twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కో కో కోకిల’ మూవీ రివ్యూ, రేటింగ్

    By Bojja Kumar
    |

    Recommended Video

    CoCo Kokila Movie Review కో కో కోకిల సినిమా రివ్యూ

    Rating:
    3.0/5

    ఓ వైపు గ్లామర్ తారగా తన సత్తాచాటుతూనే పెర్పార్మెన్స్ ఓరియెంటెడ్ స్క్రిప్టులు, ప్రయోగాత్మక చిత్రాలు ఎంచుకుంటూ సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నయనతార నటించిన తాజా చిత్రం 'కో కో కోకిల'. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కొలమావు కోకిల' చిత్రాన్ని తెలుగులో డబ్ చేశారు. తమిళనాట కోట్లు కోట్లు వసూలు చేస్తూ తెలుగువారిని ఊరిస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? అంతగా మెప్పించిన అంశాలు ఏమున్నాయో? ఓ లుక్కేద్దాం.

    కథ విషయానికొస్తే...

    కథ విషయానికొస్తే...

    కోకిల(నయనతార) అనే ఒక సాధారణ మధ్యతరగతి యువతి చుట్టూ కథ తిరుగుతుంది. లంగ్ క్యాన్సర్ బారిన పడిన తల్లి(శరణ్య పొన్వన్నన్)ని కాపాడుకోవడానికి రూ. 15 లక్షలు అవసరం పడటంతో అన్నివిధాలా ప్రయత్నించి విఫలం అవుతుంది. బంధువుల నుండి, స్వచ్ఛంద సంస్థల నుండి మొండి చేయి ఎదురు కావడంతో అనుకోని పరిస్థితుల్లో కొనైన్ స్మగ్లింగ్ చేసే డ్రగ్స్ ముఠా కార్యకలాపాల్లో చిక్కుకుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మను కాపాడుకోవడానికి స్మంగ్లింగ్ మొదలు పెట్టిన కోకిల.... చివరకు డ్రగ్స్ ముఠాలకు టార్గెట్ అవుతుంది. ఆమెతో పని చేయించుకుని ఆమె కుటుంబాన్నే లేపేయడానికి ప్లాన్ చేస్తారు. ఆ పరిస్థితుల నుండి కోకిల ఎలా తప్పించుకుంది? ఆ చీకటి వ్యాపారం నుండి ఎలా బయటపడింది? అనేది తర్వాతి కథ.

    నయనతార పెర్ఫార్మెన్స్ సూపర్

    నయనతార పెర్ఫార్మెన్స్ సూపర్

    కోకిల పాత్రలో నయనతార పెర్పార్మెన్స్ అదరగొట్టింది. అమాయకమైన ఇన్నోసెంట్ గర్ల్ పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులు ముద్దులైపోతారు. హీరోల మాదిరిగా భారీ ఫైట్స్ ఉండవు కానీ తన అమాయకత్వంతోనే విలన్లు లేపేయడం ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. అదే సమయంలో అమ్మ, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె పడే బాధ చూసి ప్రేక్షకులు సైతం కరిగిపోయే స్థాయిలో జీవించింది.

    ఇతర నటీనటులు

    ఇతర నటీనటులు

    నయనతార తర్వాత సినిమాలో బాగా హైలెట్ అయిన పాత్రలో ఆమె తల్లి పాత్ర పోషించిన శరణ్య పొన్వన్నన్. తనదైన పెర్ఫార్మెన్స్‌తో ఆమె ప్రేక్షకులకు మరింత వినోదం పంచింది. కోకిలను ప్రేమించే పాత్రలో కమెడియన్ యోగిబాబు నవ్వులు పూయించాడు. విజయ్ టీవీ జాక్వెలిన్, రాజేంద్రన్, ఆర్ఎస్ శివాజీ, అన్భుతాసన్ వారి వారి పెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు.

    టెక్నికల్ అంశాల పరంగా...

    టెక్నికల్ అంశాల పరంగా...

    అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలోని కొన్ని సీన్లను మరింత హైలెట్ చేసింది. ముఖ్యంగా యోగిబాబు మీద వచ్చే సాంగ్ ఆకట్టుకుంటుంది. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మల్ ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ బావున్నాయి. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణ విలవల్లో ఏ లోటూ కనిపించలేదు.

     దర్శకుడి పని తీరు

    దర్శకుడి పని తీరు

    నెల్సన్ దిలీప్ కుమార్ ఈ కథను స్వయంగా తానే రాసి దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ వర్క్ ఆకట్టుకునే విధంగా ఉంది. స్క్రీప్లే ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీలవ్వకుండా పక్కాగా ఉంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెంచే విధంగా ఉన్నాయి. నయనతార క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు బావుంది.

     సరికొత్తగా ఉంది.

    సరికొత్తగా ఉంది.

    డ్రగ్స్ స్మగ్లింగ్ కథ చూడటానికి సాధారణంగా ఉన్నా.... దర్శకుడు ప్రేక్షకులకు వినోదం పంచడంలో సరికొత్త పంతాను ఎంచుకున్నాడు. చంపే సీన్లలో కూడా కామెడీ పుట్టించాడంటే దర్శకుడి టాలెంట్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కంటెంటులో దమ్ముంటే ప్రేక్షకులను మెప్పించవచ్చని నిరూపించాడు. అనవసరమైన పాత్రలకు చోటు లేకుండా ఉన్న కొద్దిపాటి పాత్రలతోనే అద్భుతంగా సినిమాను నడిపించాడు.

     ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    నయనతార పెర్ఫార్మెన్స్
    కథ, కథనం
    అనిరుధ్ సంగీతం
    యోగిబాబు కామెడీ

    మైనస్ పాయింట్స్

    ఫస్టాఫ్‌లో అక్కడక్కడ కాస్త సాగినట్లుండే సీన్లు

    చివరగా

    చివరగా

    రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా మంచి వినోదం పంచే సినిమా ‘కో కో కోకిల'. ఊహించని ట్విస్టులు, మంచి హాస్యం మిమ్మల్ని బాగా నవ్విస్తాయి. నయనతార పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని మెప్పిస్తుంది.

    కో కో కోకిల

    కో కో కోకిల

    నటీనటులు: నయనతార, యోగి బాబు, శరణ్య పొన్వన్నన్, శరవణన్, రాజేంద్రన్
    దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
    సంగీతం: అనిరుధ్ రవిచందర్
    నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్
    విడుదల తేదీ: ఆగస్టు 31, 2018

    English summary
    Tamil Film Kolamaavu Kokila dubbed as CoCo Kokila in Telugu. The film narrates the story of a girl named Kokila, who hails from a middle class family. She leads a peaceful life with her family but things turn turtle when she gets to know that her mother is suffering from Cancer. This forces Kokila to take up a risky job of drug peddling. What happens rest has been narrated in CoCo Kokila.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X