‘క్లైమాక్స్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
1.0/5

Recommended Video

Climax Movie Review And Rating

రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. శృంగార తార మియా మాల్కోవాతో తీసిన జీఎస్టీ ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఆమెతోనే క్లైమాక్స్ అనే మరో సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ మూవీని శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే రిలీజ్ చేశారు. క్లైమాక్స్ కథాకమామీషు ఏంటో ఓ సారి చూద్దాం.

కథ

కథ

ఓ జంట (మియా మాల్కోవా, రెనాన్ సేవరో) ఎంజాయ్ చేయడానికి ఎడారి ప్రాంతంలోకి వెళ్తారు. అక్కడి నిశిద్ద ప్రదేశంలోకి వెళ్లిన వారిద్దరి కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురువుతాయి. సరదా కోసం వెళ్లిన ఆ జంటకు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి.

కథలో ట్విస్ట్‌లు..

కథలో ట్విస్ట్‌లు..


వినోదం కోసం వెళ్లిన ఆ జంటకు ఎదురైన ఆ సంఘటనలు ఏంటి? వారిపై దాడి చేసిన దుండగులు ఎవరు? వారిద్దరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? చివరకు మియా మాల్కోవా ఏమైంది? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే క్లైమాక్స్.

నటీనటుల పనితీరు..

నటీనటుల పనితీరు..

క్లైమాక్స్ చిత్రంలో చెప్పుకోదగ్గ పాత్ర ఏదైనా ఉందా అంటే అది కేవలం మియా మాల్కోవానే. తన అంద చెందాలతో అందర్నీ కట్టిపడేసింది. అయితే టీజర్, ట్రైలర్, పాటల్లో చూపెట్టిన గాఢత సినిమా మొత్తం కనిపించలేదు. దీంతో ఎంతో ఊహించుకున్న ప్రేక్షకులకు భంగపాటు తప్పదు. మిగిలిన వారంతా ఎందుకు వస్తున్నారో వెళ్తున్నారో వారికే తెలియాలి.

సాంకేతిక నిపుణుల పనితీరు..

సాంకేతిక నిపుణుల పనితీరు..

ఈ చిత్రంలో అన్నింటికంటే ప్రధానమైనది నిడివి. కేవలం 52 నిమిషాలు ఉండటమే అందర్నీ కాపాడింది. లేదా ఈ సినిమాను వీక్షించడం కానీ, భరించడం కానీ కుదిరేది కాదు. ఈ విషయంలో ఎడిటర్ కాస్త పాసయ్యాడు. ఇక సంగీతం, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు విసుగు పుట్టించేలా ఉంది. అయితే వర్మ సినిమాలో కనిపించే కెమెరా పనితనం ఇందులోనూ కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. ఎడారి ప్రాంతాన్ని, మియా మాల్కోవా అందాలను ఎంతో అద్భుతంగా చూపించారు. ఎప్పటిలాగే గాలికొదిలేసిన కథ, కథనాలు మళ్లీ ప్రేక్షకులను నిరాశపరిచాయి.

ఫైన‌ల్‌గా..

ఫైన‌ల్‌గా..

వర్మ మరోసారి ప్రేక్షకులను భంగపాటుకు గురిచేశాడు. అయితే ఇది థియేటర్లో విడుదల కాలేదు కాబట్టి కాస్త మేలు జరిగినట్టే. ఈ ‘క్లైమాక్స్'ను చూసేది ఫోన్‌లోనో, ల్యాప్ టాప్‌లోనో కాబట్టి ఎప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంటుందా? అని ఎదురుచూడాల్సిన పని లేకుండా మధ్యలోనే స్కిప్ చేయవచ్చు.

బలాలు, బలహీనతలు..

బలాలు, బలహీనతలు..

ప్లస్ పాయింట్స్
నిడివి
మియా మాల్కోవా

మైనస్ పాయింట్స్
కథ,కథనాలు
దర్శకత్వం
సంగీతం

నటీనటులు

నటీనటులు

నటీనటులు : మియా మాల్కోవా, రెనాన్ సేవరో
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : శ్రేయాస్ ఈటి, ఆర్ ఎస్ ఆర్ ప్రొడక్షన్స్
మ్యూజిక్ : రవిశంకర్
సినిమాటోగ్రఫి : అగస్థ్య మంజు
రిలీజ్ డేట్ : 2020-06-06
రేటింగ్ : 1/5

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X