twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుడ్డెట్టలేదు... ('బంగారు కోడి పెట్ట' రివ్యూ)

    By Srikanya
    |

    జోశ్యుల సూర్యప్రకాశ్

    Rating:
    2.0/5
    ఆకట్టుకునే టైటిల్, డిఫెరెంట్ స్క్రీన్ ప్లే, క్రైమ్ కామెడీ జనర్ ఫిల్మ్,కలర్స్ స్వాతి కలరింగ్ ఇలా ప్యాకేజి అంతా బాగానే ఉంది...కానీ అవన్నీ కలవాల్సిన రీతిలో మిక్స్ అయితేనే కిక్. కానీ అదే ఈ సినిమాలో మిస్సైంది. సినిమా ఆద్యంతం స్లో నేరషన్ తో కిక్ లేకుండా సా..గ..టంతో ఇబ్బందిగా మారింది. నవదీప్ తనను తాను మార్చుకుని, ఎప్పటికన్నా బాగా చేసాడు కానీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కేవలం ఎ సెంటర్లనే టార్గెట్ చేసినట్లున్న ఈ చిత్రం అక్కడి వారిని ఆకట్టుకునే అవకాసం ఉంది.

    మిడిల్ క్లాస్ అమ్మాయి భాను(కలర్స్ స్వాతి) ఓ రోబిరీ ప్లాన్ చేస్తుంది. తను పనిచేసే ఎనర్జీ డ్రింక్ కంపెనీ వారు లక్కీ డ్రా విజేతలకు పంపే బంగారు బిస్కట్స్,కాయిన్స్ ని తనతో పాటు పనిచేసే వంశీ(నవదీప్)తో కలిసి లేపేయాలనుకుంటుంది. అయితే అనుకున్నది అనుకున్నట్లు అయితే అది కథ ఎందుకవుతుంది... అనుకోని అవాంతరాలు వేరే సబ్ ప్లాట్స్ రూపంలో కనెక్టు అవుతాయి. చివరకు వారు దొంగతనం పూర్తి చేయగలిగారా అన్నది మిగతా కథ..కథనం.

    Colours Swathi's ‘Bangaru Kodipetta’ review

    ఇలాంటి హైపర్ లింక్ సినిమాలకు కథకన్నా కథనమే ప్రధానం. గతంలో ఇలాంటి నేరేషన్ తో Amores Perros (2000), Babel (2006), and మణిరత్నం యువ (2004) వచ్చాయి. ఓ సంఘటనతో మిగతా పాత్రలు,వాటి ప్లాట్స్ వచ్చి కలుస్తాయి. అక్కడనుంచి కథనం మారుతుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే లపై కసరత్తు ఎక్కువ చేయాలి. ముఖ్యంగా తెలుగుకి వచ్చేసరికి మన పరిమితులు, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సీన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. దర్శకుడు అవేమీ పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు చేసుకుంటూపోయారు. కానీ ఇలాంటి సినిమాలు అలవాటు పడ్డవారిని మాత్రం ఇది ఎంగేజ్ చేస్తుంది.

    ఇక హీరోగా నవదీప్ కొత్తగా ప్రయత్నించాడనే చెప్పాలి. చాలా ఫెరఫెక్ట్ గా పాత్రలో ఇమిడిపోయాడు. కలర్స్ స్వాతి ఎప్పటిలాగే రెగ్యులర్ గా చేసుకుంటూ పోయింది. ముఖ్యంగా వీళ్లందరికన్నా హర్షవర్ధన్ (గుండెజారి గల్లంతైంది రచయిత) నటుడుగా అదరకొట్టాడు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ విగ్రహం పుస్టి అన్నట్లు ఎక్సప్రెషన్స్ లేకుండా జీవించారు.

    టెక్నికల్ గా చెప్పాలంటే ఈ చిన్న బడ్జెట్ సినిమాకు రిచ్ లుక్ తెచ్చింది సినిమాటోగ్రఫీ మాత్రమే. సంగీతంలో ఏమోనేమో అనే పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సోసో గా ఉంది. దర్శకత్వం పరంగా కూడా చాలా వీక్ గా ఉంది. రచయితగా రాజ్ పిప్పళ్ల క్లైమాక్స్ లో మాత్రమే ప్రతిభ చూపించాడు.

    బ్యానర్: గురు ఫిలిమ్స్
    నటీనటులు: నవదీప్, స్వాతి రెడ్డి,సంతోష్, రామ్, లక్ష్మణ్, సంచాలన తదితరులు.
    మాటలు: ప్రసాద్‌ వర్మ పెన్మత్స,
    సంగీతం: మహేష్‌ శంకర్‌,
    పాటలు: అనంతశ్రీరామ్‌.
    సినిమాటోగ్రఫీ: సాహిర్,రజా
    ఎడిటర్ : చంద్రశేఖర్,ధర్మేంద్ర కాకరాల
    యాక్షన్ : రామ్,లక్ష్మణ్
    పాటలు: అనంత్ శ్రీరామ్
    పబ్లిసిటీ డిజైన్: అనిల్ భాను
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ దొంకాడ
    నిర్మాత: సునీత థాటే
    కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం : రాజ్ పిప్పళ్ళ
    విడుదల తేదీ: మార్చి 7,2014

    ఫైనల్ గా ఏదో రొటీన్ మసాలా సినిమా తీసి హిట్ కొట్టేద్దా అని కాకుండా కొత్తదనం చూపాలనే దర్శకుడు ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ప్రపంచ సినిమా చూసే ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాసం ఉంది. రాబడి పరం గానూ పెద్ద బడ్జెట్ కాదు కాబట్టి సేఫ్ గా ఎ సెంటర్లలో కలెక్షన్స్ రాబట్టుకునే అవకాసం ఉంది.

    English summary
    Navdeep, Swathi Reddy starrer film Bangaru Kodipetta finally released today with divide talk. The film has been directed by Raj Pippalla.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X