Coolie Movie Critic Review: కూలీ మూవీ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్‌ను ఏరియాల వారీగా గ్రాండ్‌గా ముగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఈ సినిమా పాటలు ట్రెండింగ్‌లోకి వచ్చి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
కూలీ సినిమా రిలీజ్‌కు ముందే ప్రభంజనం క్రియేట్ చేస్తున్నది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.

కూలీ మూవీని టెక్నికల్‌గా చాలా రిచ్‌గా నిర్మించారు. హైదరాబాద్, విశాఖపట్నం, జైపూర్, బ్యాంకాక్ తదితర ప్రాంతాల్లో షూట్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించడానికి ఐమాక్స్ వెర్షన్‌లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అని పేర్కొన్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రైవేట్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్‌ను చూశాను అంటూ జర్నలిస్టు, క్రిటిక్, యాక్టర్ కుల్దీప్ గాడ్వీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఈ సినిమా టెర్రిఫిక్‌గా ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చూడని విధంగా అమీర్ ఖాన్ కొత్త అవతారంలో అదరగొట్టారు. ఇక రజనీకాంత్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు చూడని రజనీని ఈ సినిమాలో చూస్తాం అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో నాగార్జున అక్కినేని, శృతిహాసన్, పూజా హెగ్డే, ఉపేంద్ర ప్రతీ ఒక్కరు సూపర్బ్ ఫెర్ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకొంటారు. తమకు లభించిన పాత్రలను స్క్రీన్‌పై అదరగొట్టారు. అనిరుధ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మాస్టర్ స్ట్రోక్. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మాస్ బ్లాక్‌బస్టర్ సినిమాను డెలివరీ చేశారు. ఈ సినిమాకు నా రేటింగ్ 5 పాయింట్లకు 5 పాయింట్లు వేస్తాను అని ఆయన పేర్కొన్నారు.
ఇక కూలీ సినిమా గురించిన ట్వీట్ చేసిన కుల్దీప్ గాధ్వీ జర్నలిస్టుగా, బాలీవుడ్‌లో యాక్టర్‌గా ప్రొఫెషన్‌ను కొనసాగిస్తున్నారు. సినిమా క్రిటిక్‌గా ఏడాది కాలం నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఇక ఈ సినిమా ఆయన వెల్లడించిన అభిప్రాయాన్ని పక్కన పెడితే.. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ కథనాల గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











