Cocktail 2 Movie Review: కాక్ టెయిల్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్, సంజయ్ దత్
దర్శకత్వం: హోమీ అదాజానియా
నిర్మాతలు: దినేష్ జైన్, లవ్ రంజన్, ప్రతిమా ఆర్ విజన్, అంకుర్ గార్గ్
కథ: లవ్ రంజన్
సహ నిర్మాతలు: శారద కర్కి జలోటా, పూజా ప్రేమ్ పాతీజా
మ్యూజిక్: ప్రీతమ్
ఎడిటర్: అక్షర ప్రభాకర్
సినిమాటోగ్రఫి: సంతాన కృష్ణన్ రవిచంద్రన్
లిరిక్స్: అమితాబ్ భట్టాచార్య
ప్రొడక్షన్ డిజైన్: అరవింద్ అశోక్ కుమార్, బిందియా ఛాబ్రియా
రిలీజ్ డేట్: 2026-06-19

కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ఇద్దరు రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉంటూ డేటింగ్ చేస్తుంటారు. యాలీ (కృతిసనన్), దియా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. కునాల్, దియా ఫారిన్‌లో వెకేషన్‌కు వెళ్లిన సమయంలో యాలీతో కునాల్‌కు పరిచయం ఏర్పడుతుంది. అయితే కునాల్‌పై యాలీ క్రష్ పెంచుకోవడమే కాకుండా ఓ సమయంలో అతడితో శారీరకంగా కలుస్తారు. ఈ క్రమంలో కునాల్, దియా పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయినా కునాల్‌పై పీకల్లోతు ప్రేమలో మునిగిపోతుంది. కునాల్‌పై ఉన్న ప్రేమ విషయాన్ని, తమ మధ్య ఉన్న బంధాన్ని దియాతో పెళ్లికి ముందు తెలియజేస్తుంది.

Also Read
Maa Inti Bangaaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Maa Inti Bangaaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

కునాల్, దియా మధ్య బంధం ఎలాంటిది? వారిద్దరి రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఏ రేంజ్‌లో ఉంది? కునాల్, దియా మధ్యకు యాలీ ఎలా వచ్చింది? దియాతో డేటింగ్ చేస్తున్నప్పటికీ.. యాలీ ఎలా దగ్గరైంది. తన క్లోజ్ ఫ్రెండ్ దియా బాయ్‌ఫ్రెండ్‌తో యాలీ ఎలాంటి పరిస్థితుల్లో ఫిజికల్ రిలేషన్ పెట్టుకొన్నది? పెళ్లి దగ్గర పడుతున్న కొద్ది కునాల్‌పై ప్రేమను యాలీ ఎలా పెంచుకొన్నది? కునాల్‌పై లవ్‌, రిలేషన్ గురించి దియాకు యాలీ చెప్పిన తర్వాత ఏం జరిగింది. కునాల్‌తో మ్యారేజ్ బ్రేక్ చేస్తానని యాలీ చెబితే దియా రియాక్షన్ ఏమిటి? చివరకు కునాల్‌ ఎవరినీ పెళ్లి చేసుకొన్నాడు? అనే ఫ్రశ్నలకు సమాధానమే కాక్ టెయిల్ 2 సినిమా కథ.

