For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్చ్... ఇది రొటీన్ దెయ్యం ( ‘త్రిపుర’ రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5

  వారానికో దెయ్యం చొప్పున వంతులు వేసుకుని మరీ తెలుగు తెర మీదకు వచ్చి నవ్వించి, భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. దాంతో దెయ్యం అంటే ఇలాగే ఉంటుంది, దెయ్యం కథ అంటే ఈ విధంగానే సాగుతుంది, ఇక్కడ భయపెడతారు, ఇక్కడ నవ్విస్తారు అని స్క్రీన్ ప్లే ఊహించే స్దాయికి సగటు ప్రేక్షకులుకు చేరుకున్నాడు. దాంతో ఈ తరహా సినిమాలు తీసే దర్శక,నిర్మాతలకు కాస్త ఇబ్బంది కర పరిస్ధితే ఏర్పడింది. అలాగే ఈ తరహా కథలకు అలవాటు పడిన వారికి కొత్తదనం లేకపోతే కక్కు వచ్చే పరిస్దితి ఏర్పడింది. ముఖ్యంగా రొటీన్ దెయ్యం చేష్టలను అసలు భరించలేకపోతున్నారు.

  అది గమనించిన వాళ్లు పాత దెయ్యాలతోనే కొత్త కథలు అల్లి అలరిస్తున్నారు. కాని వాళ్లు ప్రేక్షకులకు సహన పరీక్షపెడుతున్నారు. ఈ మధ్యనే గీతాంజలి అంటూ దెయ్యం కథతో నవ్వించి భాక్సాఫీస్ ని గెలిచిన రాజ్ కిరణ్ అదే ఉత్సాహంతో మరో దెయ్యం కథ పట్టుకుని థియోటర్లోకి దూకేసారు. హీరోయిన్ మార్చి ఏమార్చే ప్రయత్నం చేసారు. కానీ కథలో ట్విస్ట్ లు సరైన టైమ్ కు పడకపోవటంతో , అక్కడక్కడా నవ్వించినా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. అక్కడికీ కలర్స్ స్వాతి ఉన్నంతలో ప్రయత్న లోపం లేకుండా కష్టపడింది కానీ అవి పెద్దగా పనికిరాలేదనే చెప్పాలి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  తింగరితనం, కాస్త గడుసుతనం కలిగిన పల్లెటూరి అమ్మాయి త్రిపుర(కలర్స్ స్వాతి) కి చిన్నప్పటినుంచి కొన్ని కలలు వస్తుంటాయి. అయితే ట్విస్ట్ ఏమిటంటే... ఆ కలలు ..కలలుగా మిగిలిపోకుండా... రియల్ లైఫ్‌లో నిజం అవుతుంటాయి. దాంతో ఆమెను డాక్టర్ చంద్ర(నవీన్ చంద్ర)దగ్గరకు తీసుకు వెళ్తారు.

  కలలు మాటేమో కానీ వీళ్లిద్దరూ ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటారు. దాంతో వారు సిటీలో కాపురం పెడతారు. అయితే ఇక్కడా ఆమె కలలు కంటిన్యూ అవుతాయి. ఆమె వైవాహిక జీవితం సజావుగా సాగదు. తన వైవాహిక జీవితానికి చనిపోయిన ఈశ(పూజ)కు సంభంధం ఉందని తెలుసుకుంది. అక్కడో ట్విస్ట్ రివీల్ అవుతుంది. చంద్రకు, ఈషకు మధ్య గతంలో లవ్ స్టోరీ ఉందనే విషయం రివీల్ అవుతుంది. మరో ప్రక్క తిలక్ (తిలక్) డాక్టర్ ఈష(పూజ రామచంద్రన్) కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూంటాడు. అసలు ఈ కలలు నిజం అవటం ఏమిటి...ఈశ మరణం వెనక ఉన్న రహస్యం ఏమిటి...దానికి చంద్రకు సంభందం ఏమిటి...అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  డైరక్టర్ రాజ్ కిరణ్.. తన తొలి చిత్రం గీతాంజలి కు భిన్నంగా చేయటానికే ప్రయత్నించాడనే చెప్పాలి. కామెడీతో పాటు డ్రామా, రొమాన్స్ ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేయాలని చూసాడు. అయితే సినిమా సీన్స్ లో కావాల్సిన సస్పెన్స్ మాత్రం మెయింటైన్ చేయలేకపోయాడు. అవుట్ డేటెడ్ నేరేషన్, స్క్రీన్ ప్లే సినిమాని ఇబ్బందికరంగా మార్చేసాయి. సినిమాలో ఏదైతే కీలకమైన ట్విస్ట్ ఉండి కథ మలుపు తిరుగుతుందో అది ఇంటర్వెల్ కూడా రాలేదు. దాంతో కథ చాలా సేపు ఏ ఎలిమెంటూ లేక ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేదాకా డ్రాగ్ అవుతూంటుంది.

