Circle Movie Review నీలకంఠ ఖాతాలో సక్సెస్ పడిందా? సాయి రోనక్ రొమాన్స్ వర్కవుట్ అయిందా?

Rating: 2.5/5

నటీనటులు: సాయి రోనక్, రిచా పనాయ్, అర్షిణ్ మెహతా, బాబా భాస్కర్, నైనా తదితరులు
దర్శకత్వం: నీలకంఠ
నిర్మాతలు: ఎంవీ శరత్ చంద్ర, టీ సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగాడ
సినిమాటోగ్రాఫర్: రంగనాథ్ గోగినేని
ఎడిటర్: మధు రెడ్డి
రిలీజ్ డేట్: 2023-07-07

సుపారీ తీసుకొని వ్యక్తులను చంపే కాంట్రాక్ట్ కిల్లర్ పుత్తూరు గణేష్ (బాబా భాస్కర్). డబ్బు కోసం ఏకంగా 49 హత్యలు చేస్తాడు. ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తున్న ఫోటోగ్రాఫర్ కైలాష్ (సాయి రోనక్). తన కెరీర్‌లో అరుంధతి (రిచా పనాయ్), మాళవిక (నయన), రాజస్థాన్ యువరాణి హిమానీ రాజ్‌పుత్‌ (అర్షిణ్ మెహతా)తో కైలాష్‌కు బ్రేకప్స్ జరుగుతాయి. అయితే తన జీవితంలో చోటు చేసుకొన్న పరిస్థితుల కారణంగా కైలాష్ మద్యానికి బానిస అవతాడు. ఆ క్రమంలో కైలాష్‌ ఇంటికి వచ్చి అతడిని చంపేందుకు పుత్తూరు గణేష్ ప్లాన్ చేస్తాడు?

ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన అరుంధతిని కైలాష్‌ ఎందుకు దూరం చేసుకొన్నాడు? మాళవికతో కైలాష్‌కు బ్రేకప్ ఎందుకు జరిగింది? రాజస్థాన్ యువరాణి హిమానీతో ఎలా ప్రేమలో పడ్డాడు? కైలాష్‌ను చంపమని ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు? పుత్తూరు గణేష్ తన 50వ మర్డర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేశాడా? పూత్తురు గణేష్ దాడి నుంచి కైలాష్ ఎలా తప్పించుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే సర్కిల్ Circle Telugu Movie Review సినిమా కథ.

Circle movie review

కైలాష్ అనే ఫోటోగ్రాఫర్ జీవితంలో జరిగిన మూడు ప్రేమ కథలను సంపుటిగా దర్శకుడు నీలకంఠ చెప్పే ప్రయత్నం చేశారు. రెండు కథలతో సినిమా ఫస్టాఫ్‌ను ఆసక్తికరంగా నడిపించాడు. అయితే సెకండాఫ్‌ విషయానికి వస్తే.. హిమానీ రాజ్‌పుత్ క్యారెక్టర్‌తో కైలాష్ లవ్ స్టోరి బాగుంది. Circle Telugu Movie Review కానీ విపరీతంగా సాగదీయడంతో ఆసక్తి తగ్గిపోయిందనిపిస్తుంది. పుత్తూరు గణేష్, కైలాష్ మధ్య సెకండాఫ్‌లో సాగిన ఎపిసోడ్ సహనానికి పరీక్షగా ఉంటుంది. కాకపోతే దర్శకుడు నీలకంఠ కథ చెప్పే విషయంలో తన మార్కు చాటుకొన్నాడు. కథ మీద ఇంకాస్త కసరత్తు చేసి.. క్లైమాక్స్‌ను ఎమోషనల్ ముగించి ఉంటే బాగుంటుందనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. సాయి రోనక్ ఇటీవల కాలంలో రొమాంటిక్ లవ్ స్టోరీస్‌తో తనకంటూ ఒ మార్క్ చాటుకొంటున్నాడు. Circle Telugu Movie Review రాజయోగం తర్వాత ఆ రేంజ్ పాత్ర మరోసారి లభించింది. మూడు ప్రేమ కథల్లో సాయి రోనక్ గెటప్స్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొంటాడు. ఇక రిచా పనాయ్, నయన, అర్షిణ్ మెహతా తమ పాత్రల పరిధి మేరకు రాణించారు. రిచా, నయన, అర్షిణ్ గ్లామరస్‌గా, అందంగా తెర మీద కనిపించారు.

సర్కిల్ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, ఫోటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందమైన లొకేషన్లు సినిమాను రిచ్‌గా మార్చాయి. కలర్ ప్యాటర్ సన్నివేశాలను ఆహ్లదకరంగా మార్చాయి. ఎన్ఎస్ ప్రసు మ్యూజిక్, రంగనాథ్ గోగినేని సినిమాటోగ్రఫి బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.

ఫైనల్‌గా సర్కిల్ సినిమా గురించి చెప్పాలంటే.. లవ్, రొమాంటిక్, క్రైమ్ అంశాలతో రూపొందిన ఎంటర్‌టైనర్. గతంలో ఎన్నో గొప్ప సినిమాలు అందించిన నీలకంఠ మరోసారి విభిన్నమైన సినిమాను అందించే ప్రయత్నం చేశారు. Circle Telugu Movie Review స్లోగా సాగే కథ, కథనాలు ఈ సినిమాకు మైనస్. రొమాంటిక్ ప్రేమ కథలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. బీ, సీ సెంటర్లకు చేరువైతే మంచి విజయం అందే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X