Committee Kurrollu Review: కమిటీ కుర్రోళ్ళు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75

మూవీ: కమిటీ కుర్రోళ్ళు
నటీనటులు: సందీప్ సరోజ్, యస్వంత్ పెండ్యాల, త్రినాధ్ వర్మ, సాయికుమార్, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, రాధ్యా, తేజస్వీ రావు, టీనా శ్రావ్య.
దర్శకత్వం: యదు వంశీ
నిర్మాతలు: పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక
విడుదల: 2024-08-09

స్టోరీ:

వెస్ట్ గోదావరి జిల్లాలోని పురుషత్త పల్లి అనే పల్లెటూరిలో జరిగే యంగ్ అండ్ సీనియర్ ఏజ్ వ్యక్తుల మధ్య నడిచే పొలిటికల్ కథ అనమాట ఆ ఊర్లో ప్రతి యేటా జరిగే ఓ అమ్మవారి జాతరకి ఆ ఊర్లో ఉండే కొందరు స్నేహితులు సూర్య(యశ్వంత్ పెండ్యాల), విలియం (ఈశ్వర్ రాచి రాజు), సుబ్బు (త్రినాద్ వర్మ) ఇంకా కొన్ని పాత్రలు నరసింహా, శివ ల మూలాన ఒక అపశకునం ఎదురవుతుంది.

Committee Kurrollu Movie Review in Telugu  Niharika Konidela show her taste of Mark

కాగా దాని మూలన ఆ ఊరిలో అమ్మవారిని తీసుకెళ్లే సత్తయ్య (కిషోర్ కుమార్) జీవితంలో జరిగిన నష్టం ఏంటి? ఆ ఊర్లో ఎన్నో ఏళ్ళు నుంచి సర్పంచ్ గా సాగుతున్న బుజ్జి(సాయి కుమార్) కి యువకుడు శివ ఎందుకు ఎదురు తిరిగి సర్పంచ్ ఎన్నికలకి పోటీ చేస్తాడు. అసలు ఆ ఊర్లో ఈ గ్యాంగ్ చేసే రచ్చేంటి? వీరి మధ్యలో పెద్దోడు(యూట్యూబ్ ఫేమ్ ప్రసాద్ బెహరా) కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది? ఈ కుర్రోళ్ళు అంతా కలిసి కమిటీ కుర్రోళ్ళు ఎలా అయ్యారు? ఊర్లో ఆగిపోయిన జాతర కోసం ఏం చేశారు ఊర్లో ఎన్నికల కోసం చేసారు. వీటన్నిటి మధ్యలో కులాలపై ఇచ్చిన సందేశం లాంటివి ఏంటి అనేవే ఈ సినిమా కథ.

విశ్లేషణ:

ఈ సినిమాకి మెగా వారసురాలు నిహారిక కొణిదెల బ్రాండ్ చేరడంతో కొంచెం అయినా అందరిలో ఈ సినిమా కోసం మాట్లాడ్డం జరిగింది. అలా టీజర్ ట్రైలర్ లాంటివి వచ్చి బాగానే ఆకట్టుకున్నాయి. అయితే సినిమా మాత్రం వాటికి మించే ఉంటుంది అని చెప్పడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి కానీ డెఫినెట్ గా కొన్నేళ్లు వెనక్కి ఇప్పుడు 30, 35 ఏజ్ లో ఉన్న వారి అందరినీ తీసుకెళ్లిపోతుంది. సినిమాలో ప్రొసిడింగ్స్ ని దర్శకుడు ఆ రకంగా కట్ చేసాడు అని చెప్పాలి.

అలాగే తెలుగులో ఫ్రెండ్షిప్, యూత్ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు తప్పక గుర్తుండిపోతాయి. ఒక హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కేరింత లాంటివి ఆయా సమయాల్లో వచ్చి అలరించాయి. అయితే ఈ కమిటీ కుర్రోళ్ళు వాటి సరసన నిలుస్తుంది అని చెప్పవచ్చు. హ్యాపీ డేస్ కంటే కొంచెం తక్కువ కేరింత కంటే ఎక్కువగా కమిటీ కుర్రోళ్ళు అలరిస్తారు. అలాగే సినిమాలో ప్రథమార్ధం డీసెంట్ గా సాగింది అని చెప్పాలి.

బేసిక్ గా ఇది విలేజ్ డ్రామా కావడంతో దాదాపు అందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగి ఇప్పుడు సిటీలో సెటిల్ అయ్యిన వారిని వారి ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్న వారిని వారిలోని గొడవలు ప్రేమలు వంటివి చాలా బాగా చూపించాడు దర్శకుడు. అయితే ఈ సినిమాలో కొంచెం వీక్ గా అనిపించేది ఆ పొలిటికల్ టచ్ సీన్స్ అనే చెప్పాలి.

Committee Kurrollu Movie Review in Telugu  Niharika Konidela show her taste of Mark

ఎప్పుడు నుంచో ఒక ఊర్లో ఒకతనే సర్పంచ్ గా కొనసాగుతూ ఉండడం వారికి యువత ఎదురు తిరగడం వంటి ప్లాట్ లలో చాలా సినిమాలే వచ్చాయి. ఇదే నిహారిక అన్నయ్యలు రామ్ చరణ్ చేసిన "రంగస్థలం", తన సొంత అన్నయ్య వరుణ్ తేజ్ చేసిన "ముకుంద" సినిమాలు ఈ సినిమాలో సెకండాఫ్ చూస్తున్నపుడు గుర్తు రాక మానవు. కాకపోతే ఈ సినిమాలో మేజర్ హైలైట్ ఏంటంటే లైన్ ని నడిపించిన విధానం అని చెప్పుకోవాలి. 100 లో సుమారు 75 నుంచి 80 శాతం వరకు పెద్దగా బోర్ కొట్టకుండానే సినిమా వెళ్ళిపోతుంది ఇది మంచి విషయం అనుకోవాలి.

