Cocktail 2 Movie First Review: కాక్‌టెయిల్ 2 మూవీ ఫస్ట్ రివ్యూ

బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ నటించిన తాజా చిత్రం కాక్ టెయిల్ 2. టాప్ హీరో సంజయ్ దత్ అతిథి పాత్రలో కనిపించే ఈ చిత్రానికి హోమీ అదాజానియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దినేష్ జైన్, లవ్ రంజన్, ప్రతిమా ఆర్ విజన్, అంకుర్ గార్గ్ నిర్మించారు. ఈ చిత్రానికి లవ్ రంజన్ కథను అందించగా, శారద కర్కి జలోటా, పూజా ప్రేమ్ పాతీజా సహ నిర్మాతలుగా వ్యవహరించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: ప్రీతమ్, ఎడిటర్: అక్షర ప్రభాకర్, సినిమాటోగ్రఫి: సంతాన కృష్ణన్ రవిచంద్రన్, లిరిక్స్: అమితాబ్ భట్టాచార్య, ప్రొడక్షన్ డిజైన్: అరవింద్ అశోక్ కుమార్, బిందియా ఛాబ్రియా తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) వీక్షించారు. ఈ చిత్రానికి లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? ఈ సినిమాపై వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Cocktail 2  Review by Censor Board

కాక్ టెయిల్ 2 సినిమా కథ విషయానికి వస్తే.. కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ఇద్దరు రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. వారిద్దరూ డేటింగ్, వెకేషన్స్‌తో లైఫ్‌ను జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. అలా లైఫ్‌ను లీడ్ చేస్తున్న ఇద్దరి జీవితంలోకి దియా పాత స్నేహితురాలు యాలీ (కృతి సనన్) వస్తుంది. ముగ్గురు ఫ్రెండ్ బాండింగ్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెడుతారు. కానీ ఎప్పుడైతే కృనాల్‌పై యాలీ కోరికను పెంచుకోవడంతో వారి జీవితం గందరగోళంగా మారుతుంది. దాంతో ముగ్గురు కలిసి జీవించాలనే ప్రపోజల్ వారి మధ్య వస్తుంది.

కునాల్‌తో యాలీ ఫ్రెండ్‌షిప్ ప్రేమగా మారడం, కునాల్‌తో దియా ప్రేమ ఫ్రెండ్‌షిప్‌గా మారడం లాంటి సంఘటనలు చోటు చేసుకొంటాయి. అయితే దియాతో ప్రేమలో ఉన్న కునాల్.. యాలీ ప్రపొజల్‌ను యాక్సెప్ట్ చేశాడా? ముగ్గురు కలిసి లైఫ్‌ను ఎలా ఎంజాయ్ చేశారు? ఈ ముగ్గురి జీవితంలో ఏర్పడిన సమస్యలు ఏమిటి? దియా, యాలీ మధ్య కునాల్ ఎలా నలిగిపోయాడు? దియా ప్రేమను అంగీకరించాడా? యాలీ లవ్ ప్రపోజల్‌ను అంగీకరించాడా? అనేది ఈ సినిమా ముగింపు కథ.

ఫుల్ రొమాంటిక్, అడల్ట్ కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు అధికారులు పలు అభ్యంతరాలు తెలిపారు. చాలా సన్నివేశాలు, డైలాగ్స్‌ను తొలగించాలని పట్టుబట్టారు. కొన్ని సీన్లకు మార్పులు, చేర్పులు చేపట్టాలని సూచించారు. పలు సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొన్న చిత్ర యూనిట్.. కొంత మేరకు మార్పులు చేర్పులు చేపట్టారు. కానీ కంటెంట్, థీమ్ దెబ్బ తినే ప్రమాదం ఉందనే కారణంతో సెన్సార్ సూచనలపై వివరణ ఇచ్చారు. కొన్ని సీన్లను, డైలాగ్స్‌ను మార్చడం కుదరదని చెప్పడంతో ఈ సినిమాకు ఏ (A) సర్టిఫికెట్‌తో రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కాక్‌టెయిల్ 2 సినిమా సర్టిఫికెట్ ప్రకారం.. ఈ చిత్రానికి A సర్టిఫికెట్ లభించడంతో ఈ చిత్రాన్ని 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే చూడాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రులు పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది. ఇక చిన్న పిల్లలు, 13 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు ఈ చిత్రాన్ని చూడటానికి అనుమతి లేదు అని స్పష్టం చేశారు. ఈ సినిమా నిడివిని సుమారుగా 2 గంటల 30 నిమిషాలు అంటే .. 150 నిమిషాలకు ఫిక్స్ చేశారు.

కాక్‌టెయిల్ 2 సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. శృంగార భరితమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో ఎమోషన్స్‌తో కాస్మోపాలిటన్ కల్చర్‌ బ్యాక్ డ్రాప్‌లో సాగే లవ్, రొమాంటిక్ మూవీ. షాహిద్, రష్మిక, కృతి సనన్ రొమాన్స్ సన్నివేశాల్లో పోటీ పడి నటించారనే విషయం ప్రోమోలలో తేలిపోయింది. ఎమోషనల్ సీన్లను బాగా పండించారు. పాత్రల మధ్య మానసిక సంఘర్షణను దర్శకుడు హోమీ తెరపైకి తీసుకొచ్చే విషయంలో ఆయన ప్రయత్నం బాగుంది అనే టాక్, ఫీడ్ బ్యాక్ వినిపిస్తున్నది. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, బాక్సాఫీస్ నంబర్ల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X