Cocktail 2 Hindi Movie Review

కాక్ టెయిల్ 2 సినిమా కథ విషయానికి వస్తే.. కొత్తగానీ, లేదా ఎక్స్రార్డినరీ కథ ఏమీ ఉండదు. పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే యువతి, యువకుడి మధ్య లవ్.. ఆ ప్రేమలోకి మరో యువతి రావడమనేది వందల సినిమాలు చూసి ఉంటాం. కానీ ఈ సినిమా బ్యాక్ డ్రాప్, లేటేస్ట్ జనరేషన్ రిలేషన్‌షిప్ వ్యవహరాలు, పెళ్లికి ముందే శారీరక సుఖాలు అనుభవించడం, పార్టీలు, విహారయాత్రలు లాంటి అంశాలతో సినిమా ట్రెండీగా సాగిపోతుంటుంది. కలర్ సీన్లు, ఎమోషనల్ డైలాగ్స్, చిలిపి సరదాలతో సీన్లు పరుగులు పెడుతుంటాయి. ఫస్టాఫ్ అంతా జాలీగా, లవ్లీగా ఉంటుంది. సెకండాఫ్‌లో పెళ్లి ఎపిసోడ్ నుంచి కథంతా ఎమోషనల్‌గా సాగుతుంది. కథలో ఆసక్తికరమైన డ్రామా కనిపిస్తుంది. ఈ సినిమాను హైలీ లగ్జరీ ఎన్విరాన్‌మెంట్‌లో ఐ ఫీస్ట్‌గా సినిమాను అందించడంలో దర్శకుడు హోమీ అదాజానియా సఫలమయ్యారు.

Recommended For You
Transfer Trimurthulu Movie Review: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Transfer Trimurthulu Movie Review: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఈ సినిమాలో కునాల్‌గా షాహీద్ కపూర్, దియగా రష్మిక మందన్న, యాలీగా కృతిసనన్.. పాత్రల్లో నటించారనే కంటే జీవించారనే చెప్పాలి. ఫుల్లుగా రొమాన్స్, లిప్‌లాక్స్, హాగ్స్, త్రీ సమ్ మూమెంట్స్‌తో లేటేస్ జనరేషన్ లైఫ్ స్టైల్‌ను తెరపైన చూపించారు. తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఎక్కువగా ఈ మూడు పాత్రల మధ్యనే సన్నివేశాలు కనిపిస్తాయి. మరో పాత్ర వీరి మధ్య వచ్చినట్టు కనిపించదు.

You May Also Like
Deewana Movie Review: దీవానా తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Deewana Movie Review: దీవానా తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

కాక్ టెయిల్ 2 సినిమాలో సాంకేతిక విషయాల వివరాల్లోకి వెళితే.. కథ తక్కువ.. టెక్నికల్‌గా చాలా రిచ్‌గా ఉంటుంది. ఆర్ట్ వర్క్, అందమైన లొకేషన్లు, రిచ్ లైఫ్, కలర్ కాంబినేషన్స్ అంతా సినిమాను కన్నులకు పండుగగా మార్చేశాయి. ఈ సినిమాకు సంతానకృష్ణన్ రవిచంద్రన్ తన విజువల్ బ్యూటీతో కేక పెట్టించారు. ప్రీతమ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రెండీగా ఉన్నాయి. అక్షర ప్రభాకర్ ఎడిటింగ్ చక్కగా ఉంది. దినేష్ జైన్, లవ్ రంజన్, ప్రతిమా ఆర్ విజన్, అంకుర్ గార్గ్ అనుసరించిన నిర్మాణ విలువు హై క్లాస్‌గా ఉన్నాయి. కథ పెద్దగా లేకుండా కథనంపై ఆధార పడిన సినిమా. ముగ్గురు వ్యక్తుల లవ్ జర్నీని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. సాఫీగా సాగిపోయే సన్నివేశాలే తప్పా కథలో పెద్దగా జర్క్ కనిపించదు. సింగిల్ పాయింట్ మీద కథను నడిపించడం వల్ల కొన్నిసార్లు బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ట్రావెల్ బేస్డ్, లేటేస్ట్ జనరేషన్ రిలేషన్‌షిప్స్ ప్రతిబింబించే సినిమా కథలను ఇష్టపడే వారికి, రొమాంటిక్స్ సెన్స్, విజువల్ బ్యూటీని ఎంజాయ్ చేయాలనుకొనే వారికి ఈ సినిమా తెగ నచ్చుతుంది. ఈ వారం ఓసారి వీలైతే ఈ సినిమాపై లుక్ వేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X