నటీనటుల పెర్ఫామెన్స్ లు ఎలా ఉన్నాయ్?

ఈ చిత్రంలో కనిపించిన ప్రధాన తారాగణం అంతా యువ నటీనటుల మీదే కనిపిస్తుంది. వారిలో అంతా కూడా మంచి పెర్ఫామెన్స్ లని ఇచ్చేసారు. అబ్బాయిల్లో అయితే యశ్వంత్ పెండ్యాల, త్రినాద్ వర్మ, మణికంఠ, ఈశ్వర్ ఇతర యంగ్ పాత్రధారులు అదరగొట్టారు. అలాగే యూట్యూబ్ ఫేమ్ ప్రసాద్ బెహరా ఐతే ఈ సినిమాలో ఆశ్చర్యపరుస్తాడు అని చెప్పాలి. తన కామెడీ టైమింగ్ కానీ ఎమోషనల్ సీన్ లో గాని తను జీవించేసాడు.

ఇక వీరి అందరిలో మెయిన్ రోల్ సందీప్ సరోజ్ ది. ఈ యివా నటుడు తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్టయ్యాడు. అలాగే చాల సీన్స్ లో మంచి అగ్రెసివ్ గా కనిపిస్తాడు. ఇక అమ్మాయిల్లో అయితే ఇంట్రెస్టింగ్ గా అందరూ క్యూట్ లుక్స్ లో ఆకట్టుకునే విధంగా ఉన్నారు. రాధ్య సురేష్ కుర్రకారు చూపులని తన వైపు తిప్పుకుంటే తేజస్వి రావు తన అమాయకపు ఎక్స్ ప్రెషన్స్ తో ఇంప్రెస్ చేస్తుంది. ఇలా యంగ్ కాస్ట్ అంతా ఈ సినిమాలో అలరిస్తారు.

అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలో ఈ అంతా కూడా యంగ్ ఏజ్ లోని కనిపిస్తారు. మిడ్ ఏజ్ లో కూడా కనిపిస్తారు ఈ వేరియేషన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా వీరితో పాటుగా సీనియర్ నటులు సాయి కుమార్ తన ఎక్స్ పీరియన్స్ ని ఈ సినిమాకి బాగా చూపించారు. ఇంట్రెస్టింగ్ గా కేరాఫ్ కంచర పాలెం నటుడు కిషోర్ కి సాలిడ్ పెర్ఫామెన్స్ చేసే రోల్ దక్కింది. ఇక వీరితో పాటుగా మిగత నటీనటులు బాగానే చేసేసారు.

Committee Kurrollu Movie Review in Telugu  Niharika Konidela show her taste of Mark

టెక్నికల్ గా ఎలా ఉంది?

ఈ సినిమా టెక్నీకల్ గా కూడా మెప్పిస్తుంది. నిహారిక అండ్ కో పెట్టిన ప్రతి రూపాయికి యూనిట్ న్యాయం చేశారు. ముఖ్యంగా అనుదీప్ దేవ్ మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసాడు. టూ గుడ్ మ్యూజిక్ తో సినిమాకి హైలైట్ అయ్యాడు. అలాగే సినిమాలో కామెడీ డైలాగ్స్, నాచురల్ డబ్బింగ్, విజువల్స్ బాగున్నాయి. ఇంకా దర్శకుడు యదు వంశీ కోసం చెప్పాలంటే ఈ సినిమాకి అతడు చాలా సింపుల్ లైన్ నే తీసుకున్నాడు కానీ దానిని తాను ప్రెజెంట్ చేసిన తీరు సినిమాలో ఆడియెన్ ని కూర్చోబెడుతుంది. తనలో మంచి ఫన్ అండ్ ఎమోషనల్ రైటింగ్ ఉంది. కాకపోతే పొలిటికల్ లాంటి సీన్స్ రోటీన్ గానే తీసాడు కానీ తాను ఇచ్చిన సందేశం, నోస్టాలిజిక్ రన్ మాత్రం ఖచ్చితంగా ప్రెజెంట్ యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇలా తన వర్క్ వరకు దాదాపు సక్సెస్ అయిపోయాడు.

చివరి మాటగా..

ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఈ "కమిటీ కుర్రోళ్ళు" ఎంటర్టైన్మెంట్ పాళ్ళు మాత్రం ఒకింత ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. మెయిన్ కాస్ట్ అంతా బాగా చేశారు (సీనియర్ నటులతో సహా). మీకొక బ్యాచ్ ఫ్రెండ్స్ ఉంటే ఈ సినిమా డెఫినెట్ గా దేఇజప్పాయింట్ చెయ్యదు. కాకపోతే ఫ్రెండ్షిప్ పార్ట్ వరకు ఓకే కానీ సినిమాలో పొలిటికల్ రిలేటెడ్ సన్నివేశాలని మాత్రం దర్శకుడు రొటీన్ గానే చూపించాడు. ఇది మినహాయిస్తే ఈ కమిటీ కుర్రోళ్ళు మాత్రం ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ తో ప్రేక్షకుల్ని మళ్ళీ కొన్నేళ్లు వెనక్కి తీసుకెళ్లి ఇలా కదా ఫ్రెండ్స్ అంటే ఉండాలి అన్నట్టుగా థియేటర్స్ లో అదరగొడతారు. ఒక్క ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ అంతా కూడా చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమానే ఇది. సో గో ఫర్ ఇట్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X