For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Cobra movie Review విక్రమ్ నట విశ్వరూపం.. అజయ్ జ్ఞాన‌ముత్తు బ్రిల్లియెంట్ టేకింగ్.. కానీ!

  |

  Rating: 3/5

  Recommended Video

  విషయం ఉన్న విక్రమ్, విషం లేని కోబ్రా - రివ్యూ (సొంత అభిప్రాయం) *Reviews | Telugu FilmiBeat

  విభిన్నమైన పాత్రలకు, విలక్షణమైన నటనకు కేరాఫ్ అడ్రస్ చియాన్ విక్రమ్. సేతు, శివపుత్రుడు, అపరిచితుడు లాంటి చిత్రాలతో అద్భుతమైన ప్రతిభను ప్రేక్షకులకు అందించాడు. తమిళ సినీ పరిశ్రమలో రచనా చాతుర్యం, టెక్నికల్ బ్రిల్లియెన్స్‌తో దర్శకుడు అజయ్ జ్ఞాన‌ముత్తు తన మార్కును సెట్ చేసుకొన్నాడు. వీరిద్దరి కలయికలో కోబ్రా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటం సహజం. ప్రేక్షకుల భారీ అంచనాలను కోబ్రా చిత్రం అందుకొన్నదా? కోబ్రా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించిందనే విషయాల్లోకి వెళితే..

  కోబ్రా కథ ఏమిటంటే?

  కోబ్రా కథ ఏమిటంటే?

  మది (విక్రమ్) మ్యాథమెటిక్స్‌లో జీనియస్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పక్కా ప్లాన్ ప్రకారం హత్యలు చేస్తూ ఇంటర్‌పోల్, సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు సవాల్ విసురుతాడు. భావన మీనన్ (శ్రీనిధి శెట్టి) అనే టీచర్‌తో ప్రేమలో మది ఉంటాడు. ఈ క్రమంలో రాజీవ్ రిషి (మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ) మదిని చంపేందుకు వెంటాడుతుంటాడు. మరోవైపు అస్లాం (ఇర్ఫాన్ పఠాన్) అనే ఇంటర్ పోల్ అధికారి మదిని పట్టుకోనేందుకు ఇండియాలో ప్రయత్నాలు చేస్తుంటాడు.

  కోబ్రా కథలో ట్విస్టులు

  కోబ్రా కథలో ట్విస్టులు

  ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులను మది ఎందుకు హత్య చేస్తున్నాడు. స్కాట్లాండ్ యువరాణిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? మదిని రాజీవ్ రిషి ఎందుకు చంపాలనుకొన్నాడు? రిషి ఏజెంట్‌గా పనిచేసే పోలీస్ ఆఫీసర్ (జాన్ విజయ్) మదిని ఎలా టార్గెట్ చేశాడు. మదితో జెడీ (మీనాక్షి)కి ఉన్న సంబంధం ఏమిటి? మది జీవితంలో జెన్నిఫర్ (మృణాళిని రవి) పాత్ర ఏమిటి? ఎందుకోసమైతే మది విధ్వంసం సృష్టిస్తున్నాడో ఆ లక్ష్యాన్ని చేరుకొన్నాడా? భావనతో మది పెళ్లి జరిగిందా? రిషి, మది మధ్య పోరాటానికి ఎలాంటి ముగింపు లభించింది. ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లాం తన లక్ష్యాన్ని చేరుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే కోబ్రా సినిమా.

  ఫస్టాఫ్‌లో కన్‌ఫ్యూజన్‌తో

  ఫస్టాఫ్‌లో కన్‌ఫ్యూజన్‌తో

  కోబ్రా సినిమా తొలి భాగం విషయానికి వస్తే.. మది రకరకాల వేషాలతో హత్యలకు పాల్పడటం లాంటి అంశాలతో ఆసక్తిగా కథ సాగుతుంది. అయితే లాజిక్కులు, డిటేయిలిటీలు లేకపోవడం వల్ల కథలో ఏం జరుగుతుంది అనే విషయం ఓ పట్టాన అర్ధం కాదు. అయితే విక్రమ్ తన నటనతో ప్రతీ సీన్‌‌ను ఓ రేంజ్‌తో పెంచుకొంటూ పోయాడనిపిస్తుంది. ఇక అజయ్ జ్ఞాన‌ముత్తు స్క్రీన్ ప్లే చాలా ట్రిక్కీగా ఉంటడంతో కథలో కాస్త కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి అంశాల మధ్య ఓ చిన్న లవ్ ట్రాక్‌తో కథ ఫీల్‌గుడ్‌గా కనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్‌కు ముందు ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌లో ఓ ట్విస్టు రివీల్ కావడంతో సినిమా సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెరుగుతుంది.

  సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాగా

  సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాగా

  కోబ్రా సినిమా సెకండాఫ్‌పై పెరిగిన అంచనాలకు తగినట్టే కథ చాలా ఎమోషనల్‌గా మారుతుంది. రకరకాల పాత్రలు, భావోద్వేగమైన ప్రేమకథ, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, రకరకాల ట్విస్టులు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఇక దర్శకుడు అజయ్ జ్ఞాన‌ముత్తు టెక్నికల్ బ్రిల్లియెన్స్, స్క్రీన్ ప్లేతో కథను ఆడుకొన్న విధానం మరింత ఆసక్తిని పెంచుతుంది. చివర్లో ఊహించని ట్విస్టుతో క్లైమాక్స్‌ను ముగించడం కోబ్రా హై ఎనర్జీ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది.

