twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'చూసొద్దాం..రండి' అంటే మొహమాట పడకండి!

    By Staff
    |

    Chusoddam Randi
    -జలపతి గూడెల్లి
    చిత్రం: చూసొద్దాం..రండి
    నటీనటులు: జగపతిబాబు, శ్రీకాంత్‌, రంభ, కోట, ఎమ్మెస్‌ నారయణ
    సంగీతం: కీరవాణి
    ఫోటోగ్రఫీ: ప్రసాద్‌
    నిర్మాత: సుంకర మధు మురళి
    దర్శకత్వం: రాజా వన్నెం రెడ్డి

    కథలో కొత్తదనం లేకున్నా కథనం నూతనంగా ఉండేందుకు తాపత్రయపడడం ఈనాటి చిత్రనిర్మాణ పద్దతి. ఇందుకు భిన్నంగా కొత్త కథను తీసుకొని పాత పద్దతిలో చిత్రాన్ని తీయడం చూసొద్దాం....రండి సినిమా ప్రత్యేకత. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి చిత్రానికి దర్శకత్వం వహించిన రాజావన్నెంరెడ్డికి ఇది రెండో సినిమా. ఐనా ఇంకా స్ర్కీన్‌ ప్లే మీద పట్టు రానట్లుంది. అన్నీ పాత సన్నివేశాలే. కామెడీలోనూ పాత స్టైలే. కథ బావున్నా కథనమే ఈ చిత్రానికి పెద్దలోపం. ఫర్వాలేదనిపించే చిత్రమిది.

    రంభ, జగపతి బాబు ప్రేమించుకుంటారు. వీరి ప్రేమను రంభ తల్లితండ్రులు అంగీకరించరు. దాంతో తల్లితండ్రులను కాదని ప్రియుణ్ణి అన్వేషించుకుంటూ హైదరాబాద్‌ వస్తుంది. జగపతి బాబు ఇల్లు మారడంతో అతను దొరకడు. అతన్ని ఎలాగైనా కలుసుకునేందుకు అక్కడే రూం అద్దెకు తీసుకుంటుంది. అద్దె ఇల్లు ఇప్పించే బ్రోకరు శ్రీకాంత్‌ ఇంట్లోనే అద్దెకు ఉంటుంది. శ్రీకాంత్‌ కు తన అక్క కూతురు అంటే ప్రాణం. ప్రేమ. ఆమె కోసం తన సంపాదన అంతా దాచి చీరలు, నగలు కొంటాడు. ఇక్కడో చిన్న ఫ్లాష్‌ బ్యాక్‌....

    శ్రీకాంత్‌ తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. వాళ్ళ అక్క ఇంట్లోనే పెరుగుతాడు. అక్క కూతురుగీత అంటే చాలా ఇష్టం. ఒక రోజు ఓ బొమ్మ కావాలని కోరుతుంది ఆ అమ్మాయి. దాంతో ఒక చిన్న అబద్దం ఆడి వేరే వాళ్ళ ఇంట్లో నుంచి బొమ్మను తీసుకొచ్చి ఇస్తాడు. ఆ బొమ్మ తనదేనంటూ వాళ్ళ అబ్బాయి కొట్లాడుతాడు శ్రీకాంత్‌ తో. అదుపుతప్పి ఆ అబ్బాయి గొడ్డలి మీద పడి చనిపోతాడు. శ్రీకాంతే అతన్ని చంపాడని భావించి పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. పదేళ్ళు జైల్లో గడిపాక హైదరాబాద్‌ వస్తాడు. ఎప్పటికైనా తన మేనకోడలునే పెళ్ళి చేసుకోవాలనేదే శ్రీకాంత్‌ కు బలమైన కోరిక. అందుకోసం డబ్బు కూడబెడుతుంటాడు. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎండ్స్‌.....

    ఒక రోజు రంభకు జగపతి బాబు కలుస్తాడు. ఇక ఇద్దరు పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. తన ప్రియుడు జగపతి బాబు దొరకాడని రంభ శ్రీకాంత్‌ కు చెపుతుంది. తన కుటుంబం గురించి చెపుతుంది. అప్పుడు తన మేనకోడలు గీత రంభనేని తెలుస్తుంది. దాంతో తన ప్రేమను చంపుకొని రంభకు, జగపతిబాబుతో పెళ్లి అయ్యేలా చేసేందుకు ప్రయత్నిస్తాడు. చివరికి వీరిద్దరిలో రంభ ఎవరిని పెళ్ళి చేసుకుంటుందనేది క్లైమాక్స్‌.

    నటన విషయానికి వస్తే శ్రీకాంత్‌, రంభల నటన బాగుంది. జగపతి బాబు నటనలో ఏ మాత్రం మార్పులేదు. ఏ సినిమాలోనైనా ఒకే విధమైన ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇవ్వడం అలవాటు అయినట్లుంది. చాలా గ్యాప్‌ తర్వాత కీరవాణి అందించిన సంగీతం ఫర్వాలేదు. 'చిన్ననాటి రెండు జెళ్ల ......'అనే పాట మాత్రం చాలా బావుంది. సన్నివేశాలలో నూతనత్వం లేకపోవడం ప్రధానమైన లోపం ఈ చిత్రంలో.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X