  స్లైడ్ షో లో మిగతా రివ్యూ

  హైలెట్

  హైలెట్

  సినిమాలో క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అప్పటివరకూ చూసిన సినిమా ఓ ఎత్తు..ట్విస్ట్ ఓ ఎత్తు అన్నట్లు డిజైన్ చేసారు. నిజానికి ఈ ట్విస్ట్ ని నమ్మే సినిమా చేసినట్లు అనిపిస్తుంది.

  నో క్లారిటీ

  నో క్లారిటీ

  సినిమాలో మొదటి నుంచి చెప్తూ వచ్చిన హీరోయిన్ కి కలలు రావటం అనే కాన్సెప్టు కు మాత్రం పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అప్పటివరకూ ఏదో ఉందనుకుని ఇంట్రస్ట్ పే చేసిన ఎలిమెంట్ తేల్చకపోతే నిరాస కలిగిస్తుంది.

  కామెడీ మోజుతో

  కామెడీ మోజుతో

  గీతాంజలి పూర్తిగా కామెడీతో ఆడిన సినిమా కదా అని ఈ కథలో ఇమడకపోయినా కామెడీని తీసుకుని వచ్చి కలిపే ప్రయత్నం చేసారు. సప్రగిరి ఎపిసోడ్ పెద్దగా పేలలేదు.

  కలగలపు

  కలగలపు

  ఈ సినిమా స్టోరీ లైన్ మనకు ప్రేమ కధా చిత్రం, ఓవర్ హెర్ డెడ్ బాడీ, వైట్ డ్రీమ్స్ (2015), వెన్ డ్రీమ్స్ కమ్ ట్రూ, Dead of Night and Medium (2005), Premonition (2007) , వంటి చిత్రాలు గుర్తు చేస్తూ సాగుతుంది. రెగ్యులర్ గా ఈ తరహా సినిమాలు చూసేవారికి ఇవన్నీ గుర్తు వస్తాయి .

  టెక్నికల్ గా...

  టెక్నికల్ గా...

  సినిమాటోగ్రాఫర్ రవికుమార్ ..సినిమా కంటెంట్,మూడ్ కు తగినట్లు జాగ్రత్తగా షాట్స్ ప్లాన్ చేసి తీసాడు. కానీ ఎడిటింగ్ డిపార్టమెంట్ మాత్రం మరింత షార్పాగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిస్తుంది.

  డైలాగులు, డైరక్షన్

  డైలాగులు, డైరక్షన్

  సినిమాకు డైలాగులు పెద్దగా పనికిరాలేదు. దర్శకత్వం అంటే కెమెరా వర్క్ అన్నట్లు సాగింది. కానీ దర్సకుడు లీడ్ క్యారక్టర్స్ నుంచి ఫెరఫార్మెన్స్ మాత్రం బాగా రాబట్టుకున్నారు.

  సంగీతం, ఆర్ట్ డిపార్టమెంట్

  సంగీతం, ఆర్ట్ డిపార్టమెంట్

  ఈ సినిమాకు సంగీతం బాగామైనస్ అనే చెప్పాలి. ముఖ్యంగా అవసరం లేని పాటలు విసిగిస్తాయి. ఆర్ట్ డిపార్టమెంట్ , సిజీ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నీట్ గా రిచ్ గా ఉన్నాయి.

  ఎవరెవరు

  ఎవరెవరు

  బ్యానర్ : జీ మీడియా
  నటీనటులు: కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర, శ్రీమాన్, పూజ, సప్తగిరి, రావు రమేశ్, షకలక శంకర్, ధన్ రాజ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు
  స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ,
  మాటలు: రాజా,
  సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా,
  ఎడిటింగ్: ఉపేంద్ర,
  పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి,
  నిర్మాతలు: ఎ.చినబాబు, ఎమ్.రాజశేఖర్,
  కథ-దర్సకత్వం: రాజకిరణ్,
  సమర్పణ: జె.రామాంజనేయులు.​​​
  నిర్మాతలు : ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్
  విడుదల తేదీ : నవంబర్ 6, 2015.

  ఫైనల్ గా ఇది హర్రర్ కానీ హర్రర్ కామెడీ. ఫస్ట్ హాఫ్ ఉన్నట్లు సెకండాఫ్ కూడా ఉండి ఉంటే దర్శకుడు ఫస్ట్ చిత్రం గీతాంజలిలాగ ఖచ్చితంగా బాగా ఆకట్టుకుని ఉండేది. టైటిల్ లో ఉన్న పవర్, ట్రైలర్స్ ఉన్నంత కామెడీ సినిమాలో కూడా ఉండి ఉంటే మరింత బాగుండేది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  'Colors' Swathi's Tripura released today with average talk. Raj Kiran who directed Anjali’s Geethanjali is directed this movie. Kona Venkat and Veligonda Srinivas are providing the screenplay .
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X