twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Cinema bandi మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.0/5
    Star Cast: వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి, త్రిషార, రాగ్ మయూర్, ఉమా వైజీ
    Director: ప్రవీణ్ కండ్రేగుల

    Recommended Video

    Cinema Bandi Review, డోంట్ మిస్.. మంచి సినిమా | Netflix | Tollywood || Filmibeat Telugu

    టాలీవుడ్‌ వెండితెరపై అప్పుడప్పుడు మల్లేశం, కేరాఫ్ కంచరపాలెం, మెయిల్, కలర్ ఫోటో చిత్రాలు ఎలాంటి సందడి లేకుండా వచ్చి ఓ మ్యాజిక్‌ను క్రియేట్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి కోవలో వచ్చిన చిత్రమే సినిమా బండి. రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజైన చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. అంతగా ఆకట్టుకొన్న సినిమా బండిలో విశేషాలు ఏమిటి, అసలు కథ, కథనాలు ఏమిటనే విషయాల్లోకి వెళితే..

    సినిమా బండి కథ ఏమిటంటే..

    సినిమా బండి కథ ఏమిటంటే..

    ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దులోని గొల్లపల్లి అనే గ్రామంలో వీరబాబు (వికాస్ విశిష్ట) ఆటో డ్రైవర్. ఆటో నడుపుకొంటూ జీవితాన్ని సాగించే వీరబాబుకు తన ఆటోలో ఓ నల్ల బ్యాగులో ఓ పెద్ద కెమెరా దొరుకుతుంది. తొలుత ఆ కెమెరాను అమ్మి తనకు కుటుంబానికి ఉన్న సమస్యలను తీర్చుకోవాలనుకొంటాడు. కానీ తన ఆలోచనను మార్చుకొని సినిమా తీయాలని డిసైడ్ అవుతాడు. ఆ క్రమంలో ఊర్లోని ఏకైక ఫోటో‌గ్రాఫర్ గణపతి (సందీప్ వారణాసి)ను కలసి తన ఆలోచనలను చెబుతాడు. దాంతో వీరబాబు డైరెక్టర్‌గా, గణపతి సినిమాటోగ్రాఫర్‌గా సినిమా మొదలవుతుంది.

    సినిమా బండిలో కీలక మలుపులు

    సినిమా బండిలో కీలక మలుపులు

    సినిమా తీయాలనే ప్రయత్నంలో వీరబాబుకు ఎదురైన సమస్యలు ఏమిటి? తన సినిమాకు తన ఊరి వారిని నటీనటులుగా ఎంపిక చేసుకోవడానికి పడిన కష్టాలు ఏమిటి? సినిమాటోగ్రాఫర్‌గా మారిన గణపతితో వీరబాబుకు ఎదురైన క్రియేటివ్ డిఫరెన్సేస్ ఏమిటి? నిర్మాతగా, దర్శకుడిగా వీరబాబుకు గ్రామస్థుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో వీరబాబు సినిమా తీయాలనే లక్ష్యం నెరవేరిందా? కెమెరా పొగొట్టుకొన్న వారికి అది లభించిందా? అసలు వీరబాబు సినిమాను ఎందుకు తీయాలనుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా బండి కథ.

    సినిమా బండి ఎలా సాగిందంటే

    సినిమా బండి ఎలా సాగిందంటే

    అన్ని సినిమాలు, కథలు ఒకేలా ఉండవు అంటూ.. అత్యంత గ్రామీణ నేపథ్యం, నాగరికతకు దూరంగా ఉండే వాతావరణంలో సినిమా బండి కథ మొదలవుతుంది. వీరబాబు వ్యక్తిగత, ఇంటి కష్టాలతో ప్రారంభమైన కథ.. ఆ తర్వాత సరికొత్త మలుపు తిరుగుతుంది. కెమెరా దొరికిన తర్వాత చోటుచేసుకొనే నాటకీయత సినిమాను ఫీల్‌గుడ్‌గా మారుస్తుంది. హీరోయిన్‌ ఒప్పించడానికి, ఒప్పించిన హీరోయిన్ మధ్యలో వెళ్లిపోతే ఎదురయ్యే కష్టాలు పెద్ద సినిమాల చరిత్రను గుర్తు చేస్తుంది. సినిమా తీస్తావా అంటూ ఆటో డ్రైవర్‌ హేళన చేయడం, అలాగే కెమెరా పగిలిపోయిన తర్వాత చోటుచేసుకొనే సీన్లు సినిమాకు మరింత బలంగా మారాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్లు మరింత ఎమోషనల్‌గా ఉంటాయి.

    దర్శకుడి ప్రతిభ గురించి..

    దర్శకుడి ప్రతిభ గురించి..

    దర్శకుడు ప్రవీణ్ ఓ చిన్న పాయింట్‌ను తీసుకొని కథను అల్లుకొన్న తీరును ముందు అభినందించాల్సిందే. ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం లేని నటీనటులతో సినిమా చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. కేవలం కంటెంట్‌ను నమ్ముకొని చేసిన ప్రయత్నం తెరపై బాగా వర్కవుట్ అయిందనే చెప్పాలి. గ్రామస్థుల్లో ఉంటే అమాయకత్వం, నిజాయితీ, భోళాతనం తెర మీద ముచ్చట గొలిపేలా చిత్రీకరించారు. రాయలసీమ యాసను చక్కగా పాత్రల చేత పలికించడం సినిమాకు బలంగా మారింది. పెద్దగా ట్విస్టులు లేకుండా సుత్తి లేకుండా సూటిగా కథ చెప్పిన తీరు ఎవరైనా అభినందించాల్సిందే. ప్రేక్షకులను కొత్తదనంతో ఆకట్టుకోవాలనే తాపత్రయం దర్శకుడిలో అనువణువునా కనిపిస్తుంది.

    నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    వీరబాబుగా వికాస్ వశిష్ట, గణపతిగా సందీప్ వారణాసి, మరిదేశ్ బాబుగా రాగ్ మయూర్, సింధూ, దివ్య, మంగగా ఉమా వైజీ పాత్రలు అద్భుతంగా పండాయి. తమ పాత్ర పరిధి మేరకు వారు పూర్తిగా న్యాయం చేశారు. కొంతమంది నటీనటులు అత్యంత సహజత్వంతో పాత్రలో ఒదిగిపోయారు. మరోసారి కేరాఫ్ కంచెరపాలెం సినిమాను గుర్తు తెచ్చుకొనే విధంగా తమ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ఏ ఒక్క పాత్రను కూడా తీసి పక్కన పెట్టకుండా దర్శకుడు పక్కాగా కథను రాసుకొన్నారు.

    టెక్నికల్ టీమ్ గురించి

    టెక్నికల్ టీమ్ గురించి

    సినిమా బండి సినిమాకు సంబంధించి సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అపూర్వ శాలిగ్రామ్, సాగర్ వైవీవీ సినిమాటోగ్రఫి గురించి ముందుగా చెప్పుకొవాలి. పల్లె వాతావరణాన్ని కెమెరాలో బంధించిన విధానం బాగుంది. సహజత్వం ఉట్టిపడేలా చిత్రీకరించిన సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా ఉన్నాయి. ఇక సత్యవోలు శిరీష్ మ్యూజిక్ కథకు సరిగ్గా అతికినట్టుగా అనిపిస్తుంది. మ్యూజిక్ కారణంగా చాలా సీన్లు మరింత ఎలివేట్ అయ్యాయి. కాకరాల ధర్మేంద్ర, గిరిజాల రవితేజ ద్వయం ఎడిటింగ్ పనితీరు బాగుంది. డైలాగ్స్, ఇతర అంశాలన్నీ చక్కగా కుదిరాయి.

    నిర్మాతలు, ప్రొడక్షన్ వ్యాల్యూస్

    నిర్మాతలు, ప్రొడక్షన్ వ్యాల్యూస్

    తెలుగులోను, బాలీవుడ్‌లోను అనేక చిత్రాలను రూపొందించడమే కాకుండా ఇటీవల ఓటీటీలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న నిర్మాత, దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే విజన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. కమర్షియల్ విలువలను ఆలోచించకుండా కంటెంట్‌ను మోస్ట్ కమర్షియల్ ఫ్యాక్టర్‌గా మలుచుకొన్న తీరు మెప్పించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    టాలీవుడ్‌లో గత కొద్దికాలంగా వస్తున్న మూస చిత్రాలకు భిన్నంగా కంటెంట్, క్వాలిటీ ఉన్న చిత్రం సినిమా బండి. ఎప్పుడూ పెదవిపై చిన్న చిరునవ్వును కొనసాగిస్తూ మనసును తేలిక పరిచే చిత్రమని చెప్పవచ్చు. సినిమా అంటే స్టార్ రైటర్, స్టార్ హీరో, హీరోయిన్లు, పెద్ద బ్యానర్ లాంటి అంశాలు ఉండాలని ఆలోచించే వారికి సినిమా బండి చెంపపెట్టు లాంటింది. రెండుగంటలపాటు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈ సినిమా బండి ప్రయాణం చక్కగా సాగిపోతుంది. వెకిలితనం లేని స్వచ్చమైన వినోదాన్ని అందిస్తూనే అప్పుడప్పుడు హృదయాన్ని తాకే భావోద్వేగమైన సీన్లతో సరదాగా సాగుతూ.. అప్పుడే సినిమా ముగిసిందా అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఓవరాల్‌గా కొత్తదనాన్ని, రొటీన్‌కు భిన్నంగా ఉండే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి, త్రిషార, రాగ్ మయూర్, ఉమా వైజీ తదితరులు
    డైరెక్టర్: ప్రవీణ్ కండ్రేగుల
    నిర్మాతలు: రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే
    స్క్రీన్ ప్లే: ప్రవీణ్ కండ్రేగుల, కృష్ణ ప్రత్యూష, వసంత్ మారింగంటి
    మ్యూజిక్: సత్యవోలు శిరీష్
    సినిమాటోగ్రాఫర్: అపూర్వ శాలిగ్రామ్, సాగర్ వైవీవీ
    ఎడిటర్: కాకరాల ధర్మేంద్ర, గిరిజాల రవితేజ
    రచన: వాసంతి మారింగంటి
    ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
    రిలీజ్: 2021-05-14

    English summary
    Tollywood's latest movie is Cinema bandi. This movie released on Netflix OTT Platform on May 14th. This film produced by Krishna DK, Raj Nidimoru. Vikas Vashista,Sandeep Varanasi,Trishara, Rag Mayur, Uma Yg, Ram Charan, Davani, Sirivennela Yanamandhala in lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X