Citadel Honey Bunny Review: సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ

Rating:
3.0/5

నటీనటులు: సమంత రుత్ ప్రభు, వరుణ్ ధావన్, కేకే మీనన్, సికందర్ ఖేర్, సాకిబ్ సాలీమ్ తదితరులు
కథ: సితా ఆర్ మీనన్, రాజ్ అండ్ డీకే
మ్యూజిక్: అమన్ పంత్
నిర్మాతలు: సయ్యద్ జెయిద్ ఆలీ, ఆలెక్ కోనిక్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ఆంథోని రుసో, జో రుస్పో, రాజ్ అండ్ డీకే
సినిమాటోగ్రఫి: జోహన్ హెర్లీన్ ఎయిడ్
ఎడిటర్: సమీత్ కొషియన్
బ్యానర్: అమెజాన్ ఎంజీఎమ్ స్టూడియోస్, పీకేఎం, డీ2ఆర్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2024-11-07

హానీ (సమంత రుత్ ప్రభు) సినీ నటిగా చెలామణి అవుతూ ఓ ప్రాజెక్ట్ కోసం సీక్రెట్ ఏజెంట్‌గా పని చేస్తుంటుంది. ఆమెకు నాడియా అనే కూతురు కూడా ఉంటుంది. అలాగే రాహీ గంభీర్ (వరుణ్ ధావన్) స్టంట్ మాస్టర్‌‌గా పనిచేస్తూ బన్నీగా సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. విశ్వ అనే కోడ్ పేరుతో పని చేసే జగన్ (కేకే మీనన్) కోసం వీరద్దరూ పనిచేస్తుంటాడు. డేవిడ్ వద్ద ఉన్న ఓ డిస్క్‌ను దొంగిలించేందుకు రెడీ అవుతారు.

Citadel Honey Bunny Web Series Review

సీక్రెట్ ఏజెంట్ హానీ పేరుతో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేసే సమయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది? డేవిడ్ వద్ద ఉన్న సమాచారం, దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? రాహీ గంభీర్‌తో ప్రేమాయణం ఎలా సాగింది? కూతురు నాడియా సినిమా థియేటర్‌లో ఎందుకు ఉంది? సీక్రెట్ ఏజెంట్స్‌గా హానీ, బన్నీ చేపట్టిన ప్రాజెక్ట్ ఏమిటి? విశ్వ కోడ్‌తో జగన్ చేపట్టిన ప్రాజెక్ట్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వెబ్ సిరీస్ కథ.

డేవిడ్ కళ్లు గప్పి ఆయన వద్ద ఉన్న డిస్క్‌ను సొంతం చేసుకోవాలనే ప్లాన్‌తో హానీ ఏజెంట్‌గా పంపడం అనే పాయింట్‌తో కథలోకి తీసుకెళ్లిన తీరు బాగానే ఉంది. కానీ పాయింట్ చుట్టూ రాసుకొన్న యాక్షన్ ఎపిసోడ్‌ ఎఫెక్టివ్‌గా కనిపించదు. హానీ చేసిన ప్రయత్నంలో జరిగిన యాక్సిడెంట్‌తో కథ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. అప్పటికే ఏజెంట్‌గా పనిచేసే బన్నీతో పరిచయం, ప్రేమ యూత్‌ను ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఆ తర్వాత సినీ నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న హానీ ఎందుకు సీక్రెట్ ఏజెంట్‌గా మారిందనేది కన్విన్సింగ్‌గా ఉంది.

Citadel Honey Bunny Web Series Review in Telugu  Samantha Ruth Prabhu Steals the Show

1992 నుంచి 2000 మధ్య జరిగే కథను ఇంట్రెస్టింగ్ చెప్పడంలో రాజ్ అండ్ డీకే తమ మార్కు చూపించారు. హానీ కూతురు నాడియా (కష్వి మజుందార్) క్యారెక్టర్‌ను కథలో జొప్పించిన విధానం బాగుంది. ఎమోషన్స్, యాక్షన్‌తో నడిచే డ్రామా బాగుంది.

నటీనటుల విషయానికి వస్తే.. సీక్రెట్ ఏజెంట్‌గాను, లవర్‌గా, తల్లిగా సమంత మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. యాక్షన్ సీన్లలో కష్టపడిన విధానం, అలాగే వరుణ్ ధావన్‌తో కలిసి పండించిన రొమాన్స్ హైలెట్‌గా చెప్పుకోవచ్చు. వరుణ్, సమంత మధ్య లిప్ లాక్ యూత్‌కు పండుగ లాంటి విషయంగా మారింది. నాడియా పాత్ర కథలో భావోద్వేగాలను పండించేందుకు ఉపయోగపడింది. చిన్నారి అద్బుతంగా నటించింది. వరుణ్ ధావన్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. మిగితా క్యారెక్టర్లు కథలో భాగమై నడిచాయి.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. అమన్ పంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జోహన్ హెర్లీన్ సినిమాటోగ్రఫి ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్. ఫైట్స్, ఛేజింగ్ సీన్లను క్యాప్చర్ చేసిన తీరు యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకొనేలా ఉంది. రూసో, రాజ్ డీకే అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రియాంక చోప్రా సిటాడెల్‌‌ కథను ఇండియన్ నేటివిటికి మార్చిన విధానం కొత్తగా ఉందని చెప్పుకోవచ్చు.

Citadel Honey Bunny Web Series Review in Telugu  Samantha Ruth Prabhu Steals the Show

సమంత యాక్టింగ్, చైల్డ్ సెంటిమెంట్, యాక్షన్ తదితర అంశాల ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ సిటాడెల్ హానీ బన్నీ. సీక్రెట్ ఏజెంట్ కథాంశం చుట్టు అల్లుకొన్న లవ్, ఎమోషన్స్ కొత్తగా లేకపోయినప్పటికీ.. ఫర్వాలేదనిపిస్తాయి. నాడియా క్యారెక్టర్ ఈ సినిమాకు బలంగా ఉంటుంది. ఈ వారం ఓటీటీలో యాక్షన్ లవర్స్‌కు చక్కటి ఎంటర్‌టైనర్‌గా నిలిచే సిరీస్‌గా ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X