  దర్శకుడి టేకింగ్ గురించి

  దర్శకుడి టేకింగ్ గురించి

  దర్శకుడు అజయ్ జ్ఞాన‌ముత్తు ఊహించుకొన్న పాయింట్.. దానిని కథ, కథనాలుగా విస్తరించిన తీరు సామాన్య ప్రేక్షకుడికి కొంత జీర్ణం కాని పరిస్థితి. కానీ సన్నివేశాల పరంగా, ఎమోషన్స్, యాక్షన్, గ్రాఫిక్స్‌తో ప్రేక్షకుడిని కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. స్కాట్లాండ్ యువరాణి కిడ్నాప్ సీన్, అలాగే మది ఇంటరాగేషన్, అలాగే సీఎం మర్డర్ సన్నివేశాలు ఊహకు అందకుండా ఉంటాయి. సాధారణ కథకు మ్యాథమెటిక్స్ జోడించి సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్ధం అయ్యేలా సీన్లు రాసుకోవడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది.

  చెలరేగిపోయిన విక్రమ్

  చెలరేగిపోయిన విక్రమ్

  కోబ్రా చిత్రంలో విక్రమ్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు. పలు రకాల వేరియేషన్స్‌తో కూడిన పాత్రలను చాలా సులభంగా మెప్పించాడు. సెకండాఫ్‌లో కథకు బలంగా మారిన రెండు పాత్రల్లో విక్రమ్ యాక్టింగ్, పెర్ఫారెన్స్ అద్బుతంగా ఉంటుంది. ఇటీవల కాలంలో విక్రమ్‌ అద్భుతంగా నటించిన చిత్రాల్లో కోబ్రాను ఒకటిగా చెప్పుకోవచ్చు.

  శ్రీనిధి శెట్టి, ఇతర నటీనటుల గురించి

  శ్రీనిధి శెట్టి, ఇతర నటీనటుల గురించి

  ఇక శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షి పాత్రలు కథకు బలాన్ని, ఎమోషన్స్ అందిస్తాయి. మ్యాథమెటిక్ స్టూడెంట్‌గా మీనాక్షి కథను ముందుకు తీసుకుపోయే పాత్రలో మెప్పించారు. మృణాళిని భావోద్వేగమైన ప్రేమకథలో భాగమయ్యారు. ఇక శ్రీనిధి శెట్టి పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. వారి పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. జాన్ విజయ్, ఆనంద్ రాజ్, ఇతర నటీనటులు సినిమాకు ప్లస్‌గా మారారు.

   సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  కోబ్రా సినిమా సాంకేతికంగా అద్బుతమైన అంశాలను కలబోసిన చిత్రం. గత కొద్దికాలంగా మ్యూజిక్ పరంగా ఆకట్టుకోలేకపోతున్న ఏఆర్ రెహ్మన్ ఈ చిత్రంతో చెలరేగిపోయాడు. రీరికార్డింగ్ సినిమాను రెహ్మాన్ మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. గ్రాఫిక్స్, ఎడిటింగ్, ఆర్ట్ తదితర అంశాలు సినిమాను మరింత రిచ్‌గా, ప్రతీ ఫ్రేమ్‌ను ఆకట్టుకొనేలా రూపుదిద్దాయి. ఉన్నత సాంకేతిక అంశాలు సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి.

  ఫైనల్‌గా ఎలా ఉందంటే?

  ఫైనల్‌గా ఎలా ఉందంటే?

  లవ్, ఎమోషన్స్, యాక్షన్, హై టెక్నికల్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్న చిత్రం కోబ్రా. విక్రమ్ నట విశ్వరూపం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. రోషన్ మ్యాథ్యూ, జాన్ విజయ్, శ్రీనిధి శెట్టి, ఇతర నటీనటుల యాక్టింగ్ ఆకట్టుకొనేలా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే.. కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే, కన్‌ఫ్యూజన్ డ్రామా సాధారణ ప్రేక్షకులకు కొంచెం అర్ధం కాని విధంగా ఉంటాయి. కాకపోతే సన్నివేశాల పరంగా ఉన్నత విలువలు ప్రేక్షకులను సంతృప్తి పరిచేలా ఉంటాయి. విక్రమ్ పెర్ఫార్మెన్స్, అజయ్ జ్ఞాన‌ముత్తు టాలెంట్, మేకింగ్ కోసం వన్ టైమ్ వాచ్. కోబ్రా థియేట్రికల్ మంచి కంటెంట్, థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. మంచి అనుభూతిని అందిస్తుంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  విక్రమ్ పెర్ఫార్మెన్స్
  ఎమోషనల్ కథ
  సాంకేతిక విలువలు
  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మైనస్ పాయింట్స్
  కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే
  కన్‌ఫ్యూజన్ డ్రామా
  సినిమా నిడివి (3 గంటల 3 నిమిషాలు)

  కోబ్రాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  కోబ్రాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మ్యాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు
  రచన, దర్శకత్వం: ఆర్ అజయ్ జ్ఞాన‌ముత్తు
  నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్
  బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
  డిస్ట్రిబ్యూషన్: ఎన్వీఆర్ సినిమా (ఎన్వీ ప్రసాద్)
  మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
  డీవోపీ: హరీష్ కన్నన్
  ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
  పీఆర్వో: వంశీ శేఖర్
  రిలీజ్ డేట్: 2022-08-31

  English summary
  Vikram's Cobra movie has arrived in theatres on August 31st. Here is the Filmibeat Telugu's exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X