక్‌ పిచ్చి ఉన్న ఓ గ్యాంగ్‌ ఉంటుంది. వారే మనవాడి ఫ్రెండ్స్‌. అమెరికా నుంచి వచ్చిన జానకి(రీమా సేన్‌), ఆమె అక్క కూడా అదే కాలేజ్‌ లో చదువుతుంటారు. రమణ, జానకి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అది ఆకర్షణగా మారి ప్రేమగా మారుతుంది.

    ఓ సారి ఎవరూ లేని ఏకాంతసమయంలో ఇద్దరూ ఒకటవుతారు. ఫలితం-జానకి గర్భవతి అవుతుంది. అబార్షన్‌ కు జానకి ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ పెళ్ళిచేసుకోకతప్పదు. బిడ్డ పుట్టడం, ఆ పిల్ల ఆలనాపాలన, చిన్నవయసులో సంసార బాధ్యతలు.. వీరికి పెద్దతలనొప్పిగా అన్పిస్తాయి. కలతలు మొదలవుతాయి. చివరికి ఫలితం ఏమిటన్నదే ఈ చిత్రం ముగింపు.

    కథలో వురీ కొత్తదనం లేకపోయినా, చిత్రదర్శకుడు తేజా పటిష్టమైన స్క్రీన్‌ ప్లేను రూపొందించాడు. వైవిధ్యంగా చిత్రీకరించిన తీరే ఈ చిత్రం హైలెట్‌. ఆయా పాత్రలకు తగ్గ నటీనటులను ఎంచుకోవడంలోనూ తేజ చక్కటి తెలివిని ప్రదర్శించాడు. ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది- సంగీతం. అన్ని పాటలూ బావున్నాయి. రసూల్‌ కెమెరా పనితనం తోడవ్వడంతో చిత్రంలోని పాటలన్నీ విభిన్నంగా, అందంగా ఉన్నాయి. ఉదయ్‌ కిరణ్‌, రీమాసేన్‌ లకు ఇది తొలి చిత్రమైనా బాగా నటించారు. ఎక్కడా అసహజమైన నటన కనిపించదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X