For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Cold Case Movie Review: ఆసక్తికరంగా పృథ్వీరాజ్ సుకుమారన్ మర్డర్ మిస్టరీ!

  |

  Rating:
  2.5/5
  Star Cast: పృథ్వీరాజ్ సుకుమారన్, అదితి బాలన్, లక్ష్మీ ప్రియ చంద్రమౌలి, సుచిత్రా పిళ్లై ఆత్మీయ రాజన్
  Director: తను బాలక్

  మలయాళ చిత్ర పరిశ్రమలో లూసిఫర్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి చిత్రాలతో విలక్షణమైన నటనను ప్రదర్శిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్, అలాగే సంచలన విజయం సాధించిన అరువి చిత్రంలో విశేషమైన యాక్టింగ్ ప్రతిభను చాటుకొన్న అదితి బాలన్ నటించిన మర్డర్ మిస్టరీ కోల్డ్ కేసు చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకొందాం...

  క్రైమ్ స్టోరీలతో భారీ రేటింగ్‌ను సాధించే టెలివిజన్ జర్నలిస్టు మేథా పద్మజా (అదితి బాలన్) వైవాహిక సమస్యలతో భర్తతో విడాకులకు దరఖాస్తు చేసుకొంటుంది. ఈ క్రమంలో ఐదేళ్ల చిన్నారితో ఓ పాత ఇంటిలో అద్దెకు దిగుతుంది. ఆ ఇంటిలో తనను ఏదో ఆత్మలు వెంటాడుతున్నట్టు ఓ ఫీలింగ్‌కు లోనవుతుంది. అలాంటి పరిస్థితుల్లో తాను ఉండే ప్రాంతంలోని ఓ చెరువులో ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసిన పుర్రె జాలరికి లభించడంతో ఆ విషయం మీడియాలో సంచలనంగా మారుతుంది. ఆ కేసును విచారించడానికి ఏసీపీ సత్యజిత్ (పృథ్వీరాజ్ సుకుమారన్) రంగంలోకి దిగుతాడు. పుర్రె కేసును విచారిస్తున్న క్రమంలో అది ఇవా మారియా (ఆత్మీయ రాజన్) అనే మహిళదనే విషయం తెలుస్తుంది.

   Cold Case Movie Review: Prithviraj Sukumarans subtle performance steal the show

  పుర్రె కేసు విచారణను ఏసీపీ సత్యజిత్ ఎలా కొనసాగించాడు? ఇవా మారియా హత్య వెనుక ఎవరి హస్తం ఉంది? కేసులో వాస్తవాలను బయట పెట్టడానికి ఎలాంటి పంథాను అనుసరించాడు? జర్నలిస్టు మేథా ఇంటిలో ఆత్మల వ్యవహారం ఈ కేసుకు సంబంధం ఉందా? ఇవా మారియా నిజంగానే చనిపోయిందా? ఇవా మారియా మర్డర్ మిస్టరీని సత్యజిత్, మేథా ఎలా ఛేదించారు అనే ప్రశ్నలకు సమాధానమే కోల్డ్ కేస్ సినిమా కథ.

  కోల్డ్ కేసు సినిమా కథ, కథనాల విషయానికి వస్తే.. ఎలాంటి ఆర్బాటాలు, హంగామా లేకుండా సాదాసీదాగా పృథ్వీరాజ్ సుకుమారన్ విచారణ మొదలవుతుంది. పలు రకాల కోణాల్లో దర్యాప్తు సాగడం సినిమాపై ఆసక్తిని రేపుతాయి. అదే సమయంలో జర్నలిస్టు ఇంటిలో జరిగే కొన్ని సంఘటనలు కథలో లీనమయ్యేలా చేస్తాయి. తొలి భాగంలో విచారణ, మేథాకు ఎదురయ్యే సమస్యలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి.

  ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. సినిమా కథనం రొటీన్‌గా మారడం, వేగం లోపించడంతో ఈ కేసు విచారణ కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్తుందా అనే సందేహాలు తలెత్తుతాయి. కానీ చివరి గంటలో కథను దర్శకుడు తను బాలక్ డీల్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. ఇవా మారియా హత్యకు కారణం ఎవరనే విషయాన్ని చివరి నిమిషం వరకు వెల్లడించకుండా సస్పెన్స్ కొనసాగించడం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది.

  పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ విషయానికి వస్తే.. పోలీసు క్యారెక్టర్ల విషయంలో తెలుగు నేటివిటికి భిన్నంగా సాగుతుంది. ఎలాంటి బిల్డప్ షాట్స్, హీరోయిజం ఎక్కడా కనిపించకుండా ఓ ఇంటెలిజెంట్ ఆఫీసర్‌గానే ఆయన కనిపిస్తారు. ఫస్టాఫ్‌లో పృథ్వీరాజ్ క్యారక్టర్ లో ప్రొఫైల్‌లో ఉన్నా.. సెకండాఫ్‌లో కథతోపాటు టాప్ రేంజ్‌లో కనిపిస్తుంది. సున్నితమైన హావభావాలతో పృథ్వీరాజ్ ఆకట్టుకొంటారు.

  ఇక జర్నలిస్టు మేథగా అదితి బాలన్ నటనపరంగా మంచి ప్రదర్శనను ఇచ్చారు. సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తారు. ఓ చిన్నారికి తల్లిగా, భర్త నుంచి విడాకులు కోరే మహిళగా, తాను పనిచేసే టెలివిజన్ ఛానెల్‌లో టాప్ జర్నలిస్టుగా కొన్ని సన్నివేశాల్లో అదితి అదరగొట్టిందని చెప్పవచ్చు. ఇక ఆత్మలను శోధించే మంత్రగత్తె లాంటి పాత్రలో సీనియర్ నటి సుచిత్రా పిళ్లై ఆకట్టుకొంటారు. ఇవా మారియా పాత్ర నిడివి తక్కువైనా ఆత్మీయ రాజన్ గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగాను మెప్పిస్తారు. సీఐ జియాద్‌గా అనిల్ నెడుమంగద్, మిగితా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

  సాంకేతిక విషయాల్లోకి వెళితే.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి బాగుంది. కేరళ అందాలను తన కెమెరాలో అద్బుతంగా ఒడిసి పట్టుకొన్నారు. షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ విషయంలో కొంత అసంతృప్తి కలుగుతుంది. సినిమాను ఇంకా వేగం చేయడానికి పలు చోట్ల కత్తెర గాట్లు పడాల్సిందే అని ఫీలింగ్ కలుగుతుంది. జామన్ టీ జాన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ తను బాలక్ తన తొలి ప్రయత్నంలో మంచి మార్కులు సంపాదించుకొన్నారు.

  ఫైనల్‌గా కోల్డ్ కేసు సినిమా విషయానికి వస్తే.. సున్నితమైన పాయింట్‌ సెన్సిబుల్‌గా డీల్ చేసిన చిత్రంగా చెప్పుకోవచ్చు. థియేటర్‌లో రిలీజ్ అయితే మంచి థ్రిల్లింగ్ ఉండేది. సీటు అంచున టెన్షన్‌గా చూసే అంశాలు ఈ సినిమాకు హైలెట్. ఫృథ్వీరాజ్ సుకుమారన్, అదితి బాలన్ నటన సినిమాను మరో రేంజ్‌కు చేర్చిందని చెప్పవచ్చు. కథలో వేగం లేకపోవడం, హీరో క్యారెక్టర్‌కు సంబంధించి బిల్డప్ షాట్స్ లేకపోవడం తెలుగు ప్రేక్షకులకు నిరాశను కలిగించే విషయంగా అనిపిస్తుంది. అయితే మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా సాగే చిత్రాలను ఇష్టపడే వారికి కోల్డ్ కేసు తప్పక నచ్చుతుంది.

  పంచ్‌లైన్: స్లో అండ్ స్టడీగా దృశ్యం 3

  Recommended Video

  Celebrities With Bizarre Habits సెలెబ్రిటి ల ఆసక్తికరమైన అలవాట్లు

  నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, అదితి బాలన్, లక్ష్మీ ప్రియ చంద్రమౌలి, సుచిత్రా పిళ్లై, ఆత్మీయ రాజన్ తదితరులు
  దర్శకత్వం: తను బాలక్
  నిర్మాత: జామన్ టీ జాన్
  సినిమాటోగ్రఫి: గిరీష్ గంగాధరన్
  ఎడిటింగ్: షమీర్ మహమ్మద్
  ఆర్ట్: స్టెఫీ జేవియర్
  ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
  ఒటీటీ రిలీజ్ డేట్: 2021-30-06

  English summary
  Cold Case Movie Review: Prithviraj Sukumaran's subtle performance steal the show. This movie released on Amazon prime video on June 30th, 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X