twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కా'లేజీ' లవ్‌ స్టోరీ

    By Staff
    |

    College
    చిత్రం: కాలేజ్
    నటీనటులు: శివాజీ, మాన్య, సదానంద్‌ తదితరులు
    సంగీతం: శశీప్రీతం
    నిర్మాత: తరంగ సుబ్రమణ్యం
    కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వం: రవి చావలి

    ఫార్ములాను పట్టుకొని పాకులాడడం తెలుగు సినిమా నిర్మాతల కెరీర్‌ పుట్టుకతో పెట్టిన విద్య. బ్యాచ్‌ లర్స్‌ చిత్రం హిట్టవడంతో అలాంటి సినిమాలు నిర్మించేందుకు అనేకమంది నిర్మాతలు సిద్ధమయ్యారు. ఆ కోవలో వచ్చిన తొలి చిత్రం కాలేజ్‌. ఇంకా ఇలాంటి సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ కాలేజ్‌ చిత్రం కూడా బ్యాచ్‌ లర్స్‌ చిత్రంలాగా ఫన్‌ తో కూడిన చిత్రం. ఓ సింగిల్‌ పాయింట్‌ తో సినిమా అంతా అల్లరి చిల్లరగా నడుస్తుంది.

    గంతులు, గోడదూకడాలు, నడుము మీద మచ్చ కోసం వెతుకులాట, 36 సైజ్‌ బ్రా కోసం హీరో బృందం పడే అగచాట్లతో ఆద్యంతం హాస్య(?)భరితంగా సాగుతుంది. ఇందులో కొత్త పాయింట్‌ ఏముందయ్యా అంటే... కొత్తదనం ఎవడికి కావాలండి? ఇప్పటి ట్రెండ్‌ ప్రకారం ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అన్నదే ముఖ్యం. సో ఈ కొలమానం ప్రకారం చూస్తే యూత్‌ కు విపరీతంగా నచ్చే సినిమా. కాస్త పరిణతి ఉన్న వాళ్ళకు మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది.

    సినిమా కథ చాలా సింపుల్‌. ఓ కాలేజ్‌. పేరు ఎందుకులెండి. అక్కడి కుర్రాళ్ళ గ్యాంగ్‌ కు శివాజీ నాయకత్వం వహిస్తాడు. అమ్మాయిల టీంకు మన్య లీడర్‌. వీరందరూ ప్రేమించుకోవడం, కలలు కనడం....చేస్తూ బికాం చదువుతుంటారు- కామ్‌ గా మాత్రం కాదు. శివాజీకి ప్రేమ మీద నమ్మకం ఉండదు. సిన్సియర్‌ కుర్రాడు(హీరో కదా).

    ఇలాంటి అబ్బాయికి ఓ అజ్ఞాత ప్రేమికురాలు ప్రేమలేఖ రాస్తుంది. ఈ వెన్నెల్లో ఆడపిల్ల కోసం హీరోగారి టీం ఇక ప్రయత్నాలు మొదలు పెడుతుంది. పాటలు పాడుకుంటూ, గోడలు దూకుతూ, అమ్మాయిల బ్రాలు పట్టుకొని తిరుగుతూ.... సినిమా ముగుస్తుందనుకునే సమయానికి ఆ అమ్మాయి ఎవరో కనుక్కుంటారు. శివాజీ వెళ్ళి ఆ అమ్మాయికి ఐ లవ్‌ యూ అని చెప్పేందుకు సిద్ధమవుతాడు. కానీ నిజానికి ఆ ప్రేమలేఖ పంపింది వేరే ఆ అమ్మాయని తెలుస్తుంది. ఎవరా ఆ అమ్మాయి. అదే క్లైమాక్స్‌.

    ఈ చిత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవలిసింది ఏమైనా ఉందంటే అది క్లైమాక్స్‌. జాలీగా సినిమాను నడిపించి క్లైమాక్స్‌ లో చిన్న ట్విస్ట్‌ ఇవ్వడం బావుంది. దర్శకుడు రవిచావలి గురించి చెప్పుకోవలిసింది ఏమీ లేదు. గొప్ప డైరక్షన్‌ ఐతే కాదు. ఫర్వాలేదు. శివాజీ, మాన్యలు నటించే సీన్‌ లు లేవు కాబట్టి బాగానే ఎగిరారని చెప్పొచ్చు. శశీప్రీతం సంగీతం బావుంది. క్యాచీ పాటలు ఈ సినిమాకు ఎస్సెట్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X